మంచి మాట

ఆచార్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ తనువు అజ్ఞాన మట్టితో నిర్మితమై, లోకపు పాప, పుణ్యాల జాడ ఏమిటో తెలియకుండా జన్మించినప్పటికీ, వ్యాపించియున్న అజ్ఞాన పొరలను చీల్చి, జ్ఞానమనే ప్రకాశ దీపాన్ని వెల్గించి విశ్వమంతటికీ దేదీప్యకాంతిని ప్రసరిల్లేటట్లు నాటి తొలి ఆశ్రమ గురువులు కొవ్వొత్తిలా కరుగుతూ శిష్యగణానికి మహోజ్వలమైన జ్ఞాన ప్రదీప్తిని వెదజల్లేవారు. విద్యను బోధించే మహోన్నత గురువుల యెడ, వినయ విధేయతలతో ఒదిగి, పరిపూర్ణ జ్ఞాన సముపార్జనను అందిపుచ్చుకుని మెలిగే శిష్యులు నాటినుండి నేటివరకు ఉన్నారనేది యథార్థం.
అనుబంధం, ఆప్యాయత, పశ్చాత్తాపం, మమకారం, సహనం, క్షమ, వ్యాకులత మొదలైన సుగుణాలు గల బంధం గురుశిష్యుల నడుమ తరతరాలకు తరగని మూలధనం. వాల్మీకి మహర్షి హస్తమునుండి ఆవిష్కరింపబడిన మహోద్గ్రంధము ‘రామాయణం’. వాల్మీకి రామాయణంలో సృష్టికి ప్రతిసృష్టి చేయు సమర్థుడు, అస్త్రప్రయోగదక్షుడు. గాధి తనయుడైన విశ్వామిత్ర మహర్షికి, అయోధ్య నగర రాజ్య దశరథుని పుత్రుడు శ్రీరాముడికి మధ్యగల గురు శిష్యానుభక్తి సృష్టి ఉన్నంతకాలం సువర్ణాక్షరాలతో లిఖించినదై ప్రసిద్ధి చెందును.
విశ్వామిత్రుడు లోకసంరక్షణార్థం మహాయజ్ఞం సంకల్పించాడు. దానికి మారీచ, సుబాహులనే రాక్షసులు విఘ్నాలు కలిగించసాగారు. వారిని తుదముట్టించాలని మహర్షి తలచాడు. దానికై సత్యధర్మ ధారణ చేస్తున్న వీరుడు సుగుణాల రాశి అయన దాశరథిని తన అస్త్రంగా ఎక్కుపెట్టాలని అనుకొన్నాడు. ఆయన ఆశయ సిద్ధికై విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరానికి వచ్చాడు.
శ్రీరాముని తనతో పంపించమని విశ్వామిత్రుడు దశరథుని కోరాడు. ఆ మాట వినగానే దశరథుని గుండె తట్టుకోలేకపోయింది. రాక్షస సంహారానికి పంపించడానికి దశరథుడు నిరాకరించాడు. సభలో కొలువైయున్న వశిష్ఠుని హితోపదేశంతో శ్రీరాముడిని విశ్వామిత్రునితో సాగనంపడానికి దశరథుడు అంగీకరించాడు. అట్లా విశ్వామిత్రుని వెంట రామ, లక్ష్మణులు అనుసరించారు. వారిరువురికి బల - అతిబల విద్యలను ఉపదేశించారు మహర్షి. వాటి ప్రభావంవల్ల ఆకలి, దప్పులు, అలసట, కలుగవు అని మహర్షి వారికి చెప్పాడు. అట్లా వారికి మహర్షి ఎన్నో అస్త్ర శస్తవ్రిద్యలను బోధించాడు. వాటి ద్వారా రాక్షససంహారం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు.
రామలక్ష్మణులు గురువు సేవలో నిమగ్నమయ్యారు. గురువుకు శిష్యుల పై ఉన్న ప్రేమవాత్సల్యాలతో రామలక్ష్మణులను విశ్వామిత్రునికి మరింత చేరువయ్యారు. విశ్వామిత్రుడు ‘కౌసల్యా సుప్రజరామా పూర్వ సంధ్యా ప్రవర్తతే’ అనే మేలుకొలుపు గీతం ఆలపించి, శిష్యులమీద ఉషఃకాంతులు ప్రసరింపజేశాడు. సరయూ, గంగానదుల సంగమ విశేషాలను అడిగి, గురుముఖతః తెలుసుకున్నారు రామలక్ష్మణులు. తాటక అనే యక్షిణి దుశ్చర్యను అంతమొందించాలని, స్ర్తి అయిన తాటకను వధించమని ఆదేశించినపుడు ‘స్ర్తి’ని చంపడానికి సంశయిస్తున్న రాముడితో అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని పలికిన గురువు మాటకు గౌరవాన్నిచ్చి ‘శబ్దవేది’తో ఆమెను సంహరించాడు. ఇంద్రాది దేవతలు రాముడిని స్తుతించారు. విశ్వామిత్రుని యజ్ఞ్భూమికి రామలక్ష్మణులు కాపాలాదారులైనారు. యజ్ఞం చివరి రోజున యజ్ఞకుండం నుండి జ్వాలలు చెలరేపుతూ మారీచ, సుబాహులు అనుచరులతో విజృంభించినపుడు శ్రీరాముడు పరాక్రముడై తలపడి వారిని తుదముట్టించి యజ్ఞం నిర్విఘ్నంగా జరగడానికి తోడ్పడి గురువు మెప్పును పొందినాడు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఉంటే జ్ఞానప్రసాదానికి అడ్డు ఉండదు అన్నట్లు, మిథిలా నగరానికి వెళ్తున్నపుడు మార్గంలో ప్రవహిస్తున్న గంగానది వృత్తాంతాన్ని వినమ్రంగా అడిగి విశ్వామిత్రుని ద్వారా భగీరథుని చరిత్ర విశేషాలను గ్రహించాడు శ్రీరాముడు. అయితే విశ్వామిత్రుడు భగరథుని గురించి చెప్పిన దానిని పరీక్షిస్తే పూర్వీకుల గొప్పదనం, తల్లిదండ్రులపట్ల భక్తి, పట్టుదల మొదలైనవి అలవడతాయని ఉపదేశించి, అదేవిధంగా విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకే గౌతమాశ్రయంలో కాలుమోపి అహల్యకు శాపవిముక్తి కల్గించాడు. గురువే సర్వమన్న తత్త్వాన్ని లోకానికి చాటాడు.జనకుని కుమార్తె సీతను కళ్యాణమాడాడు. లోక కళ్యాణ రాముడిగా కీర్తిగించాడు.

-ఆంజనేయస్వామి పల్లపోతు