మంచి మాట

ఆదిశంకరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమకాలీన భారతీయ ధార్మిక ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం చూపిన దార్శనికుడు ఆదిశంకరులు. హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యుల్లో ప్రధములు. సాక్షాత్తు శంకరుడి అంశతో జన్మించి అద్వైత మతాన్ని ఆ సేతు హిమాచలం ప్రచారం చేసి, సనాతన ధర్మాన్ని వ్యాపింపచేసిన వారు శంకరులు. దేవుడు మనకు కనిపిస్తాడు, మనతో కలిసి నడుస్తాడు అనే ప్రశ్నలకు సజీవ తార్కాణం ఆయన. మానవుడై పుట్టాడు, మహేశ్వరుడై నిలిచాడు. భక్తి, జ్ఞాన, కర్మల ద్వారా జీవిత లక్ష్యమై మోక్ష ప్రాప్తికి మార్గం చూపిన మార్గదర్శకులు. జీవుడే దేవుడు, జీవాత్మే పరమాత్మ అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు.
హైందవ ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపించాడు. ప్రతి ఒక్కరిలో భక్తి బీజాలను నాటారు. జ్ఞానం కలగనిదే ముక్తి లభించదనే శంకరుల వారి అభిప్రాయం. అన్నింటిలోనూ తనను, తనలో అన్నింటినీ దర్శించే ఉన్నాడని ప్రసాదించేది అద్వైతం. బ్రహ్మసత్యం, జగన్మిధ్య అన్నది శంకరుల అద్వైతం. భారతీయ సిద్ధాంతాలన్నిటినీ శంకరుని అద్వైతమే మూలమైంది. దుష్టాచారాలను నశింపచేయడానికి శంకరుడే ఆదిశంకరులుగా అవతరించాడని పెద్దల మాట. ఇతర మతాల దాడులనుండిర సనాతన హిందూ మతాన్ని రక్షించడానికి ఒంటరి పోరాటం చేసాడు. సామాన్య ప్రజలు ఆయనను దేవుడన్నారే తప్ప ఆయన తనను తాను దేవుడ్ని అని చెప్పుకోలేదు. వివిధ దేవతల స్తోత్రాలు చెప్పాడే తప్ప ఏ మాయలూ చేయలేదు. వ్యాసదేవుని తర్వాత అంతటి పూజనీయులు ఆదిశంకరులు. శృంగేరీ, ద్వారక, పూరీ, బదరీలలో శంకర మఠాలు స్థాపించి హిందు ధర్మానికి దీపస్తంభాలుగా నిలబెట్టాడు.
8 సంవత్సరాలకే నాలుగు వేదాలు నేర్చాడు. 12 సంవత్సరాలకే సర్వశాస్త్ర కోవిదుడైనాడు. ఆయన మూడవ ఏటనే చావు పుట్టుకల పరమార్ధాన్ని, మానవ జన్మ మర్మాన్నీ తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది. తన ఎనిమిదవ ఏటనే సన్యసించాడు. తల్లి కొరకై పూర్ణానదిని దిశను మార్చి తన ఇంటి ముందు వెళ్లేట్టు చేసాడు గోవింద భగవత్పాదుల వారిని గురువుగా స్వీకరించాడు. కాకిలా కలకాలం బతికేకన్నా హంసలా ఆరు నెలలు బతికిన చాలని, చెప్పి, పరమహంసలెందరికో ఆదర్శప్రాయుడైనాడు. భిక్షాటనకు వెళ్తూ ఎండిన ఉసిరికాయ ఇస్తే లక్ష్మీదేవీ స్తోత్రం చేసి వారి ఇంటిలో కనకధార కురిపించిన మహాత్ముడు. ప్రస్తాన త్రయం అని చెప్పబడే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములకు భాష్యము రాసి అద్వైత సిద్ధాంతాన్నిన ప్రపంచానికి అందించి హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసిన మహనీయుడు.కేవలం 32 సంవత్సరాలే జీవించినప్పటికీ మానవ మాత్రులకు సాధ్యంకాని పనులెన్నింటినో చేసి చూపించారు. సనాతన ధర్మానికి నవ జీవనాన్ని ప్రసాదించిన అపర ధన్వంతరి. అద్వైతంలో జీవేశ్వరులకు భేదం లేదని, అద్వైతుల గమ్యం పరబ్రహ్మమే కానీ అన్యం కాదనీ, అందరూ కోరేది ముక్తినేనని , చండాలుడైనా, బ్రాహ్మణుడైనా ఎవరైనాసరే వినయ సంపన్నుడు జ్ఞాని అయితే గురువుగా స్వీకరించాలని శంకరుల సిద్ధాంతం.
‘మాతేచ పార్వతీ దేవో పితాదేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాచ స్వదేశోభువన త్రయమ్’ అంటూ అందరం పరమేశ్వరుని పిల్లలమే అని, మానవులందరిదీ ఒకే కుటకుంబంలోని సభ్యులని, సమానత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అనేక వ్యాఖ్యానాలు, భాష్యాలు, స్తోత్రాలు, కావ్యాలురచించారు. కాశ్మీర్‌ను భారత శిరస్సుగా భావించి అక్కడికి వెళ్లి అక్కడి పండితులనందరినీ, శాస్త్ర చర్చలలో ఓడించి సర్వజ్ఞ పీఠం అధిష్టించారు. అక్కడా శారదా పీఠం నెలకొల్పారు. అందరి ఆరాధనా పద్ధతులను ఆమోదిస్తూనే అందరికీ ఆమోదయోగ్యమైన పంచాయతన పద్ధతిని అలవాటు చేసారు. ఎన్నో దేవాలయాలను తెరిపించారు.
భజగోవిందం లాంటి స్తోత్రాలు రచించారు. దక్షిణ భారతంలో జన్మించి మధ్యభారతలో విద్య నేర్చుకుని ఉత్తర భారతంలో సర్వజ్ఞ పీఠాన్ని అలకరించిన మహోన్నతుడు ఆదిశంకరులు. నిర్విరామంగా కాలినడక సువిశాల భారతాన్ని రెండుసార్లు సంచరించి హిందు ధర్మ ఫ్రతిష్టాపన ధర్మ పరిరక్షణకై కృషి చేసారు. ఆయన రచించిన సాహిత్యం ఆచంద్రార్కం అజరామరంగా నిలిచిపోయంది.
శృతి స్మృతి పురాణానాం, ఆలయం కరుణాలయమ్!
నమామి భగవత్పాదం, శంకరం లోక శంకరం

-కె.ఆర్. రావు