మంచి మాట

కృష్ణతత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణము అంటే నల్లనిది, అశుభ సూచకం అన్న అపోహ పోకార్చడానికే వృష్టి వంశంలో ఆ పరమాత్మ కృష్ణనామంతో దేవకి వసుదేవులకు జన్మించాడు. భయపడకండని భక్తులకు అభయ ప్రదానం చేసాడు. దుష్టులను, దురాచారాలను రూపుమాపడానికే రేపల్లెలో పుట్టి గోకులంలో పెరిగి ద్వారకా నగరంలో కొలువుతీరాడు. భక్తులపాలిట కల్పవృక్షంగా, కామధేనువుగా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మగ్లాని వల్ల లోకానికి జరిగే హానిని హరించాడు.
షష్ఠి నష్టమని, అష్టమి అరిష్టమని, మంగళవారం మంచిది కాదని, తిథి నక్షత్రాలు, రాహుకాల యమగండాలు లెక్కిస్తూ క్రియా శూన్యులైన జనాభాకు కనువిప్పు కలిగించడం కోసమే అన్నీ తానై అయన కృష్ణుడూ అష్టమి తిథీ నేనే నని చెప్పక చెప్పాడు. కృషి వుంటే రుషి కావచ్చునన్న దివ్య సందేశం అందించాడు. కర్మయోగమనే జీవన వేదం అర్జునుడి ద్వారా ప్రపంచానికి వినిపించాడు. గీతామృతాన్ని పంచి మానవుడు మాధవుడు కాగల వెసులుబాటు కలిగించాడు. నరుడు నారాయణుడు ఇద్దరూ ఒకటేనన్న సత్యాన్ని ఎత్తి చాటాడు.
అష్టమహిషులు, అష్టైశ్వర్యాలు వున్నా శ్రీకృష్ణుడు బ్రహ్మచారి, యోగీశ్వరుడు, జగద్గురువు. కృష్ణుని అర్థం చేసుకోవడం అతి కష్టం. ఆయన మాయా మానుష రూపుడు ఆయన వినిపించిన మురళీ రవాలు, ఆయన చేసిన అవలీలలా దుష్టసంహారాలు చూసి కూడా విధాత అయన బ్రహ్మనే నిజంగా కృష్ణుడు పరబ్రహ్మనేనా అని అనుమానపడ్డాడట. అట్లాంటపుడు సామాన్య మానవులు ఇక గోపాలుడిని గోపబాలుడని, పశువులకాపరిని యశోదమ్మ కొడుకని అంటే అందులో అసహజమేముంది?
బాలకృష్ణుడు మన్ను తిన్నాడని అంటే యశోదమ్మనే మాయకమ్మింది. అఖిల భువనాలను తన కుక్షిలోదాచుకున్న వాడిని నోరు తెరిచి చూపమందాతల్లి. చిన్నివానిగా ఉన్న చిన్మయుడు అమ్మమాటకు ఒగ్గి నోరు తెరిచి చూపించాడు. ఆ నోట లోకాలన్ని చూచిన ఆ యమ్మ మ్రాన్పడి పోగా ఆ తనయుడే తనువు తాకి ఇహలోకంలోకి తెచ్చాడు.
చిన్ని కృష్ణుడి కొంటెపనులు, మువ్వల చిందులు, రవ్వల రచ్చలు వినడానికి చూడడానికి బహుపసందుగా వుంటాయి. యశోదమ్మ రోలుకు కట్టినపుడు మోడుబారివున్న దేవతలకు శాపవిమోచనం కలిగించాడు. యమునా జలాలను కలుషితం చేసే కాళీయ సర్పాన్ని మధించి గోవులను, గోకులాన్ని సంరక్షించాడు. కంసుడి కింకరులను పూతన ఆదిగా అందరినీ వరసబెట్టి మట్టి కరిపించాడు. హింసకు ప్రతిరూపమైన కంస మామయ్యను మట్టుపెట్టి లోకానికి సుఖ శాంతులు అందించాడు. కృష్ణుడు చేసిన ప్రతి బాల్య చేష్ట ఒక పరమార్ధంతో కూడిన చర్య.
అక్రూరుడితో కంసుడి రాజధానికి చేరి తాతయ్య ఉగ్రసేనుడికి పట్ట్భాషేకం చేసాడు. ధర్మం దారి తప్పినప్పుడల్లా ఆడి తప్పకుండా అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ బాల కృష్ణయ్యగా రుజువు చేసాడు. ఆ తరువాత కురువృద్ధులతో కూడిన దుర్యోధనుడి పని పట్టడానికి మహాభారత యుద్ధంలో కత్తిపట్టకుండా కదం తొక్కి శత్రు శేషాన్ని నిధనం చేశాడు. కర్తవ్యం మన వంతుగా కాపాడడం ఆయన వంతుగా ధర్మరక్షణ చేసి, ధర్మరాజును మళ్లీ హస్తినాపురం సింహాసనంపై ప్రతిష్ఠించాడు. పాండవులతో అశ్వమేధ యాగం చేయించి తన శత్రువులను సంహరించాడు. అగ్రపూజ అందుకుని భక్తులకు తన విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ప్రసాదించాడు.
తాను భక్త ప్రియుడనని భవ బంధాలను విడిపంచే దైవాన్ని అని శ్రీకృష్ణపరమాత్మ చేతలలో నిరూపించాడు. అర్జునుడు, ద్రౌపది, ఉద్ధవుడు, ఆయనలో మిత్రుడిని, అన్నయ్యను, పరమాత్మను చూసారు. కుంతీదేవికి ఆపద్బాంధవుడుగా, రుక్మిణికి భక్త పరాధీనుడుగా అవగతం అయ్యాడు. దశావతారాల్లో కృష్ణావతారం పరిపూర్ణత్వానికి, ఇహపర సాధన రూపానికి, ప్రబలమైన నిదర్శనాలంటారు. గురువు, దైవం, తల్లిదండ్రి, సోదరుడు, స్నేహిడుతు అన్ని పాత్రలు తనవే. అయినా పాత్రధారులను సృష్టించి సూత్రధారిగా నిలిచిన కృష్ణపరమాత్మ అవతార రహస్యం, ఆయన రాసక్రీడ. అంత సులభంగా అర్ధం కావు. ప్రపంచానికే వందనీయడు, ఆదర్శ పురుషుడు అయిన ఆ పురుషోత్తముని స్మరణ నిత్యం ఉంటే తప్పక కృతార్థులం అవుతాం. కృష్ణతత్వం తెలిసిన వారికి ఆయన శక్తి అని- బలవంతులకు బలం, జ్ఞానవంతులకు జ్ఞానం, కర్మజీవులకు సక్రియా శీలం. ఆయన వ్యక్తిత్వం సాక్ష్యాత్కరిస్తాయి.

- వి. ఆర్. రావు