మంచి మాట

నాయకత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయకత్వం బాధ్యత కలిగినదై వుండాలి. అనుభవంలోంచి ఆలోచన స్వీకరించేంత ఎదగాలి. స్వతహాగా ఒక ప్రణాళిక వుండాలి. ఎందుకంటే చెప్పిన బుద్ధి దిద్దిన అద్దం ఎంతోకాలం నిలువవు అన్న సామెతలా వుంటుంది. ప్రతి సమాజం తనను భరోసాతో బతకనిచ్చే నాయకత్వం కోరుకుంటుందని చరిత్రకారుడి మాటలు.
పరిశోధన సరైన అవగాహన అనుభవం చెప్పిన పాఠాలు నాయకత్వాన్ని సరైన దారిలో నడిపిస్తాయి. అవి లేక, చేయకపోతే చివరకు తనకు తాను తనను నమ్మిన వారు నష్టాలు కాక తప్పదు. ఇది మనకు భారత కథలోని దుర్యోధనుని నాయకత్వం, కర్ణుడి నాయకత్వం వల్ల తను తన ప రివారం నష్టపోవాల్సి వచ్చింది.
భారతదేశ చరిత్ర పౌరాణికాల్లో శ్రీకృష్ణుడి నాయకత్వం ఆదర్శప్రాయమైంది. నల్లనయ్య అటు ప్రేమకు, ఇటు పౌరుషానికి, ఉపాయాలకు, పంచ పాండవుల పక్షపాతిగా అడుగడుగునా వారిని కాపాడే నాయకత్వం వహించాడు. ధర్మాన్ని గెలిపించాడు. అధర్మాన్ని నాశనం చేసాడు. లోకహితుడిగా ప్రసిద్ధిగాంచాడు. సారధిగా, సచివుడుగా, సఖుడుగా, బంధువుగా, విభుడిగా, గురువుగా, దేవతగా కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పాండవులకు ప్రసాదించింది వ్యూహాల అమ్ముల పొదిగా వున్నాడు.
నాయకత్వ లక్షణాల్లో విలువలు, వ్యక్తిత్వం అనేవి రెండు ప్రధాన అంశాలు. ఎవరి జీవితమైనా వాటి ఆధారంగానే నడుస్తుంది. నల్లనయ్య నాయత్వం ఈ దారిలోనే నడిచిందని భారత భాగవతాలు విడమరిచి చెప్పాయి. శ్రీకృష్ణుడు యదువంశానికి చెందినవాడు. చంద్ర వంశానికి చెందిన పురూరవ చక్రవర్తి వంశంలోని యయాతికి, శుక్రాచార్యుని కుమార్తె దేవయానికి జన్మించిన కుమారుడు యదువు. శృంజయుడు, విదర్భడు, సాత్వతుడు, శూరుడు మొదలైనవారు యదువంశంలో ప్రసిద్ధులు.
ఆ వంశంలోని వసుదేవుడి కుమారుడు శ్రీకృష్ణుడు. యదువు వారసుడు కాబట్టి యాదవుడని, సాత్వతుని వంశీయుడు కాబట్టి సాత్వతుడని, శూరుని వంశంలో పుట్టాడు కాబట్టి శౌరి అని, వసుదేవుని కుమారుడు కనుక వాసుదేవుడని, నల్లని వాడు మేఘశ్యామ వర్ణం కలవాడు కాబట్టి నల్లనయ్య అని గోపికలు ప్రేమతో పిలుచుకునేవారు. అలాగే వారు కలలో‘నల్లనివాడు పద్మ నయనంబుల వాడు, కృపారసంబు చల్లెడు వాడు..ఓ మల్లెలారా మీ మగువన దాగలే చెప్పరే’ అని ప్రతి పొదలో వెతుకుతున్నట్టు కలలు కనేవారని భాగవతం చెబుతున్నది.
శ్రీకృష్ణుడు భారతీయ సమాజ, సంస్కృతి నిర్మాతలో ఒకరు. అంటే అనేక రంగాల్లో స మాజానికి దారి చూపిన నాయకుడు నల్లనయ్య. శ్రీకృష్ణుడు ధర్మ, శాస్త్ర, ధర్మ గోప్త ఆయన భగవద్గీత వంటి అనేక బోధల ద్వారా ధర్మం అంటే ఏమిటో చెప్పాడు. అధార్మికుల్ని అనేక మార్గాల్లో నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు. ధర్మపక్షాన నిలబడడం దాన్ని గెలిపించడానికి సర్వశక్తులు ధారపోయడం, ప్రయత్నంలో కష్టనష్టాలు, అపఖ్యాతి వచ్చినా లెక్కచేయకపోవడం ఆయన నైజం. నిరాశలో మునిగిన ధర్మపక్షానికి అర్జునుడి ద్వారా జ్ఞాన బోధ చేసి వ్యూహాలు నేర్పి, సలహాలు ఇచ్చి, ఏకం చేసి వారి ద్వారా అధర్మ పక్షాన్ని నీరసింపచేసి నాశనం చేసే ప్రయత్నంలో అలుపెరగకుండా శ్రమించడం శ్రీకృష్ణుని నాయకత్వ లక్షణాలు. అవసరాన్ని బట్టి ధర్మపక్షానికి ముందుండి స్వయంగా నాయకత్వం వహించడం, లేదా సహాయక పాత్ర వహించి మరొకరి చేత పని చేయంచడం అనే రెండు పద్ధతులను ప్రయోగించి ఫలితాలు రాబట్టిన కార్యశీలి శ్రీకృష్ణుడు. ఈ రెండు విభిన్న నాయకత్వ పద్ధతులు. ఒకవైపు స్వయంగా కంస, పౌండ్రక వాసుదేవ, దంతవక్తుృలు మొదలైన అధార్మికుల అణచడం, మరొకవైపు పాండవుల హితైషిగా సలహాదారుగా, రాయబారిగా అర్జున రధసారధిగా పని చేయడంలో ఈ రెండు పద్ధతులు ఆచరించి చూపాడు. అధార్మికుడిని జయించడానికి తనకు అవకాశం లేనప్పుడు ఉపాయంతో పని సాధించడం శ్రీకృష్ణుని నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైనది. ఎవరి చేత ఎవరిని చంపించాలో ఎరిగిన వాడు కనుక కాలం ధర్మం కనిపెట్టి కాలయముడితో కాటేయించేవాడు. కాలాతీతుడు.
ద్వాపర, కలి యుగాల సంధి కాలంలో గుజరాత్ ప్రాంతాల్లో పుట్టి అప్పుడున్న నాగరికత ప్రపంచాన్నంతటినీ ప్రభావితం చేసాడు వాసుదేవ శ్రీకృష్ణుడు. అతడు ఎంతటి పరిపూర్ణ వ్యక్తిత్వం, సామర్ధ్యం కలవాడంటే ఆయన్ను భగవంతుడి పూర్ణ అవతారంగా పరిగణిస్తాము.

-జమలాపురం ప్రసాదరావు