మంచి మాట

గాయత్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధర్వణ వేదం ప్రకారం గాయత్రీదేవి సద్బుద్ధిని, దీర్ఘాయుష్షుని సత్సాంతానాన్ని, గోసంపదను, కీర్తిప్రతిష్ఠలను, బ్రహ్మవర్చస్సును అంతే కాదు మోక్షాన్ని కూడా ప్రసాదించే దేవతగా ప్రఖ్యాతి పొందింది. గాయత్రికి మించిన మం త్రంగాని, ఆ తల్లికి మిం చిన దైవంగాని లేరు. గాయత్రీమాత కాంతి స్వరూపం, తేజోమయి. కాంతుల్లోని దివ్య కాంతి. స్వప్రకాశం కలిగిన అఖండ మైన వెలుగు. ఋక్కులలో గాయత్రీ మంత్రానే్న నేనని భగవద్గీతలో భగవానుడు చెప్పుతున్నాడు. ప్రాణుల దేహ గోళములందు కుండలినీ శక్తిగా మూలాధారాది షట్చక్రములలో ఈ శక్తి నిబిడీకృతమై ఉంటుంది. ప్రాతఃకాలములో కుండలినీ శక్తితో సవితృతేజస్సును ధ్యానించినా, జపించినా- విశ్వకల్యాణం జరుగుతుంది. ఇదిగాయత్రీదేవి అనుగ్రహం.
సూర్యచంద్రులు మానవుని మనస్సుపైన ఎన్నో ప్రభావాలు కలుగచేస్తారు. ముఖ్యంగా మానవుడు పుట్టినపుడు ఏ రాశీలో సూర్యుడు ఉన్నాడో అది ప్రాణశక్తిగా పరిణమిస్తుంది. మానవునికి నాభిదగ్గర ఈ ప్రాణశక్తి ఉంటుంది. గర్భస్థశిశువు నాభి తల్లి నాభి గర్భంలో కలసి ఉంటాయ. ఇవి బిడ్డ పుట్టిన తరువాత వేరు చేస్తారు. అపుడు పుట్టిన పిల్లవానికి సూర్యశక్తియే ప్రాణశక్తిగా సమకూరుతుంది. ఈ ప్రాణశక్తియే గాయత్రీమాత. ఈ ప్రాణశక్తిని పొందడానికి ప్రాణాయామ నియమాలను పాటించాలని చెప్పడంలోని అంతరార్థం.
సూర్యుని శక్తి ప్రాముఖ్యతను మునులు గుర్తించారు కనుకనే రాముడు రావణునితో పోరుతున్నప్పుడు అగస్త్యమహాముని రాముని దగ్గరకు వచ్చాడు. ఆదిత్యహృదయాన్ని బోధించి సూర్యుని ఉపాసించి సూర్య నమస్కారం చేసి యుద్ధానికి వెళ్లమని చెప్పాడు. ఆదిత్యహృదయం పఠించి కదనానికి వెళ్లిన రాముడు విజయుడై తిరిగి వచ్చాడు. ఇది సూర్యుని శక్తి. ఆ సూర్యునిలోని వెలుగే సంధ్యాదేవత గాయత్రీ కనుక గాయత్రీదేవిని అర్చించినవారికి అన్ని చోట్ల విజయం కలుగుతుంది.
‘సవిత’ అంటే మానవబుద్ధి. బుద్ధిలో ప్రతిఫలించే జ్ఞాన తేజః కిరణాలే- భర్గస్సు. ‘సవిత’ అంటే పరబ్రహ్మ స్వరూపం. చైతన్యవంతమయిన నామరూపాది రుూ విశ్వమే- భర్గస్సు. అదే శక్తి స్వరూపం. ఆ శక్తే- గాయత్రీమాత.అందుకే ‘‘ఓం భూర్బువః ....’’- అన్న మంత్రాన్ని రోజూ మూడుసార్లు విజ్ఞులు, ద్విజులు పఠిస్తూ త్రిసంధ్యావేళల్లో సంధ్యా దేవతను ఉపాసిస్తారు. ప్రాణాయామం చేస్తారు. ఇలా చేసిన వారికి వారి బుద్ధి వికసిస్తుంది. మానవత్వం పరిమళిస్తుంది. సమదృష్టి ఏర్పడుతుంది. జ్ఞాన ప్రచోదనం జరుగుతుంది.
కాలస్వరూపమే బ్రహ్మతత్త్వం. బ్రహ్మతత్త్వం- త్రిమూర్త్యాత్మకం, త్రికాలాత్మకం, త్రిశక్త్యాత్మకం. ఇదే ప్రాతః మధ్యాహ్న, సాయం సంధ్యలు. సంధ్యాదేవత- గాయత్రిదేవి. శరన్నవరాత్రుల్లో గాయత్రీదేవిగా పూజించినా, తృతీయం చంద్రఘంటేతి అని ఉపాసించినా ఆ తల్లి మనకు ఏం కావాలో తానే నిర్ణయంచి ఇస్తుంది. సర్వవిద్యలను సర్వసంపత్తులను అనుగ్రహించే దేవతే గాయత్రిదేవి. పరతత్వంలోని తత్వాన్ని గ్రహించి విజ్ఞతతో ప్రవర్తించే మానవుడు సర్వాధికారిణిగా సంధ్యాదేవతను ఉపాసిస్తాడు.
‘‘అ, ఉ, మ్’’ అను మూడు అక్షరముల కలయికతో ఓంకార ప్రణవ నాదము ఏర్పడుతుంది. ఆ ప్రణవనాదమే- వేదపురాణాగమ శాస్త్రాదులకు ఆధారం. అగ్ని అధిదేవత అయిన నాదం, వేదములకు, ఆధారమయితే, శబ్దతః అర్థతః నిత్యములైనాయి- వేదములు. వేదమాత గాయత్రీ. ఆది పరాశక్తిని శరన్నవరాత్రుల్లో వేదమాతగా అలంకరించి ఉపాసిస్తారు.

- చివుకుల రామమోహన్