మంచి మాట

ప్రకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచ్ఛీలత, ఔన్నత్యము, ప్రశాంతత, ధర్మాసక్తి మొదలైన స్వభావాలతో సత్త్వగుణము, ఉద్రేకము, కలవరపాటు, కఠోరత అధికారము అనే స్వభావకలితమైన రజస్సు, అమాయకత్వము, నైరాశ్యము, మాంద్యము, అకర్మణ్యతలతో కూడిన తమస్సు అనే మూడు గుణాలు స్థూల, సూక్ష్మ ప్రకృతుల రెండింటిలో కూడా కనబడతాయి. సూక్ష్మప్రకృతి స్థాయిలో ఈ మూడు గుణాల కలయిక మొత్తంగా స్థిరంగా ఉంటుంది. ఒక గుణం పెరిగినప్పుడు మరొకటి తరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఆయా సమయాల్లో ప్రస్ఫుటంగా కనిపించే గుణంపైన ఆధారపడి ఉంటుంది.
పంచభూతాలు స్థూలీకరిచబడకముందు పంచ తన్మాత్రలుగా ఉంటాయి. ప్రతి తన్మాత్రలో కూడా ఈ మూడు గుణాలైన సత్త్వ, రజస్తమో గుణాలు ఉంటాయి. ప్రతి తన్మాత్రకు ఒక పరిపూర్ణ దశ (సమిష్టి దశ), ఒక వ్యష్టి దశ అనేవి ఉంటాయి. ఐదు తన్మాత్రల యొక్క పరిపూర్ణ సాత్త్విక దశలు కలిసి అంతఃకరణం అనేది ఏర్పడుతుంది. అంతఃకరణంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే భాగాలు ఉంటాయి. మనస్సు ఉద్వేగాలు, అనిశ్చయతకు ఉనికిగా ఉంటుంది. బుద్ధి వివేకము, నిశ్చయాత్మకము, నిర్ణయాలు తీసుకునే ఉపకరణంగా ఉంటుంది. చిత్తము జ్ఞాపక శక్తి, అహంకారము నేను, నాది అనే భావనలకు ప్రతీకలుగా ఉంటాయి. తన్మాత్రల యొక్క వ్యష్టి సాత్విక దశలవల్ల పంచ జ్ఞానేంద్రియాలు అయిన కర్ణములు ఆకాశం నుండి, త్వక్కు వాయువు నుండి, చక్షువులు అగ్ని నుండి, జిహ్వ జలం నుండి, నాసిక పృధ్వి నుండి ఏర్పడుతున్నాయి.
తన్మాత్రల యొక్క రాజసిక స్వభావం నుండి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనే పంచ ప్రాణాలు ఏర్పడుతున్నాయి. తన్మాత్రల యొక్క వ్యష్టి రాజసిక స్వభావాల కలయిక నుండి పంచ కర్మేంద్రియాలైన వాక్కు ఆకాశం నుండి, పాణులు వాయువు నుండి, పాదాలు అగ్నినుండి, జననేంద్రియాలు జలం నుండి, గుదము పృధ్వి నుండి ఏర్పడుతున్నాయి.
తన్మాత్రల వ్యష్టి తమోగుణాలు పంచీకరణం చెంది పంచ మహాభూతాలుగా ఏర్పడుతున్నాయి. వాటినుండి స్థూల ప్రపంచం ఏర్పడుతోంది. పరబ్రహ్మం నుండి పంచతన్మాత్రలు ఉద్భవిస్తాయి. పంచతన్మాత్రలు పంచభూతాలుగా పరివర్తనం చెందుతాయి. ఈ ప్రక్రియే పంచీకరణం అంటారు. భౌతికశాస్తవ్రేత్తలు బాహ్య ప్రపంచాన్ని విశే్లషణ చేసినట్లుగానే తాత్వికులు, సత్యశోధకులు వ్యక్తుల యొక్క అంతరంగ ప్రపంచాన్ని విశే్లషించి వివరించారు. వ్యక్తులు మూడు శరీరాలను కలిగి ఉంటారని ఋషులు కనుగొన్నారు.
పంచీకరణం చెందిన పంచభూతాల కలయికవల్ల స్థూల శరీరం ఏర్పడుతుంది. పూర్వకర్మల ఫలితంవల్ల ఈ శరీరం ఏర్పడుతుంది. ఈ స్థూల శరీరంతోనే సుఖ దుఃఖాలను అనుభవించవసి ఉంటుంది. పిండదశ, జన్మము, ఎదుగుదల, మార్పులు, క్షీణము, మరణము అనే ఆరు విధాలైన దశలకు ఈ శరీరం లోనవుతూ ఉంటుంది. దారాసుతాదుల బంధాలకూ, బంధుత్వాలకూ మూలమైనది ఈ శరీరమే. పంచభూతాలు పంచీకరణం చెందని స్థితిలో సూక్ష్మ శరీరం ఏర్పడుతోంది. పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా ఈ శరీరం నిర్ణయింపబడుతుంది.
ఈ శరీరమే ఆనందం, బాధ మొదలైన అనుభూతులకు ఆలవాలంగా ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు మరియు మనస్సు, బుద్ధి కలిసి మొత్తం పదిహేడు విషయాలతో సూక్ష్మ శరీరం ఉంటుంది. వివరించడానికి వీలులేని శరీరం కారణ శరీరం. ఇది అవిద్య, అజ్ఞానం, వాసనకు ఆలవాలమై స్థూల, సూక్ష్మ శరీరాలు ఏర్పడడానికి కారణభూతమై ఉంటుంది. ఈ కారణ శరీరం గుర్తించడానికి వీలు లేనిది. ఆలోచనల చేత మార్పు చెందనిది ఈ కారణ శరీరం.
*

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.

-కరణం రాజేశ్వరరావు