మంచి మాట

దానగుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగంలో నామస్మరణ చేయడం, దానం చేయడమే పాపనాశనానకి కారణాలు అవుతాయని శాస్త్రం చెప్తోంది. దానం అనేది ఒక సద్గుణము, త్యాగానికి మరో రూపం. అడిగితే ఇచ్చేది దానం అని చెప్పుకున్నా అడగకున్నా ఎదుటివారి అవసరాన్ని గుర్తించి వారు అడగకుండా దానంచేసేది నిజమైన దానం. అందుకే పాత్ర యెరిగి దానం చేయమన్నారు. ఈ దానం కూడా కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. దానం చేసామని పదేపదే చెప్పుకోవడం వల్ల పాపమొస్తుందని అంటారు. ఇక్కడ పాపమంటే గర్వం రావడమే అంతరార్థంగా గుర్తించాలి. అహంకారం పెరిగితే ఎంత దానం చేసినా అది దుర్వినియోగం చెందుతుందే కాని మరి దేనికీ పనికిరాదు.
దానం అనేది ఒక గుణంగా భాసిల్లాలి కాని పేరు రావడానికని దానం చేయకూడదు. ఒకసారి తాను ఇచ్చిన అర్థరాజ్యంతో కర్ణుడు రాజు అయ్యాడు కాని దానం చేయడంతో నాకన్నా ఎక్కువ పేరు గడిస్తున్నాడనుకొన్న దుర్యోదనుడు కర్ణునికన్నా తానే గొప్పవాడిని, రారాజును కనుక ఆ దానమేదో తానే చేస్తాను అపుడు తనకే పేరు వచ్చేస్తుందనుకొన్నాడు. వెంటనే ధర్మగంటను ఏర్పాటు చేయంచాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తనకు చెప్పుకోవచ్చునని చెప్పాడు.
ఒకరోజు బ్రాహ్మణుడు వచ్చి తనకు వంటచెరుకు కావాలన్నాడు. దానిదేముంది ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్పాడు దుర్యోధనుడు. ఇపుడేక్కర్లేదు. అవసరమొచ్చినపుడు వచ్చి తీసుకెళ్తాను అని ఆ బ్రాహ్మణుడు వెళ్లిపోయాడు. ఆతరువాత కర్ణుని దగ్గర కూడా ఇలానే మాట తీసుకొని వెళ్లిపోయాడా విప్రుడు. కొన్నాళ్లు గడిచాక మంచి వానలు కురిసి కట్టెలన్నీ తడిసిపోయ ఉన్నకాలంలో దుర్యోధనుడి దగ్గరకువచ్చి ఇస్తానన్న వంట చెరుకు ఇవ్వమని అడిగాడు.
దుర్యోధనుడు విపరీతమైన కోపం వచ్చింది. వానాకాలంలో వచ్చి వంటచెరుకు ఇవ్వమనడం బాగుందా అని అతడితో పోట్లాట వేసుకొని ఎండాకాలంలో వచ్చి తీసుకెళ్లమని చెప్పి పంపించివేశాడు. ఆ విప్రుడు కర్ణుడు దగ్గరకు వెళ్లాడు. అకాలంలో వచ్చిన బ్రాహ్మణుడిని చూచి తాను దానం చేయడంలో వెనుకబడి ఉన్నాననుకొని అతిథి మర్యాదలు చేసి తన ఇంటికి ఉన్న కలపస్థానంలో తన బాణాలను నిలబెట్టి ఆ కలపను తీసుకొని వచ్చి బ్రాహ్మణుడికి దానం ఎంతో వినయంతో ఇచ్చాడు. కలపను తీసుకొన్న బ్రాహ్మణుడు కర్ణుడిని దీవించి వెళ్లాడు.
ఈ సంగతి తెలుసుకొన్న దుర్యోధనుడు అయ్యోనేను ఆ పనిని చేస్తే బాగుండేది కదా అనుకొని దానం చేయడంలో కర్ణుని నైజమెరిగి దానం చేయడానికి కర్ణుడే సాటి అని దుర్యోధనుడు తన దానగంటను తీసివేయంచాడట. అట్లా దానం చేయడమనేది తన మనఃపూర్వకంగా చేయాలి కాని పేరుకోసం చేయకూడదు.
దానం అనేది తెలిసినవారికంటే, తెలియనివారికి చేయడంలో అనంతమైన ఫలం లభిస్తుంది. న్యాయబద్ధముగా సంపాదించిన ధనానే్న దానమివ్వాలి కాని, అక్రమ మార్గాలలో, అవినీతి పనులతో ఆర్జించిన ధనముతో దానం చేస్తే దానఫలం దక్కదని అంటారు.పౌర్ణమి, అమావాస్య రోజులలో లేదా పండుగ పర్వదినాలలో నిష్కామముగా సంకల్ప పూర్వకంగా ఆర్తులకు మంచి జరగాలని, మనఃపూర్వకంగా దైవాన్ని ప్రార్థిస్తూ మన శక్త్యానుసారం దానం చేయాలని పురాణాలు చెప్తున్నాయ.
భూమి, హిరణ్యం , వెండి, గోవు, నువ్వులు, నెయ్యి, వస్త్రం, ధాన్యం, బెల్లం, ఉప్పు మొదలైనవి దశ దానాలు. కపిల గోవు, వెండి, బంగారం, రత్నం, కన్యాదానం, భూదానం, గృహదానం, గ్రంథం, నువ్వులు, వస్త్రం, ధాన్యం, ఏనుగు, అశ్వం, శయ్య, గొడుగు, పాదుకలు మొదలైనవి షోడశ మహాదానాలు. మానవుడు తన జీవిత కాలంలో ఎన్ని దానాలు చేసినప్పటికీ ‘అన్నదానం’తో సమము కావని ధర్మశాస్త్రం చెబుతోంది.

- హనుమాయమ్మ