మంచి మాట

ధర్మాచరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం కర్మభూమి. వేదమే మనకు ప్రమాణం. భారత భాగవతాలు, రామాయణాది కావ్యాలుఅంతేకాదు ఏ చిన్న కథ చెప్పినా అది ధర్మాచరణం గురించే చెబుతుంది. ధర్మమే మానవుల లక్షణం లక్ష్యం కావాలని అంటుంది. సత్యం ధర్మం అనే రెండు కాళ్లమీదే ఈ సృష్టి అంతా నడుస్తుంది. అధర్మచరణులను, పాపులను నీతిమాలిన వారిని శిక్షించడానికి భగవంతుడే దిగి వస్తాడు. వారిని మారుస్తాడు ధర్మమార్గంలో వచ్చేలా చేస్తాడు. వారు వినకపోతే మరణమే వారికి శిక్ష అని వారిని సంహరిస్తాడు.
అట్లాంటి మన దేశంలో శ్రీరాముడు అవతరించాడు. రావణుడు పరాయ సొమ్ముకు ఆశపడినవాడు. అధర్మాచరణంలో ఉన్నవాడు. కాని వేదదాధ్యయన పరుడు శివభక్తుడు. గొప్ప తపస్సుచేశాడు పరాయ సొమ్మును అపహరించాడు కనుక మహావిష్ణువే రాముడిగా రూపుదిద్దుకున్నాడు. విభీషణుని రూపంలోను, ఆంజనేయుని రూపంలో త్రిజట రూపంలోను ఎన్నో విధాలు గా రావణునికి నీతిమాటలు చెప్పాడు భగవంతుడు కాని విపరీతకాలం వచ్చినవారికి మంచి కనబడదు వినపడదు కనుకనే రాముని రూపంలో వచ్చి రావణుని సంహరించాడు. ధర్మపరుడు నీతి పరుడైన విభీషణునికి లంకారాజ్యాన్ని పట్టం కట్టి వెళ్లిపోయాడు.
శ్రీకృష్ణుడు కూడా ధర్మం కోసమే ఎందరో రాక్షసులను రక్కసులను చంపాడు. చివరకు అర్జునునికి చేయంచేది చేసేది నేనే అని ఈ అధర్మపరులను సంహరించు అని తానే సారధి యై కురుక్షేత్రసంగ్రామంలో రథాన్ని నడిపాడు. అధర్మమార్గం ఎవరు తప్పుతారో వారు పతనం వైపుకు వెళ్తున్నట్టే అని మనం గట్టిగా భావించవచ్చు. ఎంత దారిద్య్రంలో ఉన్నా ఎన్ని కష్టాలు కడగండ్లు పడుతున్నా కూటికి లేక ఉండడానికి నీడలేక అల్లాడుతున్నామని అంటున్నా వారు ధర్మం నీతి తప్పనివారు అయతే వారు జీవితనౌకను ఒడ్డుకు తప్పక చేరుస్తారు. జీవిత కేతనం విజయపథాన ఎగురవేస్తారు.
సృష్టిలో ఉన్న ప్రాణికోటిలో మానవుడు ఎన్నో రెట్లు ఘనుడు. విచక్షణాజ్ఞాని, కాని ఇంద్రియవిజయాన్ని పొందలేక స్వార్థం, అహంకారం, మమకారాది దుర్గుణాలకు బానిస అయ స్వధర్మాచరణం పట్ల నిర్లక్ష్యం వహించి తన్ను తాను పతనదిశకు కొనిపోతున్నాడు.
కొంచెం విజ్ఞత ప్రదర్శిస్తే తన లోపాలు కొన్ని తాను తెలుసుకునే నేర్పు ఉన్నవాడు మానవుడు. అదే జంతువులైతే అవి వాటిని ముందే ఏర్పరిచి ఉన్న జీవన గతిలో నడుస్తాయ కాని కొత్తగా దేనిని అలవర్చుకోలేదు. ధర్మమార్గం ఇది దీనిలో మీరందరూ నడవండి అని అవి చెప్పలేవు
. కాని అత్యున్నత స్థానంలో ఉన్న మానవుడు తాను చేస్తున్నది ఏమిటో ఇతరులు చేస్తున్నదేమిటో తన విచక్షణతో తెలుసుకోగలడు. తప్పు ఏదో పసికట్టగలడు. ఉన్నదానితో సంతృప్తి పడగలడు. అట్లాంటపుడు మానవుడు తన స్వార్థం కోసం చేయాలనుకొన్న పనులను ఆలోచనతో చేయకుండా కూడా ఉండగలడు. తాను సంతోషించినట్లే పరులను సంతోషింపచేయడానికి కూడా కృషి చేయగలడు. ఒకవేళ ఏదిమంచో తెలుసుకొనే జ్ఞానం లేకపోతే వేదాలు మానవుడు చేయవలసిన నిత్య జీవన ధర్మాలు స్పష్టంగా చెప్పే ఉన్నాయ. వాటిని అనుసరిస్తే చాలు.
పెద్దలు చూపిన ధర్మమార్గంలో నడిచినా చాలు. పరులకు మహోపకారం చేయకపోయనా పర్వాలేదు కాని కీడు మాత్రం చేయకుండా ఉంటే మేలు. మనుష్యుడు విద్యాబుద్ధులు అభ్యసించి ఇంద్రియాలను చెడు మార్గాలవైపు పోనీయకుండా సన్మార్గంవైపు దృష్టి పెట్టాలి. మనస్సు చాలా చంచలమైనది. అది బాహ్యాడంబరాలకు సులువుగా లొంగిపోతుంది. ఆకర్షణలకు లొంగిపోతే విజ్ఞతను వివేకాన్ని కోల్పోతారు. తనకోసం జీవించడం ఘనత కాదు. పరుల కోసం జీవించడం గొప్పతనం. కనుక మంచి పుస్తకాలు చదివి మహాను భావుల జీవిత చరిత్రలను తెలుసుకొని మంచిమార్గంలో నడవాలి. అపుడు మానవజన్మకు ముక్తి మోక్షం వస్తాయ. ఇక్కడ ముక్తి అంటే సార్థకత అనుకోవచ్చు.

- గోపాల్