మంచి మాట

జన్మసాఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వంతో మనిషిగా జీవించిన వారిని మహాత్ములుగా భావించవచ్చు. మానవత్వం తో మసలలేని మనుషులను పశువులుగా గుర్తించడం మనేది సహజం. జననం మరణం మన చేతిలో లేదు. మనిషికి ఏది శాశ్వతం కాదు. జగత్తే అశాశ్వితం. జగన్నాథుడు మాత్రమే నిత్యుడు, సత్యుడు. మనుష్యులు సంఘజీవులు. వారి ఒకరి తోడు లేకుండా మరొకరు జీవించలేరు. ప్రకృతి పురుషుడు ఇద్దరూ పరస్పర పూరకాలుగా, పోషకాలుగా ఉంటారు. చెట్లు ఆహారోత్పత్తిలో వదిలిన గాలి మనిషి ప్రాణవాయువు. మనిషి విసర్జించే గాలి చెట్లకు ఆహార్పోత్పాదనకు పనికి వస్తుంది. పెద్ద చేప చిన్న చేపను, చిన్న చేప మరొక చిన్న ప్రాణిని తింటుంటాయ. మనుషులను అటు చెట్లను, ఇటు జంతువులను కూడా తినేస్తుంటాడు.
అట్లాప్రకృతి లోని ప్రతి వస్తువు అవస్తువు రెండూ దేని ప్రత్యేకతను, ప్రాధాన్యతను కలిగి ఉంటుంటాయ. ఇన్నివేల కోట్ల ప్రాణుల్లో మనిషి ఒక్కడే ఆలోచించగల నేర్పుకలవాడు. మాట్లాడే శక్తి సంపన్నుడు. మంచిచెడు వేరుగా చూడగలిగిన వాడు.
కాని, అశాశ్వితమైన అనుబంధాలు, ఆస్తులు - అంతస్తులు, పరువు-ప్రతిష్ఠ ఇలాంటి వాటిపైనే మనిషి ఎక్కువగా దృష్టిని పెట్టి అసలైన శాశ్వతమైన వాటిని తన్ను తాను దూరం చేసుకొంటున్నాడు. తనతోపాటు కేవలం మంచిచెడుల ఫలితాలే వస్తాయని తెలుసుకున్నా వాటిని అవి తప్ప మిగతావాటిపై దృష్టిని కేంద్రీకరించేలా చేయలేని మనిషిని భగవంతుని మాయ కప్పివేసి ఉంటుంది.
మాయను దాటడానికి అహర్నిశమూ భగవంతుని నామాన్ని ధ్యానం చేయాలి. భగవంతుని గురించి కథలే వినాలి. భగవంతుని లీలలను అర్థం చేసుకొంటూ తాను విన్నవాటిని ఇతరులకు చెబుతూ భగవంతుని గూర్చియే ఆలోచిస్తూ ఉండాలి. కాని ఇట్లా చేయడం కూడా కష్టతరమే. ఎక్కడో ఒకచోట మానవునికి స్వార్థం కలుగుతుంది. తిరిగి ఈ మాయాజగత్తులో ఇరుక్కుని ఉంటాడు. అట్లా కాకుండా ఉండాలంటే ముందుగా మనిషి మూడు ‘మ’కారాలు వదలాలి. అవి మగువ.. మద్యం.. మాంసాహారం. ఈ మూడు కూడా మనిషిని అథఃపాతాళ లోకానికి తీసుకొని వెళ్తాయ. కనుక వీటికి దూరంగా కష్టపడి యైనా ఉండాలి.
మంచిని సంపాదించటానికి చాలా సమయం పడుతుంది.కాని అసాధ్యంకాదు. ఈ మూడింటికి దూరంగా ఉండాలంటే ముందు మనిషి కొన్ని నియమాలను పాటించాలి. వాటిల్లో ముందు కుటుంబాన్ని ప్రేమించు... అమ్మ నాన్నలను ఆదరించాలి.తల్లి తండ్రి ని ప్రత్యక్షదైవాలుగా అనుకోవాలి. ఇతర పెద్దలందరినీ కూడా తల్లిదండ్రులతో సమానంగా చూడాలి. ఇతరులకు చేతనైనంత సాయం అందించాలి. ఆకలికొన్నవారికి ఒక్క పూట నైనా అన్నంపెట్టాలి. దీన జనులను ఉద్దరించడమే దామోదరుని సేవగా గుర్తించాలి. వారి దీవెనలే శ్రీరామరక్షగా నిలుస్తాయ. ప్రార్థించే చేతులుకన్నా సాయం అందించే.. చేతులే మిన్న. భగవంతుడి కరుణా కటాక్షములు మనపై ఎల్లవేళలా ఉండాలంటే ప్రతివారిలోను భగవంతుని అంశను చూచే నేర్పు ఉండితీరాలి.
చిత్తశుద్ధితో నిరంతరం శ్రమిస్తే విజయం మన ముంగిట నిలుస్తుంది. మంచికై శ్రమించాలి. మనిషిగా మానవతామూర్తిగా ఈ జగతిలో నిలబడాలి. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా గౌతముడైనా మానవులు పుట్టి మానవులు ఎలా జీవించాలో వారు జీవించి చూపారు. కనుక మనమూ వారి దారినే నడవాలి. ఆ భగవంతుడు ఇచ్చిన వరం మానవ జన్మ.. ఆ జన్మకు ఓ అర్థం పరమార్థం చేకూరాలంటే మనిషిగా జీవిస్తే చాలు. మానవత్వం కలిగి ఉంటేచాలు. ఎదుటివారిని భాత్రుసమానంగా ప్రేమిస్తే చాలు వారు భగవంతుని రూపులుగానే కనిపిస్తారు.
ఎవరి హృదయమున భగవంతునిపైన భక్తియుండునో వారు త్రిలోకములలో నిర్ధనులైనను పరమ ధన్యులే అవుతారని పెద్దల మాట. భక్తికి వశుడైన భగవంతుడు తన పరమధామమును వదలి భక్తులలో ప్రవేశిస్తాడని భాగవతం చెబుతుంది. కనుక మనుషులందరూ వారి చేతలతో స్తుతులతో భగవంతుని సేవిస్తుంటే చాలు. వారే భగవంతునికి మారురూపులుగా తయారు అవుతారు. భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతనక్కర్లేదు. ఆ భగవంతుడు మనసులోనే సుప్రతిష్టమై వెలుగొందుతుంటాడు.

ఎస్. నాగలక్ష్మి