మంచి మాట

అమృతోపాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన జీవి గిట్టక మానదు. జనన మరణాలకు ఎవరూ అతీతులు కారు. పుట్టుక ఉందంటే వారికి తప్పక మరణముంటుదనేది నిజం. ఎందరో రాక్షసులు తపస్సులు చేసి ఆయువృద్ధ్దిని సాధించారు కాని అసలు మరణం లేకుండా చేసుకోలేదు.ఆయుష్షును పెంచమని అని అడిగితే చిరంజీవిగా మార్కండేయుని ఆశీర్వదించాడు పరమశివుడు. సావిత్రి తన భర్తప్రాణాలను తిరిగి ఇచ్చేయమని వెంట పడితే ఆమె కోరిక కాదనలేక ఆమె పతిదేవుని కాపాడాడు. సూర్యోదయం అయతే తన పతి ప్రాణాలు దక్కవని అసలు సూర్యోదయమే కాకుండా చేసిందో ఇల్లాలు. ఆమెను బతిమిలాడి సర్వప్రాణికోటికి సూర్యోదయం కావించి రక్షించమని దేవతలుసైతం వేడుకున్నారు. ఆ తల్లి తన భర్త ప్రాణాలు నిలుపమంటే నిలిపాడు యమధర్మరాజు. అట్లాంటివారున్న ఈ లోకంలో మరణం కొందరు తమ అభిజాత్యాన్ని అహంకారాన్ని చూపడానికి వద్దని అంటే మరికొందరు జననమరణ చక్రం అని భయపడడం ఎందుకు మనం మంచిపనులు చేస్తూ ఉంటే అసలు మనం మరణించినా బతికిఉన్నట్టే లెక్కకదా అంటారు.
అమృతోపాసన, లేక అమరత్వం అంటే కేవలం మరణం లేకుండా ఉండడం కాదు. భగవంతునికి మారుపేరుగా ఉండగలగడం దేనిపైనా ఇచ్ఛలేకుండా అన్నింటికీ కారణాకారణుడు భగవంతుడనే స్థిర నిశ్చయం కలిగి ఉండడమని మరికొందరు అంటారు. పూరు మహారాజు తన తండ్రి యైన యయాతికి తన యవ్వనాన్ని కానుకగా ఇచ్చాడు. తాను తండ్రికి శాపఫలితంగా వచ్చిన ముసలితనాన్ని ప్రీతిపూర్వకంగా తీసుకొన్నాడు. అంటే యవ్వనంలో ఉండే కోరికలను పూరుమహారాజు తృణప్రాయంగా చూచాడని అర్థం కదా.దేవయాని లౌకిక సుఖాలకోసం కచుణ్ణి మృతసంజీవని విద్యతో ఆకట్టుకుని తన కోరిక తీర్చమని అంటే కచుడు బృహస్పతి కుమారుడైనా శుక్రాచార్యుడిని సేవించి మెప్పుపొంది మరీ మృతసంజీవనీ విద్యను నేర్చుకుని పలువురికి ఉపయోగపడ్డాడు.
తోటివారికి సాయం చేయడం, తోటి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని వారికి చేదోడు వాదోడుగా ఉండడమే మానవత్వం అని అంటారు. స్వార్థబుద్ధితో తన ఆనందాన్ని తాను చూసుకోవడానికి రాక్షసవృత్తిని అంటారు. ఈ కలియుగంలో మనుషులుగాపైకి కనిపి స్తున్నా మనిషిలోని గుణాలతో రక్కసుల్లాగానో, మానవుల్లాగానో మెల గడం వారి చిత్త ప్రవృత్తిని తెలుపుతుంది.
ఉన్నంతలో మానవ జీవన మనుగడను సార్థకం చేసుకోవాలంటే మాత్రం మానవత్వంతో మెలగాల్సిందే. శ్రీరాముడిగా అవతరించిన మహావిష్ణువు తోటివారి బాధలను చూడలేక తాను వనవాసం ఉంటున్న దండకారణ్యంలో (మునులబాధను) సర్వ రాక్షస సంహారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దానితోడుగా తన భార్యను అపహరించిన రాక్షసా ధముని పీడ కూడా వదిలించి తన భార్యను తెచ్చుకుని దండ కారణ్యంలోనే కాదు ముల్లోకాలను పట్టి పీడించే రాక్షసాధముల్ని నిర్మూలించాడు.
అట్లానే శ్రీకృష్ణుడు సైతం పుట్టీ పుట్టకముందు నుంచే రాక్షస నాశనానికి బీజాలు వేశాడు. తానే స్వయంగా కొందరిని మట్టుపెట్టితే పాండవులను ప్రేరేపించి మరికొందరిని అణిచేశాడు. చిట్టచివరకు రాక్షస కుల నాశం చేసి ధర్మసంసాథపన చేశాడు. మొథలు నరికినా తిరిగి చివురించే వృక్షనైజంతో మళ్లీ మళ్లీ రాక్షసులు అక్కడక్కడ పుడుతూనే ఉన్నారు. వారి రాక్షసక్రీడలు జరుగుతూనే ఉన్నాయ. ఇపుడు మానవుల మనస్సుల్లో చిక్కి మానవత్వం మరిచి ప్రవర్తించేట్టుగా రాక్షసకృత్యాలు జరుగుతున్నాయ. కొవ్వొత్తి తాను కాలిపోతూ ఇతరులకు వెలుగు ఇచ్చే విధంగా, గంధపుచెట్టు తనను నరికేవాడికి కూడా సుగంధాలు అందించే విధంగా మన జీవన విధానం ఉండాలి. మనకు తెలియకుండా ఎదుటివాడికి మన వల్ల నష్టం, కష్టం కలిగితే, అది తెలుసుకుని పశ్చాత్తాపపడి, మరోపర్యాయం అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. పరోపకారమే పరమోత్తమ ధర్మమని తలిచి ఆచరిస్తే పరమాత్మ కనుల ఎదుట సాక్షాత్కరిస్తాడు. అపుడే మానవ జన్మకు సార్థకత. అదే అమృత త్వోపాసనకు మార్గం అవుతుంది. తపస్సులు చేసి మరణం రాకుండా చేసుకోవడం కాక ఉన్న ఆయుష్షులో తోటివారి కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండడమే అమృతోపాసన అనవచ్చు.

- హనుమాయమ్మ