మంచి మాట

లలితాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జ్ఞాన, కర్మ, భక్తి...’’ భావములలో ఉత్తమమైనది ‘‘్భక్తిమార్గము...’’ అది నిత్యము, సత్యము... భగవంతునిగాంచుటకు ‘్భక్తి’యే మేలైనది! అందు లోను అమ్మవారి పూజించడం కొలవడమనేది ఆచారంగా వచ్చి నా సంప్రదాయంగా ఆచరించినా అమ్మవారి కృపకు అంతరా యం కలుగదు. అందులోను శరన్నవ రాత్రుల్లో శ్రీచక్రంలో చిన్మయానంద బిందువుగా నివసించే అమ్మను ఆదిపరాశక్తిని నవరూపాల్లో ఆరాధించడంఎపుడైనా నవనవోనే్మషమే.పశుపక్ష్యాది సర్వ ప్రాణికోటిలో దాగి ఉన్న పరాత్మభావమే ఈ లలితాదేవి, దీనినే నారాయణ స్తుతిధృవపరుస్తుంది.
‘‘నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్’’ అని అమ్మకు నమస్కరిస్తే త్రికాలాల్లోను అమ్మ రక్షణ అజరామరంగా ఉంటుంది.
శ్రీ దేవీ భాగవతము, శ్రీదేవీ సప్తశతి మహావిద్యా, ఆదిశంకరుల సౌందర్యలహరి, త్రిపుర సుందరీ మానస పూజాస్తోత్రం, మంత్ర మాతృకాపుష్ప మాలాస్తవం, లలితా సహస్రనామం ఇత్యాదులన్నీ లలితాదేవి వైభవమును పలు విధాలుగా ప్రస్తుతిస్తుంటాయ.
సృష్టిలోని వస్తువు అవస్తువు కూడా అమ్మనే. అట్లానే జ్ఞానముగాను, అజ్ఞానముగాను సూచితమైయ్యే దేవి కూడా ఈ లలితనే. కనుక సృష్టిస్థితులే కాక చివరకు ఈసృష్టియావత్తును తనలోకే లయం చేసుకొనే తల్లి కూడా లలితా పరమేశ్వరినీ. ఈ తల్లినే చతుర్ముఖుడైన బ్రహ్మ‘‘మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః...’’ అని సంభావించాడు.
‘‘లోకానతీత్య లాలతే లలితాతేన సోచ్యతే’’ - లోకాలను మించి అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి- లలితా పరమేశ్వరి. లోకోత్తర లావణ్య భావంతో చిన్మయ చైతన్యంతో ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్య లీలలకు లలాటం లలనాస్థలి. మొట్టమొదటగా హయగ్రీవుడు ‘శ్రీమాతా’ అన్నాడు. భావజీవుల భావనాశక్తిలో నివశిస్తుంది- భవాని. ప్రతి స్ర్తిని మాతృమూర్తిగా చూడగలిగితే చాలు శ్రీమాత అనుగ్రహిస్తుంది. ఇదే రహస్య నామ సహస్రంలోని పరమార్థం.
ఆ పరమార్థాన్ని తెలుసుకొన్న హయగ్రీవుడు లలితాదేవి సహస్రనామాన్ని పఠించినవారికి దీర్ఘాయుస్సు, వంశాభివృద్ధి ఇలాంటివే కాక కోటిజన్మలలో చేసిన పాపం నివృత్తికూడా జరుగుతుందని వాక్రుచ్చాడు. అమ్మను ఆరాధించినవారికి ఇహపరాల్లో దేనికీ లోటు ఉండదు.
‘‘చింతామణి గృహాంతస్థా’’ అన్న నామాన్ని పరిపూర్ణమైన ఏకాగ్రతతో విశ్వాసంతో పఠించినవారికి చింతితార్థములన్నీ ప్రాప్తిస్తాయి.
సామాన్యులు సైతం అమ్మను లలితాసహస్రనామాన్ని ప్రతిరోజు పఠిస్తే వారికి ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు ఎదురుకావు, వివాహాప్రాప్తి, సంతానం, ఉద్యోగం, పదవీ, ఆరోగ్యం ఇలా దేనికోసం అడిగినా అమ్మ సర్వార్థసిద్ధికలుగుచేస్తుంది.
కాళరాత్య్రాది శక్తౌఘ వృతా స్నిగ్థౌదనప్రియా లలితా సహస్రనామం. జగన్మాతకు ‘కాళరాత్రి’ అనే శక్తినామం ఉంది. హనుమంతుడు, రావణాసురునికి జ్ఞానబోధ చేస్తూ, సీతాదేవి కాలరాత్రి స్వరూపమని, లలితా పరమేశ్వరీ శక్తి స్వరూపిణి అని హితబోధ చేశాడు.
నామ, రూప, క్రియలనే ఈ మూడూ త్రిపురములు. త్రిపురములను సృష్టించి, ఆనందమయంగా విహరించే మహోదాత్త ‘శక్తి’ శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి. లలితా పరమేశ్వరీ శక్తిని ఉపాసన చేస్తే కుండలినీయోగసిద్ధుడై స్వస్వరూప సంధానము కలిగి అమృతధారలు వర్షిస్తాయని లలితాదేవి ఉపాసకులు అంటారు. ప్రతిరోజు లలితా సహస్రనామం చదివితే చాలు ఆ తల్లి అపార కృపను వర్షిస్తుంది. ‘‘చింతామణి గృహాంతస్థా’’ అన్న మంత్రాన్ని ఎల్లవేళలా పఠిస్తూ ఉంటే లలితాదేవి అనుకొన్న పనులన్నింటినీ విజయవంతం చేస్తుంది. ఈ అమ్మనే దశదుర్గుణాలను దూరం చేసి విజయాన్ని సిద్ధింపచేయమని శరన్నవరాత్రుల్లో భక్తులంతా కోరుకుంటారు.

- చోడిశెట్టి శ్రీనివాస్