మంచి మాట

శరన్నవరాత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సనాతన సంప్రదాయంలో శక్తి ఉపాసన ద్వారా మానవులు తమలోవున్న అశక్తతను విడనాడి జీవితాలను కొనసాగించాలని తెలియజేసే మహా పర్వదినాలే శరన్నవరాత్రులు. కాల చక్రంలో అశ్వయుజ కార్తీక మాసములు శరదృతువులు. వర్షాకాలం ముగిసి వర్షాలు తగ్గి ప్రకృతి కాంత కొంగొత్త కాంతులను సంతరించుకుంటుంది. ఈ శరదృతువులో సూర్యభగవానుడు దక్షిణాభిముఖుడై వుంటాడు. సూర్యుడు శక్తి కేంద్రంగా, చంద్రుడు మనఃకారకునిగా వుంటారు. చంద్రుడు ఈ ఋతువులో శోభాయమానంగా తెల్లని చల్లని వెనె్నల వెలుగులను విరజిమ్ముతు ఆహ్లాదాన్ని అందిస్తుంటాడు. సకల జీవ కోటికీ సర్వశక్తి మంతుడై నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాడు.
యుగధర్మం ప్రకారం వసంత రుతువు, శరదృతువు చాలా కష్ట కాలమనే భావన కలిగిస్తాయని జనుల అభిప్రాయం. రోగ పీడలు వ్యాప్తి చెందే ఋతువులు ఇవి. జనక్షయం కలిగించేవిగా వుంటాయి కాన ఈ రెండు ఋతువులలోను దేవీపూజలను నవరాత్రులుగా పర్వదినాలుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ నవరాత్రుల్లో మొదటి మూడురోజులు దుర్గ్గాదేవి పూజలు, తరువాతి మూడురోజులు లక్ష్మీదేవిపూజ, చివరి మూడురోజులు సరస్వతీ మాత పూజలు చేయుట సంప్రదాయంగా వస్తున్న ఆచరిస్తున్న ఆచారాలు. సర్వశక్తి స్వరూపిణి అయిన జగజ్జనని అధిష్టాత్రిదేవియై ఈ నవరాత్రుల్లో సకల జనులచే అర్చనలు, స్తోత్ర పారాయణలు, దివ్యపూజా విధానాలు, దేవీమహిమలు అందుకుంటూ అనుగ్రహిస్తూ వుంటుంది. జిజ్ఞాసువులు సకలైశ్వర్య అనుగ్రహీతలై తరిస్తుంటారు.
ఈ దేవీ నవరాత్రుల్లో దేవికి జరపబడు పూజల ద్వారా మానవులకు అంతఃకరణ సిద్ధి, భక్తి, జ్ఞానం లభిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందగలరు. దుర్గా, లక్ష్మీ, సరస్వతులు జగజ్జననియొక్క స్వరూపములు. సంహారక శక్తి దుర్గాదేవి, సకలైశ్వర్య ప్రదాయిని లక్ష్మీదేవి, జ్ఞానదాయిని యైన సరస్వతీ దేవి ఒకే శక్తి యొక్క పలు రూపాలై విరాజిల్లుతూ ఆరాధనలు, అర్చనలను అందుకుంటు తమ కరుణా కటాక్షాలను జగతికి అందిస్తున్నారు. ఈ దేవీ త్రయ ఆరాధన నవరాత్రుల్లో దేవీ నవరాత్రి విశిష్టతను లోకానికి అందించడం జీవుల భాగ్యమే.
ఈ నవరాత్రులను ప్రతి సంవత్సరం అశ్వయుజ శుద్ధపాడ్యమి నుండి నవమి వరకు జరుపుతారు. దశమి రోజున విజయదశమి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ విజయదశమి రోజుననే దుర్గాదేవి రాక్షసుడైన మహిషాసురుని సంహరించింది. శుంభ, నిశుంభులను రాక్షసులను వధించింది. దుర్గాదేవి శతాక్షి రూపం ధరించి యుద్ధంలో దుర్గాసురుని వధించినగాన దుర్గగా విఖ్యాతి గాంచింది. దేవతలా సమయంలో హేమ దుర్గే అని స్తుతించారు.
భక్తి పారాయణులు, దేవీ భక్తులు ఈ తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష వహిస్తారు. నక్తాలతో, ఏకభుక్తాలతో నిత్యార్చనలు చేస్తుంటారు. భక్తి, శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవం జరుపుకుని ఆదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. వాంఛితార్ధాలను పొందుతారు. అన్న సంతర్పణలు ఆచరించి దేవికి ప్రీతిని కలిగిస్తారు. తొమ్మిదిరోజులు దేవిని వివిధ అవతారాలలో ఆర్చిస్తారు.
అమ్మవారిని పూజించే శరన్నవరాత్రుల్లో మహిషాసుర మర్దని గాధను, అమ్మవారి ఘన విజయంగా భావించి ఈ గాథను పారాయణ చేస్తుంటారు అని మార్కండేయ పురాణం చెబుతున్నది. దేవి సప్తశతిలోను, దేవీ భాగవతంలోను ఈ గాథలు మనోజ్ఞంగా వర్ణింపబడినాయి. ఆ దేవి రక్షణ విధాన స్వరూపాలే నవదుర్గా నామాలు అని బ్రహ్మదేవుడు కీర్తించాడు.
భారతీయ సనాతన ధర్మంలో శక్తి ఉపాసనలో విశ్వజనీనత భావన వుంది. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక రూపంలో పూజించే ఆచారం వుంది గాన ఈ తొమ్మిదిరోజులు పూజించే దుర్గాదేవి రూపాలను నవదుర్గలంటారు.
అమ్మవారికి ‘శరదారాధ్య’ అని నామం అంటే శరత్కాలంలో ఆరాధింపబడే తల్లి అని అర్ధం. అమ్మవారిని నవసంఖ్యతో ఆరాధించడం ఒక విశేషం. నవ సంఖ్య పూర్ణత్వ సంకేతం, ఇందులో సృష్టి అంతా ప్రస్తావించబడుతుంది. సృష్టి నవాత్మకం. ఏకత్వ భావన, నవత్వ భావనగా విస్తరించడమే విశ్వం. ఇదే విశ్వ చైతన్యం, నవనవోనే్మషం.సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే. శక్తిని పరాశక్తిగా గుర్తించాలి.

-పి.వి.సీతారామమూర్తి