మంచి మాట

భక్తిమార్గము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ భావమే భక్తి అని నారదమహర్షి అన్నారు. సమబుద్ధి తో సర్వప్రాణులను చూసినపుడు సర్వాంతర్యామి అయన భగవంతుని ఆరాధించినట్లే అవుతుందనేది పెద్దల ఉవాచ. మన ఆత్మస్వరూపమును సదా చింతన చేస్తూ పరమాత్మతో ఐక్యమొనర్చుటే భక్తి అని శంకరాచార్య చెప్పారు. సర్వం ఈశ్వరమయం అని తెలుసుకొని భగవంతునికి తత్వాన్ని ఎరుకపర్చుకుని జీవించడమే భగవంతుని పూజించినట్టు అవుతుందనేది భక్తుల నమ్మకం. ఎవరైతే ప్రతి నిత్యము నన్ను పరిపూర్ణ విశ్వాసంతో అత్యంత భక్తితో ఎడతెగక ధ్యానిస్తూ, ఎల్లప్పుడూ నాయందే నిష్ట కల్గి యుంటారో, అట్టివారి యొక్క సర్వయోగ క్షేమములను నేనే వహించుచున్నాను అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించి యున్నారు. సర్వభూతములు ఎవ్వని లోపలనున్నవో, ఏ పురుషుని చేత ఈ సర్వ జగత్తు వ్యాపించబడి యున్నదో, అట్టి పరమపురుషుడు అనన్యభక్తి చేతనే పొందదగినవాడు అని భగవద్గీతలో చెప్పబడింది.
వారి వారి మనస్తత్వమును, స్థాయిని బట్టి భగవంతునిసాయుజ్యాన్ని చేరడానికి అత్యంత సులువైన మార్గం భక్తిమార్గము ఒక్కటే. భక్తి అనునది నిర్హేతుకంగా ఉండాలి. పూర్ణ విశ్వాసంతో ఉండాలి. పరిపూర్ణ విశ్వాసంతో, నిస్వార్థంగా భగవంతుణ్ణి శ్రద్ధ్భాక్తులతో నిరంతరం ఆరాధించాలి. ఇలా భగవంతుణ్ణి ఆరాధించే భక్తిమార్గాలు తొమ్మిదివిధాలుగా చెప్తారు. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, సఖ్యము, ఆత్మనివేదనము, పాదసేవనము, దాస్యము. ఈ భక్తి మార్గములనే భక్తియోగమనీ అంటారు. నారద మహర్షి, వాల్మీకి, హనుమంతుడు, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, భక్తకన్నప్ప, పోతన, భక్తరామదాసు, అన్నమయ్య, త్యాగరాజు, మీరాభాయి, రామకృష్ణ పరమహంస, అంబరీషుడు మొదలైన వారందరూ ఈ నవవిధ భక్తిమార్గంలో నడిచి భగవంతుని ప్రేమను పొందినవారే. భక్తిమార్గం అతి సులువైనది. అందరూ ఆచరించ దగ్గది. ఇందులో ఫలానా మంత్రాన్ని ఇన్నివేల లక్షల సార్లు జపించాలన్న నియమేది లేదు. భగమంతని ఈరూపంతోనే పూజించాలని కాని లేక నిర్గుణంగా భగవంతుని ఉపాసించాలని కాని ఎటువంటి నియమమూ లేదు. కేవలం భగవంతుని పైన అవాజ్యమైన ప్రేమ ఉండాలి. ఎటువంటి శంకలు లేకుండా భగవంతునిపై అచంచలమై నమ్మకం ఉండాలి. అపుడే కోరిన రూపం లో భగవంతుడు తనకు తానే దర్శనమిస్తాడు.
ఇట్లా భగవంతుడు వస్తాడన్నదానికి ఎందరి భక్తుల గాథలో ప్రత్యక్షనిరూపణం చేస్తున్నాయ. మొసలికి చిక్కిన గజేంద్రుడు అల వైకుంఠపురి ఆమూలాగ్రమున.. అంటూ అక్కడెక్కడో తన భార్యతో పాచికలాడే వాడు తన్నురక్షించాలి అదీ గూడా ఉన్నవాడు ఉన్నట్టుగా రావాలి అంటే ఆ మహావిష్ణువు సిరికిం చెప్పక, శంఖుచక్రాలను చేపట్టక గజేంద్రుని ఆర్తి తీర్చడానికి పరుగెత్తుక వచ్చేసాడు. ఆయన ఆయుధాలు, ఆయన భార్యామణి అడుగులో అడుగు వేసుకొంటూ ఆయనతో పాటే గజేంద్రుని దగ్గరకు వచ్చేసారు. తన చక్రాయుధంతోటి మొసలి కుత్తుకను కత్తిరించి ఆర్తితో పిలిచిన గజేంద్రుణ్ణి రక్షించాడు ఆ మహావిష్ణువు. అయనా సర్వమూ భగవంతుడే అయనపుడు ఆయనకు శత్రునిర్మూలనం చేయడానికి తన భక్తులను రక్షించడానికి ఆ యుధాలు కావాలా? అక్కర్లేదు అనడానికే నరమృగరూపంలో తన గోర్లనే ఆయుధాలుగా మార్చి తన నిజభక్తుడైన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుని నుంచి కాపాడాడు. అపుడు ఇపుడు అను భేదమేమీ పాటించకుండా తింటున్నా, తాగుతున్నా, కూర్చున్నా, నిల్చున్నా, నిద్రపోతున్నా కూడా శ్రీహరి నామానే్న నిరంతరం జపించే ఆ రాక్షసరాజు తనయుడు తనకు అత్యంత ఆప్తుడు తనే్న నమ్మినవాడు తనగురించి అందుఇందులేడని సందేహము వలదు. నీవెక్కడ చూస్తే అక్కడే నీకు దర్శనమిచ్చే ఆపద్బాంధువుడు అనంతుడు అని చెప్పే ప్రహ్లాదుని కోసం అక్కడ ఇక్కడ అని లేకుండానే స్తంభంనుంచి ఆవిర్భవించాడు. అట్లాంటి భగవంతుని గూర్చి ఎంత చెప్పినా తక్కువే. అన్ని నామాలు కలవాడు కనుక అనంత నామధేయుడని, అన్నిరూపాలు ఆయనవే కనుక అనేకరూపధారుడని సహస్ర శీర్షః .. అని కీర్తిస్తారు భక్తులు.

- హనుమాయమ్మ