మంచి మాట

ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో ఎన్నో రకాల మనుష్యులున్నారు. వారిలో న్యాయానికి, ధర్మానికి కట్టుపడి, నీతిగా, నిజాయితీగా జీవించే వాళ్లున్నారు. అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, వంచనలు చేస్తూ బ్రతికే వాళ్లూ వున్నారు.
మొదటి తరగతికి చెందినవారికి అంటే నీతి నియమాలతో బతికేవారికి ఎక్కువ కష్టాలు ఉన్నట్టుగా కనిపించినా వీరికి తీరని దుఃఖం అంటూ ఏమీ ఉండదు. ఎవరికో భయపడి- నిరంతరం గుట్టుగా, లేక చాటుమాటుగా బతికే దుస్థితి ఎన్నటికీ రాదు. ఎప్పటికైనా, చివరి దాకా నిలిచి ఉండేది నీతిన్యాయాలే. పోయేటప్పుడు పట్టుకుపోయేది ఏమీ లేకపోయనా మంచి చెడు వల్ల వచ్చిన పాపపుణ్యాలను మరుజన్మకు మోసుకెళ్తారు. అట్లా కాకుండా రెండవ తరగతికి చెందిన వారైతే మాత్రం అంటే అక్రమాలు అన్యాయాలు సులువుగా చేసేస్తూ ఇతరుల ధనాన్ని అపహరించి తమ పబ్బం గడుపుకునే వారైతే వారు క్షణక్షణం భయంగుప్పెట్లో ఉండవలసిందే. ఎపుడు ఏ ఆపద వస్తుందో వారికే తెలియదు. ఎవరికి చేసిన అన్యాయం తాలుకూ శిక్ష భగవంతుడు ఎపుడు వేస్తాడోఅనే భయం వారిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. విత్తనం వెయ్యగానే పంట చేతికిరాదు. గింజ రాగానే తీసుకుని తినలేము, దాన్ని వాడుకోడానికి తగిన సమయం రావాలి. పంట చేతికి వచ్చి నోటికి రావాలన్నా, పాపాలకు ఫలితం అనుభవించాలన్నా... తగిన సమయం రావాలి.. అట్లానే వీరికి ముందుముందు కాలం ఎట్లా వుంటుందో తెలియదు. ఇపుడు అంతా బాగున్నదని విర్రవీగితే చేసిన అన్యాయాలకు తప్పక శిక్ష అనుభవించవలసి వస్తుంది.
కనుక ఇట్లాంటి బాధలు ఏవీ లేకుండా నిశ్చింతగా కాలం గడపాలంటే నీతిన్యాయాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. సదా సత్యానే్న పలకాలి. ‘‘కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. కాలము కొరకు ఎదురుచూడవలయునే కాని తొందర పడరాదు‘‘ అన్న పెద్దల వాక్యాన్ని మన్నించా ల్సిందే. మంచియైనా చెడుయైనా ఫలితం తప్పక మానవులు అనుభవించి తీరవలసిందే. దీన్ని చెప్పే పురాణ కథలు ఎన్నో ఉన్నాయ. నృగమహారాజు ఎన్నో పుణ్యకార్యాలు చేసినా ఒక తప్పు చేసినందువల్ల తొండ రూపంలో మళ్లీ పుట్టవలసి వచ్చింది. యయాతి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పుణ్యలోకాలు పొందినా చివరకు అహంకారం వలన అధోగతి పాలయ్యాడు.
రావణుడు శివభక్తుడు. శివుని పూజించనిదే మంచినీరైనా ముట్టేవాడు కాడట. కాని అన్ని మంచి పనులు చేసినా అంత భక్తి ఉన్నప్పటికీ కూడా సీతమ్మను అపహరించడం అనే దుర్భుద్ధి పుట్టి ఆమెను హింసించినందుకే రాముని చేతిలో మరణం అనుభవించాడు. కనుక ఎన్ని పుణ్య కార్యాలు చేసినా వాటి ఫలితాన్ని అనుభవిస్తూనే పాపం కనుక చేస్తే ఆ పాపఫలితాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. తన బుల్లి శరీరమంతా ఇసుక అంటించుకుని రామునికోసం వానరులు కట్టే వారధిమీద ఆ ఇసుకను దులిపినందుకే ఆ రాముని చేతితో తరతరాలకు రాముని అనుగ్రహమనే అప్యాయతను పొందింది చిన్ని ఉడుత. అట్లా ఎవరు మంచిచేసినా, చెడు చేసినా సరే ఆ ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. ఇదే ప్రకృతి నియమం. భగవంతుని ఆదేశం. కనుక మంచి పనులు చేస్తే మంచిఫలితాన్ని పొందవచ్చు.
వీటినన్నింటిని తెలుసుకొని మానవుడు తన అంత రంగాన్ని నిర్మలం చేసుకొని మంచిపనులు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. అపుడు మంచి ఫలితాలను అనుభవించవచ్చు.

- శివప్రసన్న