మంచి మాట

సాంగత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలలో నీటిని కలిపిన ఎడల అవి రెండూ కలసి పాలుగా మారుతాయి. ఆ పాలనుండి నీటిని ఎట్టి పరిస్థితులల్లోను వేరు చేయలేము. అదేవిధంగా ఆత్మశ్రేయస్సుకై పాటు బడే సాధకుడు అందరితో స్నేహము చేయుల వలన తన లక్ష్యాన్ని కోల్పోయి తనలో నున్న శ్రద్ధ్భాక్తులను ఉత్సాహాన్ని కూడా పోగొట్టుకొనుట సహజం. తనకు తెలియకుండానే అవి చల్లగా మెల్లగా సమసిపోతాయి.
మానవునికి సత్యాంగత్యం ఆత్మ వికాసానికి ముఖ్యమైన అంశం. సమిధులను పోగుచేసి దాని సెగతో అనేక మంది చలికాచుకొన్నట్టు పవిత్రమైన మనస్సుతో జపతపాలను గాలించి ఈశ్వర సాక్షాత్కారము పొందిన మహానీయులు సాంగత్యము వలన వారి సదుపదేశాలను అనుసరించట వలన మన మనస్సు భగవంతునిపై లగ్నం కాగలదు. వైద్యుడు కనిపించగానే రోగులు, రోగాలు, ఇబ్బందులు తలపునకు వస్తాయి. అనే విధంగా మహనీయులు, సద్భక్తులు కనపించినపుడు భగవంతుడూ ఆముష్మికము తలపులలో చేరుతాయి.
లౌకికులకు భక్తి సాధనలు కేవలం తాత్కాలికాలు మాత్రమే. వాటివల్ల స్థిరమైన సంస్కారము కలుగదు. కాని భగవద్భక్తి పరాయణులు ప్రతి శ్వాసతోను భగవన్నామాన్ని ఉచ్చరిస్తారు. వారు తాము భగవన్నామాన్ని అహర్నిశలు స్మరిస్తుంటారు. జ్ఞాన యోగావలంబులు ‘సోహం’ అంటూ స్మరిస్తారు. ఇంక కొందరు నాలుక నిరంతరం కదులుతూనే ఉంటుంది. అంటే వారు ఏదో స్తోత్రాన్నో, మంత్రాన్నో ఉచ్చరిస్తున్నారన్నమాట.
మనుష్యుడు ఏదో ఒక ప్రశాంత మైన ప్రదేశములో కూర్చొని మనస్సు చంచలం కాకుండా వౌనంగా భగవన్నామాన్ని స్మరించడమే జపమని అనుకొంటాము. ఏకాగ్రచిత్తంతో భక్తితో ఎడతెగకుండా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే చివరకు తప్పక భగవంతుని దివ్య దర్శనం కలుగుతుంది. దీనినే ఈశ్వర సాక్షాత్కారమంటాము. చంద్ర కిరణముల చేత కలువలు వికసించునట్లు సూర్యకిరణముల వలన కమలము వికసించినట్లు సంకీర్తనము వలన హృదయ కమలం వికసిస్తుంది. హృదయ వికాసంతో ఆత్మాభ్యుదయం కలుగుతుంది.
ఆత్మాభ్యుయంతో పారమార్థిక జీవన మార్గాలు సులభవౌతాయి. పిరికి తనం, ద్వేషము, భయము, రాజ్యమేలే చోట ఇట్లాంటి పరిస్థితులల్లో భగవంతుని రూపము మనకు అగుపడదు. తాపత్రయ భారంతో కుంగిపోయే వ్యక్తి సంసారంలో మునిగిపోతుంటే తాపత్రయం. ఉబలాటము లేని వ్యక్తి భగవత్పాదారవిందములను ఆశ్రయించి ఉన్నతిని పొందుతాడు.
అర్హుడు, సమర్థుడు, సర్వవేళలలో అణుకువ కలిగి ఉంటాడు. మూర్ఖుడు మిడిసి పడతాడు. అహంభావం మనిషి నెప్పుడూ పతనానికే దారితీస్తుంది. ప్రకృతిలో బాగా పూసి కాసి పళ్ళభారంతో వంగిన చెట్లను చూచి మనిషి జ్ఞానవంతుడైన కొలది, ఎదిగిన కొలది నిగర్విగా మారి పరులకు సహకారం అందించాలని ప్రకృతి చెప్పే పాఠాన్ని గ్రహించాలి. అహంభావానికి మూలం అజ్ఞానం. అయితే అజ్ఞానం జ్ఞానాగ్ని ముందు నిలువలేదు. సజ్జన సాంగత్యంతో కామ క్రోధాదులు నిగ్రహింపబడి నిర్మలమవుతాయి. మన మానస సరోవరం కామ క్రోధాలనే పెను గాడ్పుల చేత కల్లోలమై ఉన్నంత వరకు మనలో పరంజ్యోతి ప్రతి బింబింపజాలదు. మనస్సులో కామం అనే కళంకం అణుమాత్రమున్నా భగవంతుని చూడలేము. చేరలేము. కామక్రోధములను సంసారపరంగా,్భగపరంగా నడుపుతున్నంత వరకు అవి మనకు శత్రువులుగానే ఉంటాయి. వాటిని భక్తితో భగవంతుడి వైపునకు మళ్లిస్తే అవి మనకు ఆప్తులై భగవంతుని సన్నిధికి చేరుస్తాయి.
సీతకోసం పరితపించే రావణునితో ఒకసారి మండోదరి ‘‘లంకేశ్వరా!మీరు ఇంతగా సీతకోసం పరితప్తిస్తున్నారు కదా. మీరు మాయారూపులు కదా. మరి రాముని వేషధారులై సీత దగ్గరకు వెళ్లండి’’అన్నది. దానికి రావణుడు ‘ఓసీ! మండోదరి రాముని రూపాన్నిధరిస్తే తుచ్ఛమైన ఇంద్రియభోగాల మీద మళ్లీ ఆశపడగలనా? రామరూపభావనే మహోత్తమ స్వర్గ సుఖాన్ని సైతం తుచ్ఛమనిపించే అనిర్వచనీయమైన ఆనందం నా హృదయం నిండి పోతుంది కదా. అంజే సజ్జనుల పేరు చెబితేనే పాపభీతి కలుగుతుం. మరి అలాంటప్పుడు పాపమెలా చేస్తాం.’ అన్నాడు మరి రాముని వేషానికే ఇంత శక్తి ఉంటేరామునిలాగా మారితే ఇంకెంత శక్తి వస్తుందో చూడండి.

పెండెం. శ్రీధర్