మంచి మాట

ధర్మ మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేజనా సుఖినోభవన్తు అన్నది భారతీయుల భావం. నలుగురూ బాగుంటే ఆ నలుగురిలో నేను ఒకణ్ణి అనే అనుకొంటారందరూ. భారతదేశం పుణ్యభూమి. ఇందులో ఏ కర్మ చేసినా నలుగురూ బాగుండాలని సుఖసంతోషాలతో వర్థిల్లాలని అనుకోవడం వారి జీవనాడిలో ఇంకి పోయ ఉంది. వారు సంకల్పం చేసుకొన్నా లేకపోయనా కూడా సర్వజనహితమే జరగాలన్న ది వారి భావన అయ ఉంటుంది.
భారతీయులు వేదమే పరమ ప్రమాణం. వేదం ధర్మాన్ని ఆచరించమని చెబుతుంది. నాలుగు పక్కల నుంచి మంచి భావనలు నావైపుకు రావలని ఆశించమంటుంది వేదం. ధర్మాన్ని నీవు ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటుంది ధర్మశాస్త్రం. ‘‘బ హుజన హితాయ బహుజన సుఖాయ’’ అని భారతీయుల భావన. ధర్మానికి మూలపదం ‘్ధృ’, ధరించి ఉంచేది ధర్మం. ధర్మమనగా ఆశింపదగిన గమ్యం. ఇది సౌఖ్యాన్ని, బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. భారతీయుని జీవన సరళికి ప్రధానమైనది ధర్మం. సర్వానికి ధర్మమే మూలం.. సత్యం, అహింస, దయ, శౌచం వంటివి సామాన్య ధర్మాలు.
పరిణామ శీలమైన ఈ సమాజానికి ధర్మం కూడా కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకయుగంలో తప్పు అయన మరొక యుగంలో సరియైనదే కావచ్చు. కాని ధర్మం వల్ల మంచి ప్రయోజనమే కలుగుతుంది కాని ఎపుడూ ఎలాంటి హాని జరుగదు.
ధర్మానికి శ్రీరామ చంద్రుడైనా సామాన్య మానవుడైనా ఒక్కటే. భగవంతుడు ఇన్ని అవతారాలు ఎత్తడానికి కారణం అధర్మం పెచ్చు మీరితే ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికే. ధర్మాచరణకు అవకాశం ఉండటం వలననే మానవ జన్మ శ్రేష్ఠమైనదని చెబుతారు.
శ్రీరామా వతారంలో పరదారా కాంక్ష వల్ల రావణాసురుడు శ్రీరాముని చేతిలో చనిపోయాడు. శ్రీకృష్ణావతారంలో దుర్యోధనుని రాజ్యకాంక్ష వల్ల ఎందరో అధర్మపరులు బయటకు వచ్చారు. వారినందరినీ శ్రీకృష్ణుడే సంహరించాడు.
రాక్షసుల్లోని తమోగుణం వల్ల సర్వానికి మేమే అధికారులం అని విర్రవీగుతారు. సర్వమూ మా మాట మీదనే మేము చెప్పినట్లే సాగాలని హుంకరిస్తారు. అటుంవంటి వారంతా అహంకార తిమిరంతో కళ్లు మూసుకొని పోయ ప్రవర్తిస్తుంటారు. దానితో అధర్మం పెచ్చుమీరు తుంది. సాధువులు సజ్జనులు బాధలకు గురి అవుతారు. అటువంటపుడు ధర్మమూర్తి అయన భగవానుడు తనకు తానై తన్ను సృజియంచు కుంటాడు. భూమి పైకి వచ్చి అధర్మపరులను నాశనమొనరు స్తాడు. ధర్మాన్ని నమ్ముకుని బతికేవారికి అండగా నిలబడుతాడు. అందుకే ధర్మస్వరూపం భగవానుడు అని కొనియాడుతారు.
ప్రాగ్జోతిష్య పురంలో నరకుడు అనురాక్షసుడు విజృంభించి సాధువులను హింసించడం ఆరంభించాడు. తన అనుచరగణంతో కలసి సజ్జనులను బాధించడం కాదు 16 వేల మంది నారీ జనాన్ని బలవంతంగా తీసుకొని వెళ్లి తన రాజప్రసాదంలో బంధించాడు. వారంతా నానా నరక యాతనలు పడి చివరకు శ్రీకృష్ణుని శరణు కోరారు. సత్యభామా సమేతుడై నరకాసురుడు నరకునిపై దండెత్తి వెళ్లి వాడిని నిర్జించాడు. వాని పీడ విరగడ అయందని సర్వ మానవాళి సంతోషించింది. వాడు విరగడు అయ్యాడని సంతోషిస్తూ దీపావళి పండుగను కూడా చేసుకొన్నారు. ఆనరకుని బంధీలుగా ఉన్న ఎంతోమంది బంధవిముక్తులయ్యారు. 16వేల మంది నారీజనం శ్రీకృష్ణుణ్ణే వివాహం చేసుకొంటామని చెప్పారు . అందుకే వారిరందరికీ శ్రీకృష్ణుడు నాథుడయ్యాడు.
ధర్మ మార్గం తప్పిన వారెవ రైనా సరే వారికి దండన తప్పదు. తప్పు చేస్తే ఎంతటి ఘనులైన ధర్మశాస్త్రం ఆ తప్పు కు శిక్ష విధించి తీరుతుంది. ఇదే భారతీయులను ధర్మమార్గంలో నడిచేవారిగా నిలబెడుతోంది.

- సాయఅఖిల్