మంచి మాట

నామ మహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగంలో రామనామము కల్పవృక్షము. అది ధర్మార్థ కామ మోక్షములనిచ్చునది, నాల్గు వేదములు, పురాణములు, పండితులు, చివరకు శంకరుడు సైతము రామనామానే్న పరమార్థ సారముగాచెప్తున్నారు.
‘‘నామస్మరణాదన్యోపాయం
నహి పశ్యామో భవ తరణే!’’
భవసాగరాన్ని దాటడానికి నామస్మరణకంటె వేరొక ఉపాయం లేదు. లోపల వెలుపల అన్నిచోట్ల నారాయణుడే నిండియున్నాడనెడి భావనతో ప్రహ్లాదుని వలె దృఢ విశ్వాసముతో ప్రవర్తించే మానవునికి ఇలనే స్వర్గంగా భాసిస్తుంది.
రామనామానికి మించిన శక్తి మరియొకటి లేదు. శ్రీరామపదం కేవలం ఒక భౌతిక రూపాన్ని బోధించే పదం మాత్రమేకాదు. ఉపేయమైన భగవత్ప్రాప్తిని బోధించే పదం. నారాయణాయ, నమశ్శివాయ అనే పంచాక్షరీ మహా మంత్రాలలోని రెండు వర్ణాలు రామనామంగా ఏర్పడ్డాయి. శ్రీరామనామం తారకనామం. ‘సీతారామ’ పదంలోనే తారకముంది. సంసారిక క్లేశాలనుండి జరామరణ దుఃఖాలనుండి తరింపచేసేదే తారకమంత్రం.
‘‘ఓ మనసా! నా ఉపదేశాన్ని మన్నించి నీవు స్వభావసిద్ధంగానే రామనామాన్ని జపిస్తే సమస్త సుఖములు చేకూరును. రామనామము చలికి అగ్నివంటిది. దాని స్పర్శనుండియే కలిపురుషుడు తన పరివారంతో సహా దూరమై పోతున్నాడు. రామనామ మైత్రివల్ల వైరాగ్య యోగాది ముక్తి సాధనములన్నియ తమకు తాముగా నిన్ననుసరించుచున్నవి. దుర్విధి సైతం లలాటమున తానురాసిన రాతను మార్చుకొనుచున్నాడు. రామనామమను మోదకమును ప్రేమయను అమృతమున ముంచి సేవించుచో అపరిమితమైన ఆనందాన్ని అనుభవించగలవు. రామనామమను కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే ఇహపర సౌకర్యాలను పొందగలవు. రామనామమును నిదివరకు ప్రేమించినవారు, ఇప్పుడు ప్రేమించుచున్నవారు, ముందు ప్రేమించబోవువారు, వీరినే ప్రపంచము మహాభాగ్యవంతులుగా గుర్తిస్తార’’ని పెద్దలు చెప్పడంలో అంతరార్థాన్ని గ్రహించిన వారెల్లరూ రామనామాన్ని వదలక జపిస్తుంటారు.
భగవత్ప్రాప్తికి ఉపాయం (సాధనం) రామనామం కాగా ఉపేయం (గమ్యం) కూడా అదే.
రామ ఏవ పరంబ్రహ్మ రామ ఏవ పరం తపః
రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మ తారకమ్
అని రామ రహస్యోపనిషత్తు అంటుంది.
సామాన్యంగా ఉపాయం లేనిదే ఉపేయాన్ని పొందుట సాధ్యం కాదు. శ్రవణ మనన నిదిధ్యాసలనేవే తరించడానికి ఉపాయం.
శ్రీరామ ఏవ నామస్యాత్ నాభిధానం ఉపేయతః
ఉపేయ రూపావస్థానం నామార్థ ఇతి విశ్రుతమ్ అని నామార్థ వివేక గ్రంథంలో వివరించడం జరిగింది.
మనిషి తన జీవితం అశాశ్వతమని, తాను విధి చేతిలో కీలుబొమ్మననే నిజాన్ని మరచి, భ్రమలో బ్రతుకుతూ తనకి జన్మనొసగిన దైవాన్ని కాదని, ఆ పరాత్పరుని ఉనికినే ప్రశ్నిస్తూ, అహంకార దర్పంతో మిడిసిపడుతుంటారు. ఈ జీవితం నీటిబుడగ అని గ్రహించి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ లభ్యమైన, అరుదైన మానవ జన్మను సార్థకం చేసుకోవడం వివేకమంతుల లక్షణం. ఇట్టి వివేకాన్ని పొందినవారెవరైనా రామనామమనే కల్పవృక్షాన్నిఆశ్రయస్తారు.
మనిషిగా పుట్టడమే ఓ వరం. కనుమూసి తెరచేలోగా ముగిసే ఈ అపురూపమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్కర్మలతో, ఉదాత్తమైన ఆలోచన్లతో మనుగడ సాగించాలి కనుకనే స్వధర్మాచరణ, సత్యవ్రతం ఇవన్నీ సాఫీగా జరగాలంటే రాముని చరిత్రను ఆసాంతం అవగాహన చేసుకోవాలి. రాముని ధర్మాచరణను స్వానుభవంలోకి తెచ్చుకోవాలి. సత్యవ్రతాన్ని విడవకుండా ఆచరించాలి. అపుడే మనుష్యులందరూ రాముళ్లుగా మారిపోతారు. భూలోకం రామరాజ్యం అవుతుంది. సత్యయుగం వస్తుంది. అలంకారాలన్నింటిలోనూ గొప్పదైన అలంకారము, నెమ్మదైన, మర్యాద పూర్వకమైన ప్రవర్తననే. ఈ ప్రవర్తన మనకు రావాలన్నా రాముని దైనందిన జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అపుడు మర్యాదాపురోషత్తముని అలవాట్లు మనకూ అలవడుతాయ.

- జె. శ్యామసుందరి