మంచి మాట

దేవతార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజలు కాని వ్రతాలు కాని చేసేవారికి, చూచేవారికి మానసికానందాన్ని కలిగిస్తాయ. కాని, రాక్షసులు చేసిన తపస్సులు, వారుకోరుకున్న వరాలు అన్నీ వారి నాశనానికే దారితీశాయ. ఎందరో భక్తులు తమకున్నదానిలో భగవం తుణ్ణి మెప్పించి సర్వలోకాల్లో పూజించబడే పుణ్యాత్ములుగా వాసిగాంచారు. ఈ పూజించే విధానాన్ని బట్టి పూజలు మూడు రకాలని అంటారు. అవి సాత్త్విక, రాజస, తామస పూజలు. శివ పార్వతులు, విఘ్నేశ్వరుడు, శ్రీహరి, లక్ష్మిఆదిత్యుడు..ఇత్యాది దేవుళ్ళను సభక్తిపూర్వకంగా పూజించే విధానమే సాత్త్విక పూజా విధానం. పవిత్ర సమయాల్లో సముద్ర స్నానం లేదా నదీ స్నానం ఆచరించడం, సాత్వికమైన ఉపవాస దీక్ష, జాగరణతో కూడిన శివనామస్మరణ చేయుటం. తమ తమ ఇష్టదేవతా మూర్తులను విగ్రహరూపంలో అర్చించటం, వారిని యథార్థంగా చూస్తున్నామన్న భావనతో ఉండడం, భగవంతునికి పూజచేసే సమయంలో అనిర్వచనీయమైన అనుభూతిని పొందడం లాంటివన్నీ కూడా సాత్వికమైన పూజలు.
ఈ సాత్వికమైన పూజనే సజ్జనులందరూ ప్రతిరోజు చేస్తుంటారు. కొంతమంది ధ్యానంకూడా చేస్తుంటారు. నిశ్శబ్ద వాతవరణంలో భగవంతుణ్ణి మనసావాచా కర్మణా భావిస్తూ మనసును అర్పించి చేసే పూజ నిజమైన పూజ. ఈ పూజావిధానంలో ఎవరికోసమో కాక తమను రక్షించమని , తమ కోరికలను నెరవేర్చమని తమను గుర్తించమని వేడుకుంటుంటారు. మరొక విధానం- రాజసపూజ అంటే దేవుని అర్చించేవిధానంలో ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయ. ఇక్కడ చూచే వారి కోసం దేవుని పూజిస్తున్నట్టు ఉంటుంది. భారీఎత్తున పుష్పాలు, నివేదనలు మంత్రో చ్ఛారణలు ఉంటుంటాయ. ఈ పూజవిధానంలో భగవంతుని మెప్పించడం కన్నా తమను అందరూ అధికులుగా భావించాలి అనుకొంటుంటారు. అందువల్ల చిత్త శుద్ధి లేక చేసే శివపూజ ఎక్కువ భాగం వ్యర్థంగా పోతుంది.
ఈ రెండుకాక మరొక పూజావిధానం దురుద్దేశంతో కూడుకుని ఎదుటి వారిని నాశనం ఛేయాలనో లేక తామొక్కరే ఈ లోకంలో ఉండాలనే ఆలోచన్లతో పూజలు చేస్తుంటారు. ఇందులో భయంకరమైన నివేదనలు, అర్చనా దులను సల్పుతారు. ఇటువంటి పూజావిధానాల వల్ల పూజ చేసేవారి కొచ్చిన లాభమేముంటుందో తెలియదు. కాని, వారు అన్యాయంగా, అక్రమంగా చేసే ఈ పూజల వల్ల ఎదుటి నాశ్నం చేయడమేమో కాని వారికై వారు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు.
ఏది ఏమైనా ఏ శాస్తమ్రైనా, గ్రంథమైన, కావ్యమైనా తన్ను తాను ఉద్దరించుకోమని చెప్తుంది. తనలోని కామక్రోధాది గుణాలను దూరం చేసుకోవాలని చెప్తుంది. ఈ దుర్గుణాలను దూరంచేసుకొని సత్వగుణ సంపన్నుడుగా ఉండాలని కోరు కునేది నిజమైన పూజ. ఈ జన్మ లభించి నందుకు భగవంతునికి ప్రీతిపాత్రంగా పరులల్లో పరమాత్మను చూ స్తూ తాను ఒక్కడే బాగుండాలనే కాక నలుగురూ సుఖ సంతోషాలతో జీవించాలనే తత్వ్తాన్ని ఎరుకపర్చుకునే పూజలే మానవులకు అవసర మైనవి. దైవ తత్త్వాన్నిఅర్థం చేసుకొంటే మానవుల్లో మహితాత్ములుగా మసలవచ్చు.

- చివుకుల రామమోహన్