మంచి మాట

కష్టార్జితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూడిన జీవితాన్ని కోరుకునే వారెవరైనా కష్టాన్ని ఇష్టపడతారు. కష్టాన్ని నిండుమనసుతో నమ్ముకుంటారు. కష్టం తర్వాత అందుకు తగిన ప్రతిఫలంగా సుఖం చేకూరుతుందని విశ్వసిస్తారు. రద్దీగా వున్న ప్రాంతంలో వాహనం సురక్షితంగా నడిపించడం కత్తిమీద సాము. ముఖ్యంగా నాలుగు అంతకుమించిన బజార్ల కూడళ్లలో సంకేతాలకు అనుగుణంగా వెళ్లడంలో ఎవరి ప్రణాళిక వారిది. ఎవరిదో సొమ్ము రోడ్డుపై పడిపోయినపుడు అది చూసినవారు చూస్తూ తమకెందుకని వెళ్లిపోయేవారే కాదు, ఎవరిదో తెలుసుకొని అందజెయ్యవలసిన బాధ్యత తమదే అన్నట్లు తపించే వారున్నట్లే.
న్యాయంగా రావలసిన సొమ్ముకి సైతం అంతో ఇంతో పడేస్తే తప్ప రాదని, ఆశించేవాడున్నపుడు ఎంతో కొంత సమర్పించుకోక తప్పదని రకరకాల సలహాలిచ్చేవారున్నపుడు, వాటిని విని విననట్లు ప్రవర్తిస్తే అవహేళనలకు గురవడం సహజం. నలుగురు నడిచేదే దారని పదిమంది పాటించేదే ధర్మమని- అడ్డదారిని దారని, అధర్మాన్ని ధర్మమని నమ్మించజూసేవారు సైతం మనచుట్టూ వారున్నారు. ఎటొచ్చీ మొదటి తరహావాళ్లు తక్కువ సంఖ్యలో వుంటే రెండో తరహా వాళ్ళు లెక్కకు మిక్కిలిగా కనిపించడం ఆలోచనా పరులకు ఆందోళన కలిగించే విషయమే.
నిజానికి ఎవరికైనా రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లే ఎక్కువమంది కనిపిస్తుంటారు. సహజంగానే తమ శ్రమకు తగిన ప్రతిఫలం దొరికినా దొరక్కపోయినా పరుల సొమ్ముని కోరుకోరు. ఎవరో తమకేదో చెయ్యలేదని, తమకు సహకరించలేదని ఎంత మాత్రం విచారించకపోగా తాము చేస్తున్న పనిలోని లోపాలను గుర్తించి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ స్వశక్తితో తమ నైపుణ్యాలను పెంచుకోవడంలో ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు ప్రతిఫలంగా తమకు తగిన అవకాశాలు దొరికినా, దొరకకపోయినా నిరాశను దరిచేరనివ్వరు. వర్తమానం వెక్కిరిస్తున్నా భవిష్యత్తు పట్ల బలమైన నమ్మకంతో ముందుకెళ్తుంటారు.
వస్తు వ్యామోహం క్షణక్షణాభివృద్ధి చెందుతున్న సమాజంలో భక్తి గురించి, భగవంతుని గురించి ఎవరెంత గొప్పగా మాట్లాడినా కావలసిన సౌకర్యాలన్నింటికీ ధనమే ప్రధానం కదా! సంపాదన గురించి అందుకు అనుసరించే మార్గాల గురించి మాట్లాడుకునేందుకు, సన్నిహితులతో చర్చించేందుకు, ఎవరెంతగా ఆసక్తి చూపించినా కష్టార్జితాన్ని గురించి సుముఖంగా, ప్రముఖంగా మాట్లాడేందుకైనా చర్చించేందుకైనా ఇష్టపడే వారి సంఖ్య ప్రశ్నార్థకమే! బెల్లం చుట్టూ ఈగలు ముసరడమెంత సహజమో, అధికారం చుట్టూ అవకాశవాదులు ముసరడం అంతే సహజం. ఎక్కడున్నా ఎప్పుడైనా ఈగ తన లక్షణాలనే కలిగి వుంటుంది తప్ప మరొకరకంగా వుండనే వుండదు. మనిషి మాత్రం అలా కాదు. తన పబ్బం గడుపుకున్నాక కించపరచడంలో, వంచించడంలో, అసత్య ప్రచారపర్వంలో ఎప్పటికప్పుడు పదునుపెట్టుకుంటూ వుంటాడు. తన కష్టాన్ని, తన శ్రమని, తన స్వేదాన్ని నమ్ముకుంటూ ముందడుగు వేయాలనుకునేవారెవరైనా ఈ తరహా మనుషులను ఎంత దూరంగా వుంచగలిగితే అంత శ్రేయస్కరం. ఊసరవెల్లికి ధీటుగా రంగులు మార్చగలిగేవారికి, కడుపులో చల్ల కదలకుండా సమస్తం తమ చెంతకు రప్పించుకోగలిగేవారికి, మనసులో ఆలోచన రావాలే కాని క్షణాల్లో కార్యరూపం దాల్చేలా చూసుకోగలిగేవారికి కష్టార్జితానే్న శ్వాసించే వారిపట్ల, కష్టార్జితానే్న విశ్వసించేవారిపట్ల, కష్టార్జితానే్న ఇష్టపడేవారిపట్ల సదభిప్రాయం వుంటుందని ఎవరాశించినా అది దురాశే అవుతుంది. కష్టార్జితాన్ని ప్రేమించేవారిపట్ల, కష్టార్జితాన్ని కళ్ళకు కట్టేవారిపట్ల ఎవరికీ చులకనభావం వుండవలసిన అవసరం లేదు. ఎవరెన్ని బాహ్యాడంబరాల్లో మునిగితేలాలని కోరుకుంటున్నా ఆ తాలూకు కలల్లో మునిగి తేలుతున్నా శ్రమనే ప్రేమగా, కష్టాన్ని ఇష్టంగా ఇష్టపడేవారు మాత్రం తమ అంతరాత్మ ఆదేశానుసారం నడుచుకుంటారు తప్ప పైపై మెరుగులను పరుగులను ఎంతమాత్రం ఇష్టపడరు. తన కోసం, తన కుటుంబం కోసం ధర్మబద్ధమైన మార్గంలో కావలసినవి సమకూర్చుకుంటూ, తానున్న సమాజం తన వేలెత్తి తనను చూపక తనలోని సమున్నతమైన వ్యక్తిత్వాన్ని స్వీకరించేందుకు తద్వారా కష్టార్జితం ముందు హంగులు, ఆర్భాటాలన్నీ దిగదుడుపేనని కనువిప్పు కాగా, మెరుగైన ఆలోచనలతో ముందడుగు వేసేందుకు కావలసినంత స్ఫూర్తిని కలిగించాలి.

- కొల్లు రంగారావు