మంచి మాట

నమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుణ్ణి చేరడానికి నవవిధవర్గాలు ఉన్నాయని పెద్దలు అంటారు. వాటిల్లో ఏ ఒక్కటి ఆచరించినా భగవంతుడు ప్రత్యక్షమవుతాడని భగవంతుని సాన్నిధ్యం దొరుకుతుందనేది పెద్దల మాట. భగవంతుడికి భక్తుడికి మధ్యనుండాల్సింది నమ్మకం, ప్రేమ, విశ్వాసం. భగవం తుడు సకల సృష్టికర్త. చీమ నుండి బ్రహ్మాండంవరకు ఆయనచే సృష్టించబడినవే. అణువునుండి ఆకాశంవరకు అన్నిటా అంతటా ఆయన వ్యాపించి వుంటాడు కనుక సర్వాంతర్యామి అన్నాం.
భగవానుడే స్వయంగా - కర్మ చేయడానికే నీకు అధికారం కలదు. కానీ కర్మ ఫలం మీద నీకు అధికారం లేదు. ప్రతిఫలాపేక్షతో సకర్మను ఆచరించకు. అలాగని ఆ కర్మలను మానకు - అని ఇంత చక్కగా ఇంత విపులంగా చెప్పాడు. కాని మానవులంతా ఎపుడూ ఏదో ఒక కోరికతో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో కావాలని అత్యాశలకు పోతున్నారు. కోరినది దొరకలేదని వాపోతున్నారు. దీనికంతా కారణం ఏమిటి?
మానవ జన్మ ఎత్తినా విచక్షణాజ్ఞానం ఉన్నా భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చుకోకపోవడమే. ప్రకృతిని చూచి పరతత్వాన్ని తెలుసుకోవడం లేదు. పరులలో పరమాత్మను చూడడం లేదు. ప్రకృతి నేర్పే త్యాగగుణం నేర్చుకోవడం లేదు. అందుకే మానవుల్లో నిరాశనిస్పృహలు కలుగుతున్నాయ. తృప్తి పడడం లేదు. ఆపేక్ష లేకుండా ఏకర్మను చేయడం లేదు. పొరుగువాడికి తోడ్పాలన్న జ్ఞానాన్ని తెచ్చుకోవడం లేదు.
ప్రాణులన్నింటా చైతన్యరూపులో ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట భగవంతునిపై ప్రేమను పెంచుకోవాలి. మనసును ఆధీనంలోకి తెచ్చుకోవాలి. దానికోసం నిర్గుణుడైన భగవంతుణ్ణి సగుణుగా ఉపాసించినా మంచిదేనంటారు. మనసు చాలా చంచలమైంది. కనుక మనసును నిగ్రహపరుచుకోవడానికి విగ్రహపూజకూడా ఓ మంచిమార్గం అంటారు. రామా యణ భారత భాగవతాది గ్రంథపఠనం కూడా పరతత్వాన్ని తెలుపుతుంది. మానవుల్లోని అరిషడ్వ ర్గాలను అదుపులోకి తెచ్చుకోవాలి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి.
శిరిడీసాయ మొట్టమొదట భగవంతుని దగ్గరకు కోరికలతో వెళ్లినా పోను పోను ఆ స్వామి తత్వాన్ని ఎరుకపర్చుకునే అవకాశం వస్తుంది.కనుక కోరికతో నైనా భగవంతుని ధ్యానం చేయండి అంటారు. భగవానుడు దుష్టశిక్షణార్థం తన్ను తాను ఎన్నో రూపాల్లో సృజియంచు కున్నాడు. అన్నిరూపాల్లో ధర్మమే అనుసర ణీయమని చెప్పాడు. అధర్మపరులు ఎక్కువైతే నేను వచ్చి అధర్మాన్ని నాశనమొనర్చి ధర్మాన్ని పునః స్థాపిస్తానని చెప్పాడు. కనుక ధర్మమేమిటో తెలుసుకొని ధర్మాచరణ చేయాలి. దానితోపాటుగా భక్తిమార్గాన్ని అనుసరించాలి. ఇది సామాన్యులందరికీ సులువైనది. ఎవరైనా ఆచరించదగ్గది. వాంఛల వలయంలో చిక్కుకున్నవారు, సంసార బంధములో వున్నవారు ఈ భక్తి మార్గము ద్వారా ముక్తిని పొందడం సులభం.
భక్తి మార్గాన్ని అనుసరిస్తే ఇందులోనే జ్ఞానవైరాగ్యాలు ఉదయస్తాయ. ఆ జ్ఞానంతో భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. పరిపూర్ణ విశ్వాసంతో, నిస్వార్థంగా భగవంతుని నమ్మితే సర్వాంతర్యామి సర్వులలో కనిపిస్తాడు. సమదృష్టి ఏర్పరుచుకుంటే భగవంతుని సర్వాంతర్యామి తత్వం బోధపడుతుంది.

- హనుమాయమ్మ