మంచి మాట

సత్వరూపిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుద్ధ సత్వరూపంలో శ్రీహరి ఇల్లాలుగా ఉన్న అమ్మనే మహాలక్ష్మిగా కీర్తింపబడుతుంది. ఈ తల్లి కూడా అధర్మపంచన చేరితే తన పదునెనిమిది చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం కమలము, ధనస్సు, కలశము, దండం, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము ఘంట, మద్య పాత్రము, శూలం, పాశం, సుదఠ్శనచక్రము, ధరించి ప్రవాళమణివర్ణంతో తామరపూవుపై చిరునవ్వుతూ పలకరిస్తూ దర్శనమిచ్చినా ఆ అధర్మపరులను శిక్షిస్తుంది. అందుకే ఈ మహాలక్ష్మి అవతారంలో కూడా రాక్షసులను దునుమా డిందని చెబుతూ దసరా నవరాత్రుల్లో ఆది పరాశక్తికి ఓ రోజున మహాలక్ష్మిఅవతారంగా కూడా భావించి పూజిస్తారు. అ తల్లిని తనకు ఎండిన ఉసిరికను దానం చేసిన ఇల్లాలుకోసం ధనం ఇవ్వమని ఆదిశంకరాచార్యులు స్తుతి చేశారు. ఆ ఇల్లాలుకున్న పూర్వజన్మ పాపాన్ని కూడా దూరం చేసి మరీ ఈజన్మలో సంపదలనివ్వమని చెప్పారు. ఈ సందర్భాన్ని బట్టి చూస్తే ఈ మహాలక్ష్మి సంచిత పాప రాశులను దగ్ధం చేసే మహాతల్లిగా కనబడుతుంది. ఈ తల్లి దేవదానవులు పాలసముద్రాన్ని మధించినపుడు ఆ కడలి నుంచి పైకి వచ్చింది. ఆ తల్లిని దేవతలంతా కలసి వైకుంఠ వాసునికిచ్చి వివాహం చేశారు. అందుకే లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం అని అన్నా శ్రీహరి ఇల్లాలుగా ప్రసిద్ధి చెందింది. ఈ తల్లి ధర్మపరులను సదా రక్షిస్తుంది.శ్రీసూక్తం ఈ తల్లిని వైభవాన్ని కీర్తిస్తుంది. ఈతల్లి జ్ఞానాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. మోక్షాన్నిచ్చే తల్లిగాను, సిద్ధినిప్రసాదించే సిద్ధలక్ష్మిగా భావిస్తారు. స్నిగ్ధ దృక్కులను కలిగిన ఈతల్లిని అన్నింటా జయాలనిమ్ము అని షోడశోపచారాలతో పూజిస్తారు. నమస్తేస్తు శ్రీపీఠే సురపూజితే అంటూ ఇంద్రాది దేవతలు ఈ తల్లిని కొలిచినవారే.అంతటి మహాశక్తియైన మహాలక్ష్మీదేవి అనుగ్రహం కావాలను కొన్నవారు కేవలం ధర్మాచరణ చేస్తే చాలు. సత్యాన్ని సదా పలుకుతుంటే చాలు. ఆతల్లి స్నిగ్ధదృక్కులు మనపై అపారంగా పడుతాయ. సత్యధర్మాలు ప్రేమ అహింసలు మనిషిలో గూడుకట్టుకుని ఉండాల్సిన విలువలు. ఎవరైతే దయార్థ్రహృదయంతో ఉంటారో, నలుగురి మంచిని కోరు వారెవరు ఉంటారో వారికి దైవం నీడ సదా ఉంటుంది. అచంచలమైన నమ్మకాన్ని దైవం మీద కలిగిఉన్నవారికీ దైవం తోడునీడగా ఉంటుంది. శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడను అనువాడు దారిద్య్ర బాధలను అనుభవించేవాడు. కాని పరమాత్మయైన కృష్ణుని పైన అపారమైన నమ్మకం ఉండేది. ఓరోజు సుధాముని భార్య మన కష్టాలు తొలగించమని ఆ నందనందనుని అడగమని చెప్పి పంపించింది. ఆ సుధాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లాడు. ఆ పరంధాముని చూచిన తరువాత ఈలోకంలో కావాల్సినవన్నీ అల్పంగా కనిపించాయ. అనల్పమైన కృష్ణదర్శనంతో పరమానంద పడి తిరిగి ఇంటికి వచ్చాడు. కాని ఆ సుధామునికి తరగిపోని సంపదలనిచ్చాడా కృష్ణుడు. భగవంతుని దర్శనం తరువాత తిరిగి ఇహలోక సంపదలు కావాలని ఎవరు కోరుకుంటారు? అందుకే ఈమహాలక్ష్మి అమ్మవారిని పూజించిన వారికి భౌతిక సంపదలకోసం చూడనక్కరలేదు. వాటితో పాటుగా పరలోకసంపదలు కూడా ఒనగూడుతాయ.

- సాయ అఖిల్