మంచి మాట

ధర్మస్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాముడే ధర్వస్వరూపుడు. ధర్మానికి రూపం వస్తే అదిశ్రీరాముని రూపును పోలి ఉంటుంది. సత్యధర్మపరాక్రముడన్న పేరును సార్థకం చేసుకొన్న దశరథుని పుత్రుడు. తాటక, మారీచ, సుబాహులను రాక్షసులకు తన అస్త్రాల ద్వారా తిరుగులేని సమాధానం చెప్పాడు.
లోకశ్రేయస్సునకు కారకమైన యజ్ఞాలను రక్షించాడు. శ్రీరాముని పట్ట్భాషేకం జరుగబోవు సందర్భంలో కైకతో అరణపుదాసిగా వచ్చిన మంథర దేవాసుర సంగ్రామంలో సహాయపడిన కైకకు దశరథుడిచ్చిన రెండు వరాలను గుర్తు చేసి వాటిని ఇపుడు తీర్చమని అడగమంటుంది.
హితబోధ అంటూ కైకమ్మను రెచ్చగొట్టి అధర్మమార్గాన నడిపించేట్టు చేస్తుంది. చెడు మాటలు, అబద్దపు మాటలు తీపి గుళికలు లాగా కనిపిస్తాయి. అవి ఒకటి రెండు తింటే ఏంకాదు. కాని మన విచక్షణతో ఆలోచించకుండా వాటినే అమలు చేస్తేఅధోగతి పాలు కావడం, అవమానపాలు కావడమనేది తథ్యం.
చీనీ చీనాంబరాలు ధరించి పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన వారు నారచీరలు ధరించి చెప్పులు లేని కాళ్లతో అడవి ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో దాన్ని నివారించడమెలా అన్నట్టు దిక్కులన్నింటిమీ తన దృష్టిని పెట్టి ఒకసీతాసోదరులను రక్షిస్తూనే మ రోప్రక్క రాక్షసుల ఆగడాలను అరికట్టిన ధీశాలి పురోషోత్తముడు రాముడు.
రాముడు కౌసల్యను ఎంత గౌరవంగా చూసాడో అంత గౌరవంగానూ కైకమ్మను చూశాడు. కైకమ్మ కోరినట్లుగానే నేను అడవులకు వెళ్తానని ఏమాత్రం జంకు గొంకు లేకుండా వనాలకు ప్రయాణమైనాడు.
ధర్మంతో నడుస్తున్నవాళ్లు మనకు దగ్గరగా ఉంటే మనమూ ధర్మానే్న ఆచరించిన వాళ్లం అవుతుంటాం. అట్లానే రాముణ్ణిచూసి సీతమ్మ భర్తతోడిదే భార్యకు లోకం అని ఆమె వనాలకు బయలుదేరింది.
అన్నావదినలు కానకకెళ్తె నాకు కనక భూషణాలు ఎందుకని లక్ష్మణుడూ కూడా అడవులకే ప్రయాణమైనాడు.
భరత శత్రుజ్ఞులు వచ్చి విషయం తెలుసుకొని అన్నదమ్ములు లేని రాజ్యం అందులోను పెద్దవానికి వారసత్వంగా లభించే రాజ్యం చిన్న వాడినైన నాకెందుకు అని భరతుడు కూడా అడవికే బయలుదేరాడు. రాముడే రాజ్యమేలానని స్థిరనిశ్చయంతో భరతుడు తిరిగి రాముడిని అయోధ్యాపట్నానికి తీసుకొని రావడానికి వెళ్లాడు.
కాని ఒక సారి మాట ఇచ్చిన తరువాత వెనక్కురానని రాముడు వనవాసమే చేస్తానని అన్నాడు. నీవు లేనీ రాజ్యభోగాలు నాకు అక్కర్లేదు నేనూ వనవాసమే చేస్తానని భరతుడు పట్టుబట్టాడు.
రాజులేని రాజ్యం దుర్భిక్షం కావచ్చు కనుక నీవు వెళ్లి రాజ్యానే్నలి ప్రజలకు కష్టం కలుగ కుండా చూసుకో. నేను వనవాసం తరువాత వచ్చి రాజ్యమేలుతానన్నాడు రాముడు.
భరతుడు అన్న మాట ప్రకారం రాజ్యానికి తిరిగి వచ్చాడు. అన్నకు ప్రతినిథిగా రాజ్యభారాన్ని మోసాడు. ప్రజలకు ఇబ్బంది కలుగ కుండా శత్రుదేశాలు దాడికి పాల్పడకుండా రాజ్యాన్ని రక్షించి వనవాసం తరువాత వచ్చిన సీతారాములకు రాజ్యాన్ని అప్పగించాడు.
అన్యాయం, అక్రమం చేసే రావణుడు సాధువులను, బ్రాహ్మణులను హింసించే తత్వమున్న రావణుడు సీతమ్మను అపహరించాడు. సీతమ్మను అపహరిస్తే రామునితో వైరం వస్తుంది. రామునితో వైరం ఉన్నవారికి ఈలోకంలో నిలువడానికి చోటుండదు అని విభీషణునితో సహా ఎంతో మంది జ్ఞానులు రావణునికి హితవు చెప్పారు.
కాని చెడుకాలం దాపురించిన వారికి మంచి పట్టదు కనుక కాలం మూడిన వారికి మంచి ఎక్కదు అన్న నానుడి లాగే రావణుడు మంచి వినలేదు. చివరకు వానరదండు సహాయంతో రాముడు రావణుని పైకి పోరుకు కదిలాడు. కదనరంగంలో రావణుని నిర్జించాడు. సీతమ్మ అగ్నిపునీతయై రాముని చేరింది. సీతారాములతో కలసి లక్ష్మణుడు వానరులను, భల్లూకాలను, విభీషణాదులను తీసుకొని అయోధ్యాపట్నం చేరుకొన్నారు. అక్కడ సీతారాములు పట్ట్భాషిక్తులయ్యారు. పదకొండు వేల యేండ్లు సుభిక్షంగా రాజ్యపాలన చేశాడు రాముడు. ధర్మాన్ని మనం రామునిలాగా ఆచరిస్తూ ఉంటే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది.
కనుక మనమందరూ ధర్మరక్షాపరులం అవుదాం. ధర్మాచరణులైన వారికి మన సహాయ సహకారాలను అందచేద్దాం.

చోడిశెట్టి