మంచి మాట

ప్రబోధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు, కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవ విజయంతో పట్ట్భాషక్తుడైన ధర్మరాజుతో ఇట్లనెను. అంపశయ్యపై ఉన్న మహనీయుడు భీష్ముడు సత్యదర్శి, వేదవేదాంగకోవిదుడు, మంత్రద్రష్ట, ఋషితుల్యుడు, ఆజన్మబ్రహ్మచారి, అనేక ధర్మాలనెరిగినవాడు, మహోన్నతుడు, జ్ఞాననిధి, తత్త్వవేత్త- అంతటి మహనీయుని యొద్దనుండి తెల్సుకోవలసినవి నిత్యసత్యాలు, ధర్మాలు, ధర్మసూక్ష్మాలు, రాజనీతి మున్నగు గణనీయ గుణాలనె్నంటినో అడిగి తెలుసుకో, లేనిచో అవి వానితోపాటు అదృశ్యవౌతాయి. కావున వానినాశ్రయించి, త్వరితగతిన వారినడిగి తెలుసుకోవలసింది తెలుసుకొమ్ము అని ధర్మరాజుని ఆదేశిస్తాడు.
ఆ వెంటనే ధర్మరాజు భీష్ముని చెంతకు చేరి తన సందేహాలకు తగిన సమాధానాలనన్నింటినీ తెలుసుకోసాగాడు. అప్పుడు భీష్ముడు తన అనుభవ జ్ఞానంతో, శ్రీకృష్ణుని ఆదేశాన్ని శిరసావహించి చెప్పదలచుకున్నవన్నీ సవిస్తరంగా చెప్పాడు. వాటిలో కొన్నింటి వివరణ ఇలా వివరించబడింది. ధర్మరాజా! మానవులాచరించదగిన ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా అహింస, సత్యం, దానం, కోపరాహిత్యం అనే గుణాలు ఉత్తమమైనవని, వాటిని సర్వదా ఆచరించాలని అప్పుడే మేలు జరుగునని చెప్పాడు. ఇతరులు మనకు అప్రియమైనది చేసినా, మనం తిరిగి వారికి అలాంటి పనిని చేయకుండుటే పరమ ధర్మం అన్నాడు. అన్ని ధర్మాలు అహింసలో ఇమిడి ఉన్నాయని, అనగా అహింసను పాటించినచో మిగిలిన ధర్మాలన్నింటినీ పాటించినట్లేయగునని చెప్పాడు.
హింస నాలుగు విధాలుగా వుంటుంది. మనసు చేత, మాట చేత, దేహం చేత, ఇతరులను హింసించడం, ఇతర జీవులను చంపి ఆ మాంసాన్ని తినడం అనేవి. కావున సాధ్యమైనంతవరకు మాంసాహారాన్ని విడిచిపెట్టడం శ్రేయస్కరమన్నాడు.
నిత్య జీవితంలో దానం చేయడం ఎంతో మేలైనదని, రోగికి ఔషధాన్నివ్వడం, కష్టాల్లో కొట్టుమిట్టాడువారికి చేయూతనిచ్చి ఆదుకోవడం, తీర్థయాత్రలు చేయు యాత్రికులకు తగిన రీతిన సహకరించడం, దిక్కుమాలిన అనాధ ప్రేత (శవానికి)కి అగ్ని సంస్కార విధిని నిర్వర్తించడం, దుఃఖాలలో వున్న దీనుల్ని ఓదార్చి అక్కునచేర్చుకోవడం వంటి చర్యలు మేలైనవని పుణ్యాలనిస్తాయని చెప్పాడు.
ఏకార్యమైనా సిద్ధించాలంటే మానవ ప్రయత్నం ముఖ్యమని ప్రయత్నం చేయకుండానే యోగముంటే సిద్ధిస్తుందని చెప్పి కూర్చోవడం బుద్ధిహీనుల పనియని, పాప కర్మాలకు ప్రోత్సహించకుండా దూరంగా ఉండాలని, పతితులతో స్నేహం ఆయుక్షీణమని, మంచినడవడికతో మెలగాలని చెప్పాడు. చతురాశ్రమ ధర్మాలను పాటించే విధానాలను వివరించాడు. సదాచారం వలన ఆయుష్షు, కీర్తి, సిరిసంపదలు సిద్ధిస్తాయని, సజ్జనులుగా ప్రవర్తిస్తే అదే సదాచారమని, అసత్యం, క్రోధం, అసూయ హింస లేకుండా జీవిస్తే నూరేళ్ళూ జీవిస్తారని చెప్పాడు.ఎవరిపైనైనా అత్యంత ప్రేమనిగాని, అత్యంత ద్వేషాన్ని గాని కలిగి యుండరాదని, అన్నదానం, యజ్ఞయాగాది కర్మలు మిక్కిలి ఆచరణీయాలని చెప్పాడు. కుటుంబ ఐక్యతని కాపాడాలన్నాడు.
ధర్మరాజా! సత్యము, బ్రహ్మచర్యము, నిత్యం పరిశుభ్రంగా వుండడం, వౌనం, దయ, త్యాగం ముఖ్యములని ధర్మాలన్నీ గొప్పవే అయినా తపస్సును మించిన ధర్మం లేదని తెలిపాడు. గురువు కంటే తండ్రి పదింతలు గౌరవించదగిన గొప్పవాడని తండ్రికంటే తల్లి పదింతలు గౌరవంలో గొప్పయని తెలిపాడు.
లక్ష్మీదేవి ఏ ఏ ఇళ్ళల్లో ఉంటుందో అని అడిగిన ధర్మజునికి భీష్ములవారిలా తెలిపారు. దానపరులు, సత్యం పలికినవారు, పెద్దలయందు వినయం గలవారు, సోమరులుకానివారు, దీనులు దుఃఖితులు దుర్భలులయందు దయకలవారు, శౌచము, శుభ్రతలు పాటించువారు, అతిథి అభ్యాగతులను ఆదరించువారు, గురుభక్తి కలవారు, దేవ పితృ కార్యాలు చేయువారు ఉంటున్న ఇళ్ళల్లో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పాడు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనునని పుణ్యతీర్థములతో సమానమని, వీటిని కలిగియుండాలని, మృతి చెందినవారికి ధర్మమే రక్షయని, కావున జీవించియున్నపుడే మంచి కార్యాలు చేసి ధన్యులు కావాలని, లోకక్షేమానికై వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసేవారు ధన్యులని తెలిపాడు.

-చెళ్ళపిళ్ళ సన్యాసిరావు