మంచి మాట

కోరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో మనిషికే కాదు ప్రతి ప్రాణికి కోరిక ఉంటుంది వ్యక్తపరచగల శక్తి మాత్రం మనిషికే ఉంటుంది. కోరిక ఉండడం సహజం. మనిషి బతికి బట్టకట్టడానికి పురోగమించడానికి కోరిక అవసరం కూడా. కోరిక లేని మనిషి మట్టిముద్ద. మనసులో పుట్టిన కోరిక ఆ మనసునే కోరికల పుట్టగా మారుస్తుంది. అన్నింటికీ మంచి, చెడు ఉన్నట్టే కోరికలకు గతులు ఉన్నాయి...పురోగతికి దోహదపడేవి, అథోగతికి అణగదొక్కేవి. మనిషి బుద్ధి కుశలతను బట్టి ఈ గతులు ఉంటాయి.
అనంతమైన కోరికలకు ఆలవాలమైన మనస్సు చంచల స్వభావం కలది. అది ఇంద్రియాల వెంటనంటి ఉంటుంది. అది కోరికలను రేపుతుందే కానీ అణచదు. ఒక కోరిక తీరితే ఇంకొకటి రేకెత్తుతునే ఉంటుంది. అలా మనసు కోరినవన్నీ తీరాలన్నా, తీర్చాలన్నా, సాధ్యమయ్యే పనేనా? కోరికలు సహజసిద్ధమైనవై, మనిషి మనుగడకు, జీవికకు అత్యంతావశ్యకములుగా వుండాలి. అవి తీరే ఫ్రయత్నం చేయాలి. ఎవరికో ఏదో ఉందని అదీ మనకు కావాలని కోరుకోవడం(అంత స్థాయి మనకు ఉందో లేదో ఆలోచించకుండా)...అట్టి మనస్తత్వం అభిలషణీయం కాదు. మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను, ఎదుటివాడికుందని ఏడిస్తే రెండో కన్ను పోయిందన్న చందంగా ఆశలకు పోతే, ఆ ఆశలు అత్యాశలై పేరాశలై, దురాశలై దుఃఖానికి దారి తీస్తాయి. కోరిక బలీయమైతే అది మనిషి ఉనికిని దెబ్బతీసి అన్యాయాలకు, అక్రమాలకు అకృత్యాలకు పాల్పడేలా చేస్తాయి. బలవత్తరమైన కోరిక విచక్షతను కోల్పోయేలా చేస్తుంది. మనసును చెప్పుచేతలలో ఉంచుకోగలిగినపుడే చెలరేగే కోరికలను అదుపు చెయ్యగల శక్తి వస్తుంది. మనసుకు తృప్తిని అలవాటు చేయాలి. మనసును సంతృప్తిపరచాలి. మనసు అధీనంలో మనిషి ఉండకూడదు. మనిషి అధీనంలో మనసుండాలి.
భగవంతుడు మనం కోరకుండానే మనకీ జన్మనిచ్చాడు. భూమి మీదకి రాకముందే ప్రాణి రక్షణకు, పోషణకు అన్ని ఏర్పాట్లు చేసాడు...ఇది ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఆ స్థితిలో భూమి మీదకి వచ్చిన మనిషి బతికి బట్ట కట్టిన తరువాత తనంత వాడు లేడనే స్థితికి చేరుకుంటున్నాడు. మనగడకు కావాల్సిన జీవితావసరాలకు మించి సంపాదించాలి, ధనం, అధికారం, ఆధిపత్యం ఇలాంటి బలీయమైన కోరికలు మనిషిలో అలజడులు రేపుతాయి. కోరికలను అంచుకోలేక మనసు ఆరు శత్రువుల (అరిషడ్వర్గాల)పాలపడుతుంది. కోరికల నియంత్రణకు మనసును కట్టుదిట్టం చేసుకోలేనప్పుడు పుట్టిన కోరిక (కామం) మనసును నిలువనియ్యదు. కోరిక తీరకపోతే క్రోధం (కోపం) వస్తుంది. ఆ తరువాత సంపాదించి మూటలు కట్టాలనే గానీ, పిల్లికి కూడ బిచ్చం పెట్టడానికి మనసొప్పని లోభం, సంపాదన మీద మోహం, దాన్ని (్ధనం) చూసుకుని మదం (గర్వం), తనకంటే గొప్పగా బతుకుతున్నవాడిని చూస్తే మత్సరం (అసూయ, ఈర్ష్య) ఇలా అన్ని అవగుణాలు సంప్రాప్తించడానికి కారణం కోరిక!
భగవంతుని గురించి పుణ్య క్షేత్రాల గురించి చెప్పేటప్పుడు కోరికలన్నీ తీరుస్తాడు, తీరుతాయి అంటూ పరిచయం చేస్తూ ఉంటారు. అంటే కేవలం కోరికలు తీర్చుకోవడానికేనా భగవద్దర్శనం! కొందరు కోరికలు తీరాలని దేవునికి మొక్కుతుంటారు. ‘నీకు అదిస్తామని, ఇవి ఇస్తామని’...కోరికలు తీర్చుకోడానికి లంచాలా! మనం కోరకుండానే ఈ జన్మనిచ్చి భూమి మీదకి రాకముందే బతకడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి మనకేది కావాలో నిర్ణయించి భూమి మీదకి పంపిన దేవునికి కృతజ్ఞులమై ఉండాలి...మన మనసును, బుద్ధిని వక్రమార్గాలు పట్టకుండా అదుపు చేసుకోగల శక్తిని ప్రసాదించమనాలి, పదిమందితో కలిసి జీవించి పదుగురి మేలు కోరి సహాయపడే నిస్వార్ధ బుద్ధిని ఇవ్వమని కోరాలి. కోరికలు ఇలా ఉండాలి గానీ స్వార్ధపూరితంగా గొంతెమ్మకోరికలుగా వుండరాదు. విపరీతమైన కాని కోరికలు కోరి, చేసిన తపస్సులు, కృషిని వృధా చేసుకుని పతనమైన వారి, నశించిన వారి కథలెన్నో చరిత్రలో పురాణాల్లో విన్నాము, వింటున్నాము.
వేదాధ్యయనాలు, ఉగ్ర తపస్సులు, యజ్ఞ యాగాలు ఎన్ని చేసినా కోరికలను చంపుకోలేకపోతే అవన్నీ వృధా!

-రేవతి