మంచి మాట

దివ్య సంపదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భరతదేశంలో జన్మించిన పెద్దలనుండి మానవులందరూ తమ తమ సంస్కారాలు నేర్చుకోవాలి అని మనువు స్పష్టంగా చెప్పాడు. భారతదేశం విశ్వవిజేత కావాలని కోరలేదు. అయితే విజ్ఞానం, సంస్కారాల కారణంగా ఈ దేశం విశ్వగురువు స్థానాన్ని అధిష్ఠించింది. భగవంతుడు పుట్టుకతోనే ప్రతిమనిషికీ కొన్ని దివ్య సంపదలను బహుమతిగా ప్రసాదించాడు. వాటినే మనం సంస్కారాలు అంటున్నాం. నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఆ సంస్కారాలు మనిషిని మహోత్కృష్ట స్థాయికి తీసుకు వెళ్లగలుగుతాయి. ‘‘ప్రపంచ ప్రజలకు సహిష్ణుతాభావాన్ని, సర్వమత సమాదరణా ప్రవృత్తిని నేర్పించిన ధర్మానికి చెందినవాడను కావడం నాకు గర్వకారణం’’ అని స్వామి వివేకానంద అంటారు. సహిష్ణుతను శ్రీకృష్ణ పరమాత్మ భక్తియోగంలో ఈ విధంగా వివరించాడు. ‘‘అన్ని ప్రాణులను ప్రేమించువాడు, అన్ని ప్రాణులయందు మిత్రభావం కల్గి దయతో నాదరించువాడు, మమకారము అహంకారము లేనివాడు, సుఖ దుఃఖములతో సమానచిత్తముతో ఓర్చుగలవాడు, నిత్య సంతోషి, నిత్యదానపరుడు, మనోనిగ్రహం కలవాడు, సందేహం లేనివాడు నా భక్తుడు’’.
ఈ దివ్యశక్తులు, సంస్కారాలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనంజరిగిందంటారు. తను అనుకున్నది సాధించుకోగల శక్తిని మనిషికి సృష్టించాలని తలచేరట దేవతలు. అయితే ఆ శక్తిని ఎక్కడ ఉంచాలన్న సందేహం వారికి కలిగింది. కొందరు సముద్ర గర్భంలో దాచమని, కొందరు ఆకాశంలో దాచమన్నారు. మరికొందరు గాలిలో అయితే బాగుంటుందన్నారు. మరికొందరు చీకట్లో నుంచమని, దానితో ఏకీభవించనివారు వెలుతుర్లో దాచమన్నారు. అయితే ఇందులో ఏ ఒక్కటి అందరి ఆమోదం పొందలేకపోయింది. మనం మనిషికి అపూర్వ శక్తిని ప్రసాదించాలనుకుంటున్నాము. అందువలన ఎక్కడో దూరంగా ఉంచి ప్రయోజనం ఏమిటి? ఆ శక్తులన్నింటిని మనిషి అంతరంగంలోనే దాచి ఉంచాలని బ్రహ్మదేముడన్నాడు. కానీ మనిషి మాత్రం ఆ విషయం తెలియక ఆ శక్తుల కోసం బాహ్య ప్రపంచంలో అనే్వషణ చేసుకునేలా మెలిక పెట్టారట దేవతలు. తత్ఫలితంగా అనాదిగా మానవుడు తనను ఉద్ధరించే శక్తులు తనలోనే ఉన్నాయనీ, భగవంతుడు కడు విలువైన కానుకలను తన అంతరంగంలోనే దాచిపెట్టాడని తెలియక అయోమయంగా పరుగులు పెడుతున్నాడు. అయితే ఆ దైవ రహస్యాన్ని తెలుసుకొని తమలో నిబిడీకృతమైన ఆ శక్తియుక్తులను వెలికితీసి విజేతలుగా ఎదిగారు కొందరు.
అంతఃకరణ భక్తియోగ్యమై ఉండుట, ఆత్మ నిగ్రహము, శ్రౌత, స్మార్తయజ్ఞములు, వేదాధ్యయనము, త్రికరణ తపస్సు, సర్వదా ఋజువర్తన కలిగియుండుట, అహింస, సత్యసంధత, క్రోధ రాహిత్యం కారణములున్నను కోపోపశమనము, సన్న్యాసము, శాంతి, పరదోషములను ఎన్నకుండుట, భూతదయ, విషయసాన్నిధ్యమున ఇంద్రియ వికారము లేకుండుట, మృదు స్వభావము కలిగియుండుట, సిగ్గు, మనో వాక్కాయ కర్మలయందు వ్యర్థ కార్యములను వీడుట, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, అత్యంత గౌరవము పొంది నమ్రత్వము కలిగియుండుట.
ఈ దివ్య సంపదలను అసురీయ ప్రవృత్తి గలవారు పొందలేరు. ఈ దివ్య సంపదల గురించి మరింత లోతుగా చూద్దాము. బలము- మనను మనం శక్తిసంపన్నులుగా నిరూపించుకునేందుకు ఆ విధాత బలాన్ని దాచి ఉంచాడు. ఈ బలం నాలుగు రూపాల్లోనుంటుంది. శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక బలాలు. మనిషి జీవితం ఈ బలంపైనే ఆధారపడి ఉంటుంది. అంతఃసౌందర్యము- మనస్సు, వాక్కు, కర్మ పవిత్రమై ఒక్కటిగా ప్రతిఫలించినపుడే మన అంతఃసౌందర్యము అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది.. జీవితంలో మంచి చెడులు, కష్టసుఖాలు ఉంటాయి. చెడు జరిగినా కష్టం వచ్చినా ఆత్మవిశ్వాసం సడలరాదు. నీ జీవితంలో చీకటి తొలగి వెలుతురు వస్తుంది. ఆ విశ్వాసం నీలో పదిలంగా ఉండాలి. ఉల్లాసం- ఉల్లాసం ఔషధం లాంటిది. ఉల్లాసం మనలను ఉత్తేజితుల్ని చేస్తుంది.

- గుమ్మా ప్రసాదరావు