మంచి మాట

జీవనయానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయ. ఎవరైనా ఆనందంగా తమ జీవితం గడిచిపోవాలనే చూస్తారు. మన రామాయణాది కావ్యాలు భారతం, భాగవతం లాంటిఇతిహాసాలు, గ్రంథాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనిషి ఎట్లా ఆనందం పొందడానికి మార్గాలు చూపుతాయ. ప్రతి కావ్యంలోను, గ్రంథంలోను- ఏ పుస్తకంలోనైనా కనీసం సామాజికాంశాలు చెప్పే పుస్తకమైనా మంచి చేస్తే పుణ్యం వస్తుందని చెడు చేస్తే పాపం వస్తుందని చెప్తాయ. వ్యాసమహర్షి కూడా హితమైన కార్యం చేస్తే పుణ్యమని, పరులను పీడించడమే పాపమని చెప్పారు.
కోరిక అనేది లేకపోతే దుఃఖమే ఉండదని బుద్ధుడు చెప్పాడు. కోరికలను లేకుండా చేసుకోవడం అంత సులభమైన పనికాదు. శిరిడీ సాయబాబా మొదట కోరికలతో భగవంతుని దగ్గరకు రండి. ఆ తరువాత ఆ భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చుకోండి. ఇక అపుడు మీకు కోరికలు ఏవీ లేకుండా పోతాయ. కేవలం భగవంతుని సానిధ్యం తప్ప మీరు మరేమీ కోరని వారు అవుతారు అనిచెప్పారు.
కోరికలు లేకుండా చేసుకోవడం అనేది సాధారణమైన మానవునికి అసాధ్యమైన పని. ఆ కోరికలను అదుపులో పెట్టుకోవడానికి త్యాగమనే గుణాన్ని అలవర్చుకోవా లంటారు పెద్దలు. ఈ త్యాగగుణం అలవర్చుకోవడానికి ఎందరోమహానుభావుల జీవిత చరిత్రలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈ లోకంలో విద్యలన్నీ నేర్పేది గురువే. దత్తాత్రేయుడు తాను 24మంది గురువుల దగ్గర నుంచి విద్యనేర్చుకున్నానని చెప్తారు. చూచే కన్ను, నేర్చుకునే తత్వం ఉంటేచాలు ప్రతి విషయంలోను మంచి చేయాలని తెలుసుకోవడమో లేక చెడు చేయకూడదనోతెలుసుకోవచ్చు అంటారు.
ఇలా పాపమో పుణ్యమో చేస్తే దాని ఫలితం అనుభవించడానికి ఏదో ఒక జన్మ రానేవస్తుంది. కనుక మరికొందరుఅసలు జన్మరాహిత్యాన్ని కోరుకుంటారు. ఏపని చేసినా వారు నిమిత్తమాత్రులమని చేయంచేది చేసేది అంతా భగవంతుడే నని తెలుసుకొని ఆ పనిమీద ఏ ఆపేక్ష లేకుండాపనిచేస్తారు.
పాము జీవితాన్ని పరిశీలిస్తే పాము తనంతట తాను పుట్టను నిర్మించుకోదు. ఏ చీమలో పెట్టిన పుట్టలో ఉన్నన్నాళ్లుండి కుదరని రోజున మరో చోటుకు వెళ్లిపోతుంది. పాము చేసే ఈ పని బంధాలకు దూరంగా ఉంటే ఎంతో శాంతిగా ఉండొచ్చని మనకు తెలుస్తుంది.
భగవంతుడు కూర్చిన ఈ బంధాలను తామారాకుపై నీటి వలె సాగిస్తే కర్మల తాలూకా వచ్చే ఫలితాలు అంటకుండా ఉంటాయ. మానవుడొక్కడే తనకే కాక తనవారికోసం కూడా సంపదను దాస్తుంటాడు. కాని పశుపక్ష్యాదులు ఎప్పటికప్పుడు ఆహారానే్వషణ చేస్తాయ. దీనివలన ఆ సంపదను దాచి పెట్టడం దానిపైన మమకారాన్ని పెంచుకోవడం అనేవి అలవడవు. కనుక మానవుడు కూడా తనకు ఎంత అవసరమో అంతమాత్రమే సమకూర్చుకోవాలి. లేక పోతే సంపాదించిన దాన్ని తాను అనుభవించకుండా పిసినారి వలె దాస్తే చివరకు తెనెటీగలు కూర్చుని తేనెవలే పరుల పాలు అవుతాయ. దానివల్ల దుఃఖమే కాని సంతోషం రాదు. మానవుడు ఎపుడైనా సరే వలసినంత మాత్రమే యత్నం చేసి ఫలితాన్ని కోరుకోవాలి. ఆ ఫలితాన్ని కూడా నలుగురితో పంచుకున్నపుడే ఆనందం వస్తుంది.
వేటగాడు వేటాడే సమయంలో ఎలాగైతే లక్ష్యానే్న ఏకాగ్రతతో చూస్తుంటాడో అలానే జిజ్ఞాసి కూడా తన లక్ష్యాన్ని తప్ప వేరు దానిమీద మనసును మళ్లించకూడదు. బాణ ప్రయోగార్థమై ఉన్న అర్జునునికి కేవలం పక్షి కన్ను ఏవిధంగా కనిపించిందో మనుష్యులు కూడా తాము ఈలోకానికి వచ్చిన కారణమేమిటో ఏవిధమైన ధర్మాచరణలను పాటించాలో తెలుసుకొంటే భగవంతునికి ఇష్టమైన జీవనయానాన్ని చేయవచ్చు. సదా సత్యధర్మాలను పాటించేవారిని ఇహలోకంలోను పరలోకంలో సంపదలు వాటికవే వచ్చి చేరుతాయ.

- జి. కల్యాణి