మంచి మాట

శివరాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ శబ్దం మంగళం, శాంతి, శుభం, క్షేమం ఇలా ఎన్నో అర్థాలనిస్తుంది. క్షీరసాగరాన్ని అమృతోత్పాదనకోసం మథించినపుడు ముందుగా లోకాలన్నీ తల కిందులైయ్యేట్టుగా హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ అగ్ని విస్ఫోటనాన్ని చూసి దేవతలు రాక్షసులు గగ్గోలెత్తారు. కాని మహాదేవుడు తానే ముందుకు వచ్చి ఆ హలాహలాన్నంతా తన పుక్కిట పట్టుకున్నారు. ఆ శివుని అర్థాంగి ని అందరూ భయవిహ్వలురై చూస్తుంటే ఆ తల్లి భయంలేదు అమ్మ అభయంకరి అన్నిటికీ ఉంది. శివుడున్నచోట భయమే లేదు అని తన మాంగల్యాన్ని కళ్లుకద్దుకుంది. అంతే ఆ హాలాహలమంతా శివుని గొంతున ఇరికింది. కంఠం నీలంగా మారింది. లోకాలన్నీ మహోజ్వలంగా వెలుగులు విరజిమ్మాయ. అందరూ శివుణ్ణి నీలకంఠునిగా కీర్తించారు.
మరోసారి బ్రహ్మవిష్ణువులనే అహంకార మదన్మోత్తులయ్యారు. వారిలోవారికి స్పర్థ పెరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు. వారిలో పర్వతంలాగా పెరిగే అహంకారాన్ని నాశం చేయదల్చిన శివుడు తుదిమొదలు లేని లింగాకారాకృతిని పొందాడు. దాని తుది మొదలు కనుక్కోగలమంటూ బ్రహ్మవిష్ణువులు ఊర్థ్వఅధోలోకాలకు పయనంసాగించారు.
కాని ఎవరూ జ్యోతిర్లింగం యొక్క ఆది అంతాన్ని తెలుసుకోలేకపోయారు. కాని బ్రహ్మ ఇంకా అహంకారాన్ని విడవలేక అబద్ధాన్ని తోడు చేసుకొని వచ్చి లింగంయొక్క మొదలు నేను చూశానని అన్నాడు. దానికి సాక్ష్యంగామొగలి పూవు తలవూపింది., ఎంతకూ కానరాని తుదిని చూడలేక విష్ణువు అహంకార విముక్తుడై సర్వేశ్వరా నీవే శరణ్యమని మహేశుడిని వేడుకున్నాడు. వెనువెంటనే మహాశివుడు ప్రత్యక్షమై అబద్ధం ఆడిన బ్రహ్మను శిక్షించాడు. విష్ణువును కొనియాడుతూ ఈ సృష్టిస్థితికారణుడని నేను నని పలుకగా అజ్ఞానాన్ని వదిలిన బ్రహ్మ తన తప్పును మన్నించమని వేడుకున్నాడు. భక్తసులభుడైన శంకరుడు బ్రహ్మను క్షమించాడు. ఆవిధంగా ఆవిర్భవించిన లింగోద్భవసమయమే మాఘ బహుళ చతుర్థశి. ఆ రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. లింగోద్భవాన్ని పురస్కరించుకొంటూ అభిషేక ప్రియుడైన శివునకు మహారుద్రాభిషేకాలు, క్షీరాభిషేకాలుచేస్తారు. మారేడాకుల ప్రియుడైన విశ్వాత్మునకు మారేడు దళాలతో విశేష పూజలు చేస్తారు.
శివరాత్రి సమయంలో అన్ని శివాలయాలు శివనామంతో మారు మ్రోగుతుంటాయ. శివునికిష్టమైన ఉమ్మెత, తుమ్మి, జిల్లేడు పూవులతో ప్రత్యేకార్చనలు చేస్తారు. ‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అన్నట్టుగానే అభేదులైన శివకేశవులను ఈ శివరాత్రి రోజున పూజించినవారికి ఈలోక సంపదలేకాక అంత్యమున శివసాయుజ్యం లభిస్తుంది.
త్రిపురాసురుణ్ణి చంపిన మహాదేవుణ్ణి పార్వతీమాత వివాహం చేసుకొంది. ఆ పార్వతీ పరమేశ్వరులకు కుమారుడుదయంచాడు. ఆ కుమారుడే తారకాసుర భంజనం చేశాడు. ఆ శివదంపతులకే విఘ్ననాశకుడైన వినాయకుడుద్భవించాడు. సర్వవిఘ్నాలకు అధిపతియై అందరికీ ప్రధమారాధ్యుడయ్యాడు.
శివుడు ధరించిన చర్మాంబరాలు, అలంకరించుకున్న నాగాభరణాలు సైతం మానవుణ్ణి అశాశ్వతాలైన భౌతిక సంపదలకు కాక శాశ్వతమైన శివసాయుజాన్ని కోరుకొమ్మని సూచిస్తున్నాయ. అజ్ఞాన తమోగుణాలకునెలవైన రాత్రిలో ఆవిర్భవించిన వెలుగు మెరుపులీనే లింగోద్భవం మనుష్యుణ్ణి సత్వగుణసమన్వితమవ్వమని హితం చెప్తుంది. శివశ్క్తుల కలయకే సృష్టి అని అర్థనారీశ్వరం బోధిస్తుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువూ శివతత్వాన్ని ఎరుకపరుస్తుంటుంది. పర్వతాలునదీనదాలు, ఘనీభవించి నట్టుండే మంచు, సూర్యచంద్రులు ఇట్లా అన్నీ శివునిలోని మహోన్నత గుణాలను వెల్లడిస్తూ సర్వశివమయమే నన్న భావనను వ్యక్తం చేస్తున్నాయ. వీటిని అర్థం చేసుకొన్న మానవునకు శివారాధన జన్మను సార్థక్యంకలిగిస్తుంది. మనలోని భక్తిని చూచి ముక్తినిచ్చే ముక్కంటేశ్వరుని కొలిచి ముక్తులమవుదాం.

- అక్షిత