మంచి మాట

మానవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు సంఘజీవి. పరస్పర సహాయ సహకారం లేకుండా మనుగడ సాగించడం దుస్సాధ్యం. దానివలనే మానవులమధ్య సంబంధాలు, బాంధవ్యాలు కలుగుతుంటాయ. ఈ మానవ సంబంధాలనేవి పటిష్టంగాను, పవిత్రంగాను ఉంటే మానవ ప్రగతి ఇతోధికంగా పెరుగుతుంది. అవి ఒకవేళ అపవిత్రాలు కళంకితాలుగా ఉంటే మాత్రం మానవ మనుగడ ప్రగతిపథంవైపుకు కాదు అసలు నడకనే కుంటు పడుతుంది.
పూర్వజన్మ కర్మఫలం వల్ల ఒకరితో మరొకరి రుణానుబంధం ఏర్పడుతుంది. దానివల్ల వారు దగ్గరవారుగానో, స్నేహితులుగానో, ద్వేషులుగానో అవుతారు. ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ ఎవరి దగ్గరకూ రారు అని కొందరు అంటారు. రుణానుబంధమైనా కాకపోయనా మనుష్యుల మధ్య ఏర్పడే మానవ సంబంధాలను మాత్రం మానవత్వంతో ముడిపడి ఉండాలి. విచక్షణ, ఆలోచనాశక్తి ఉన్న మానవుడు మానవీయ విలువలతో సంబంధాలను పటిష్ఠం చేసుకోవాలి. అపుడే బాధలు లేని సుఖమయ జీవితం ఒనగూడుతుంది.
కేవలం రక్తసంబంధం ఉంటేనే వారితో మంచిస్నేహసంబంధం కలిగిఉండడం కాక ప్రతి మానవుణ్ణి స్నేహహస్తంతో స్వాగతించాలి. కేవలం మానవులే కాక ఇతర జంతుకోటిని కూడా ప్రేమతోనే మచ్చిక చేసుకోవాలి. లేదంటే మానవులకు ఎన్నో రకాలుగా సహాయం అందించే జంతుప్రాణికూడా మానవులకు అవసరమైనదే. ప్రకృతి అంతా సమతౌల్యతతో ఉండాలంటే మానవులే కాక చెట్టు చేమలతో పాటుగా జంతుజాలము కూడా మంచి మనుగడ సాగించాల్సిందే.
స్వార్థ ప్రయోజనాల కోసమో, వ్యాపార లావాదేవీల్లో లాభం కోసమో, మరేదానికోసం మనుష్యులతో సంబంధాలు మంచిగా ఉండాలని కోరుకోక మానవులంతా ఒకే జాతిగా ఐక్యతతోను, అభివృద్ధి సాగించే దిశలో ఉండేటట్టు ఉండాలి.
మానవత్వం, జాలి, దయ, క్షమాగుణం, దానగుణాల్ని మనుషులకు సహజగుణాలుగా ఉండాలి. ఇవన్నీ ఉండి సాటి మానవులకు అవసరమైనప్పుడు సాయం చేస్తుంటే చాలు అదే దైవత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నపుడు వారి కన్నీళ్లను తుడిచి వారికి అవసరమైన సాయం చేస్తే వారిని దేవుడు అనే కదా అంటారు. దైవత్వం అంటే మానవత్వంతో మెలగడమే. వేదం కూడా మనష్యుల్లాంటి దేవతలున్నారని చెబుతుంది. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు ఇలాంటి వాళ్లందరూ ఇంతకుముందుకాలంలో మానవులతో కలసి తిరిగేవారని అంటారు. వారికి అవసర సమయాల్లో దేవతల సహాయం అందేది.
రానురాను మానవులు మృగాల్లా సంచరించేట్టు కాలం మారింది కనుక బహుశా దేవతల కంటికి కనిపించనివారు అయ్యారు. ఇదే విషయం కలియుగదైవమైన వేంకటేశ్వరుని గాథల్లోను కనిపిస్తుంది. సాటి మానవులను తనలాంటి వారు అని గుర్తించక వారిని నీచంగా చూడడమో, లేక వారిని హింసించడమో చేసే మానవులను రక్కసులనో, జంతువులనో చూడాల్సిందే కాని మరొకలాగా చూడలేము కదా. మరి అట్లాంటి మనుష్యులకు దేవతలు ఎందుకు కనిపిస్తారు ఈ విషయాన్ని ఎవరికి వారు ఆలోచించుకుని ఆత్మపరిశీలన చేస్తే అర్థమవుతుంది.
‘మానవసేవే మాధవసేవ’ అన్నట్లుగా మానవులందరూ మిత్రులవ్వాలంటే ఒకరికోసం ఒకరు నిలబడాలి. అదే జీవన సంబంధం. శరీరం శాశ్వతం కాకపోవచ్చు. ఆత్మ శాశ్వతమైనది. ఏ చారిత్రిక కథను చదివినా, ఏ ఇతిహాసమో, పురాణమో ఉపనిషత్తునో చదివినా ఇది అర్థమవుతుంది. ఎపుడైతే మానవత్వం మరిచిపోతామో అపుడు అన్యాయం పెచ్చు మీరుతుంది. దాన్ని కాలరాయడానికి భగవంతుడు తన్ను తాను సృజియంచుకుంటాడు. ఒకవేళ మనుష్యులే మానవత్వంతో మెలిగితే వారినే దేవుడని సంభావించడం జరుగుతుంది కదా. తోటివారిలో దైవాంశను గుర్తించి భక్త్భివాల్ని అలవరచుకొని.. సంప్రదాయ విలువల్ని పాటిస్తూ మానవీయతతో మెలిగితే ఈ భూతలమే స్వర్గతుల్యం అవుతుంది. దీనికి మంచిమార్గం మనుష్యులంతా భక్తిపరులు కావడం. భగవంతునిపై నమ్మకం, ప్రేమ పెంచుకున్నట్టు అయతే మానవత్వం అంకురిస్తుంది. ఆ అంకురమే విచ్చుకుని మానవత్వ పరిమళాలను వెదజల్లుతుంది.

- సి. విజయలక్ష్మి