మంచి మాట

శ్రీకృష్ణలీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో కెల్లా అందరినీ ఆకట్టుకునేది కృష్ణావతారమే. కృష్ణుడు చేసిన చేష్టలు కాని ఆయన చూపిన లీలలు కాని సర్వులు మోహింపచేస్తాయ. ఈ అవతారంలోని కృష్ణయ్యను లీలామానుషవేషధారి అని కూడా కీర్తిస్తుంటారు. ఈ అవతారంలో స్వామి దుష్టశిక్షణ శిష్ట రక్షణతోపాటు శృంగార, వైరాగ్య, భక్తి, స్నేహ, రౌద్ర, అద్భుతాది అనేక రసాలు ప్రదర్శించాడు. పుంసాం మోహనరూపాయా అని శ్రీరాముడిని కీర్తించినా శ్రీరా ముడు ఏకపత్ని వ్రతునిగాను, ధర్మాచరణలో నిలువెత్తు ధర్మమూర్తిగాను నిల్చున్నాడు. కృష్ణుడు ఒకవంక అధ ర్మాన్ని కాలరాస్తూ దుష్టలకు భయోత్పాతాలను కలిగిస్తూనే మరొకవంక ఆ సమయంలోనే కృష్ణుడిని తలుచుకుని శిష్టులంతా అపార ఆనంద పారవశ్యానికి లోనయ్యేట్టు చేశాడు. గోపికలు తమ మానసచోరుడని అంటూ తమను తాము కృష్ణయ్యకు అంకితంచేసుకొన్నారు. తాము అనేవారు ఎవరూ లేరు ఉన్నది కృష్ణయ్యనే అని తమ బుద్ధిని వారు స్థిరీకరించుకున్నారు. అట్లావారు భగవంతునికి దగ్గరయ్యారు. దుష్టులు తమ మాయో పాయంతో కృష్ణుడిని కట్టడి చేసి తమ పనులు సాగిద్దాం అనుకొన్నారు. చిత్తచోరుడైన కృష్ణుడు వారిని వారి మాయలోనే బంధీని చేస్తూ చివరకు తన చేతిలో ప్రాణాలు కోల్పోయేట్టు చేశాడు.
రాముడు తాను దశరథ పుత్రుడిని మాత్రమే అని చెప్పుకుంటే కృష్ణుడు తాను పుట్టకముందే భగవంతు డనని గట్టిగా చెప్పాడు. దేవకీదేవికి పుట్టి తానే ఆదేశించి యశోదమ్మ దగ్గర పెరిగాడు. కంసుడు మేనమామదగ్గరకు చుట్టపు చూపుగా వెళ్లి కంసుని నరకపురికి పంపించాడు. పసిపాపడుగా కనులు తెరిచి తెరవకముందే అమ్మ స్తన్యం గ్రోలే వయస్సులోనే రాక్షస వధ ప్రారంభించాడు.
స్నేహితులతో ఆడుకుంటూనే బాల్య చాపల్యంతో నేరాలు మోపితే అవి నిజమనుకొని తన్ను నిలదీసే అమ్మ యశోదమ్మకు తన నోటిలో చతుర్దశ భువనాలు చూపించాడు. దేవతారాజైన ఇంద్రునికి అహంకార నాశనం కోసం గోవర్థనగిరి నెత్తి తన లీలలను ప్రదర్శించాడు. చతుర్ముఖ బ్రహ్మకు పరమేశ్వరలీలను ప్రదర్శింపచేశాడు. గురు అనుగ్రహం తప్పక పొందాలని చెప్పడానికి గాను సాందీపుని వద్ద విద్యనభ్యసించాడు. గురుదక్షిణగా గురుపుత్రుని యమలోకం నుండి తీసుకొని వచ్చి యిచ్చాడు.
తన్ను కోరి ప్రేమించిన రుక్మిణిని వరించి పెళ్లాడాడు. అట్లానే సత్యభామ, కాళింది, మిత్రవింద, భద్ర, నాగజిత, లక్షణ, జాంబవతి అను ఏడుగురు కన్యలను తన భార్యలుగా చేసుకొని అష్టమహిషులకు నాథుడయ్యాడు. వీరే కాదు నరకాసురుని చెరలో బంధీలైన పదహారువేల మందిని రక్షించివారినందరినీ వారు కోరుకున్న రూపంలో వారిని అలరించాడు.
గోపికలతో రాసక్రీడలు సలిపాడు. నారీ నారీ నడుమ మురారి అన్నట్టుగా ఒక్కో గోపికతో ఒ క్కోకృష్ణుడుగా రూపుదిద్దుకుని బృందావన క్రీడ జరిపాడు. ఆమలిన. మధుర, వీర, భక్తి శృంగారాలకు నిలువెత్తు నిదర్శనం శ్రీకృష్ణుని రాసక్రీడలు. తిరిగి సామాన్య మానవునిలాగా శ్రీకృష్ణుడు రుక్మిణియందు ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుచారుడు, భద్రచారుడు, సత్యభామ యందు తామ్రుడు, చక్రుడు, జాంబవతి యందు సాంబుడు, మిత్రవిందయందు మిత్రవంతుడు, నాగజిత యందు సునీధుడు, మిత్రబాహుడు మొదలైన కుమారులకు జన్మనిచ్చాడు. తన్ను నమ్మిన పాండవుల పక్షం వహించి వారికి ధర్మవిజయం వచ్చేట్టు చేశాడు. సత్యమే భగవంతుడన్న నిజాన్ని రూఢిచేశాడు.

- చోడిశెట్టి