మంచి మాట

రామభక్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టుదలకు, సాహసోపేతమైన కార్యాలకు పెట్టింది పేరు ఆంజనేయునిదే. భూతప్రేత పిశాచాదులకు, దుర్జనులకు హనుమంతుని పేరు వింటేనే చాలు నూరామడల దూరం పరుగెత్తుతారు. జై బోలో భజరంగభళీ అనీ ఏ కార్యమైనా రామకార్యంగా భావించే కార్య నిర్వహణ చేసేవారికి అండనున్నవాడు ఆంజనేయుడే.
ఇలా మంచికి మారుపేరైనా మారుతి బుద్ధిబలసంపన్నుడని, వ్యాకరణ పండితుడని, చూసీచూడగానే ప్రసన్నమైన వదనంతో ఆకట్టుకునేవాడని అంటూ సింధూర ప్రీతుడని, తమలపాకులంటే ఇష్టమున్నవాడని హనుమంతుని సింధూరంతోను, తమలపాకులతోను పూజిస్తుంటారు. పితృవాక్య పాలన కోసం దండకారణ్యానికి వచ్చి భార్యను దూరంచేసుకొని భార్యానే్వషణలో దుఃఖిస్తున్న రాముడిని ఈ ఆంజనేయుడు శాంతపరిచాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్లి లంకలో సీతమ్మను చూచి వచ్చితిని శ్రీరామునితో చెప్పి ఆయన్ను ఆనందపరవశుడిని చేశాడు. ఆంజనేయుడు శివాంశసంభూతుడని శాస్త్ర వచనం.పరమ శివుడెపుడుశ్రీరాముని నామోచ్చారణలో లీనమై ఉంటాడని అంటారు. శ్రీరాముడు సైతం పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంటాడట. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది. అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి.
అంజనీపుత్రునకు గురువు సూర్యుడు. ఉదయాద్రి, అస్తాద్రి రెండింటిపై పాదాలుంచి వేద వేదాంగములను, సకల శాస్తమ్రులను అభ్యసించాడు. హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. ఈరోజుల్లో హనుమంతునికి ప్రదక్షణలు చేస్తే కోరిన కోరికలు ఈడేరుతాయ. హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది.
హనుమంతునిలో శ్రీరామునిలో ఉన్న వీరత్వం, అభయత్వం, ధర్మపాలన, సత్యసంధత, దృఢవ్రతం, నిరాడంబరత, కోపం లేకపోవడం, ధర్మాగ్రహం కలిగిఉండడం, అన్యాయాలను ఎదుర్కొనే శక్తి ఇలాంటి దైవీ లక్షణాలన్నీ ఉన్నాయ. తన భక్తులనే కాక రామభక్తులను సైతం హనుమంతుడు కాపాడుతుంటాడు. మనుషుల కున్న జ్ఞాన నేత్రం ద్వారా హనుమంతుని లోనిశక్తిని తెలుసుకొంటే హనుమంతుని అభయం వెన్నింటే ఉంటుందంటారు.
ఒకసారి రాముడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ వాలి, రావణుడు వంటి ఎంతో బలపరాక్రమాలున్న వారైనా హనుమకు సాటి రారు. ఈ బలపరాక్రమాదులతో పాటుగా హనుమకు శౌర్యము, ధైర్యము, కార్య సాధన దక్షత, స్థైర్యము, ప్రాజ్ఞత, కార్యసాధనకు నీతిమార్గానే్న అనుసరించడం ..మొదలైన సద్గుణాలెన్నో ఉన్నాయి. సముద్రాన్ని చూసి భయపడిన వానరులకు సంతోషం కలిగించేట్టు సముద్రాన్ని లంఘించాడు. రావణ అంతఃపురంతోపాటు అశోకవనాన్ని శోధించి సీతతో సంభాషించి ఓదార్చాడు. రావణుని సేనా నాయకుల నెంతమందినో ఒక్కడు సంహరించాడు. బ్రహ్మాస్త్ర బంధాన్ని తొలగించుకుని లంకను తగలబెట్టాడు. రావణునికి బుద్ధిమాటలు చెప్పాడు. యుద్ధంలో హనుమ చూపిన పరాక్రమం ఇంద్రాదులు కూడా ప్రదర్శించిట్టు వినలేదు. సీతమ్మ కనబడిందన్న వార్తను వినిపించి నాకు, అయోధ్యావాసుల ప్రాణాలను నిలబెట్టినవాడు ఆంజనేయుడే. ఇతని భక్తులను నేను సర్వదా కాపాడుతుంటాను అని అంజనీసుతుణ్ణి మెచ్చుకున్నాడట శ్రీరాముడు.
రామునిచేత పొగడ్తలందుకున్న ఆంజనేయుడు నిరాడంబరజీవి. అమేయబలపరాక్రమశక్తి సంపన్నుడైనా కూడా రామభజన వినిపిస్తేచాలు అక్కడికి వెళ్లి రామనామోచ్చారణలో మునిగిపోతాడు. అటవంటి రామభక్తుడి నుంచి అనుకొన్న పనిని సాధించడంలో నేర్పును, పట్టుదలను నేర్చుకోవాలి. భవిష్యత్తు బ్రహ్మ అయన ఆంజనేయుని కొలిచినవారికి శని దోషం అంటదు. హనుమంతుని మెప్పించాలనుకొన్నవారు శ్రీరామ మంత్రాన్ని విడువకుండా పఠిస్తే చాలు హనుమంతుని అభయాన్ని సులభంగా పొందవచ్చు.

- చోడిశెట్టి