మంచి మాట

ప్రాయశ్చిత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతియుగంలోను జీవులు అనగా ప్రాణులు పాపకర్మల ను ఆచరిస్తూనే ఉంటారు. పాపాచరణం అధర్మం. అది నరకానికి దారితీస్తుందని అందరికీ తెలుసు. కానీ పాలు చేయడం మానుకోలేరు. ఈ కలియుగంలోని మానవులు విపరీతంగా పాపపుపనులు చేస్తూ పలుబాధలకూ, కష్టాలకూ గురి అయి దుఃఖాన్ని అశాంతినీ పొందుతూనే ఉంటారు. ఇది కలిప్రభావం అని పలు పురాణాలు తెలుపుతున్నాయి.
ససజకవి బమ్మెర పోతనామాత్యుల వారు తన రచన ఆంధ్ర మహా భాగవతంలో ప్రారంభంలోనే కలి మానవుల లక్షణాలను నారదమహర్షి ద్వారా ధర్మరాజు కు ఒక పద్యం ద్వారా బోధించారు.
మందబుద్ధి కలవారైన మానవులు పుణ్యకర్మలను ఆచరించకుండా కర్మలేవీ చేయజాలక పాపకర్మలుగా చరిస్తూ ఉంటారనీ తత్ఫలితంగా ఉగ్రరోగాల బారిన పడి అలమటిస్తుంటారని తెలిపాడు. ధర్మరాజు ఇది విని మానవులు ఎలా ఉద్ధరింపబడు తారో సెలవీయమని వినయంగా ప్రార్థించాడు. పాపాచరణకు ప్రాయశ్చిత్తం సరియైన ఔషధ మనీ, భగవంతుని స్మరణ సేవలను ప్రేమతో ఆచరించాలనీ పరిష్కారమ్గాం కూడా తెలిపాడు నారదమహర్షి. కొంచెం జ్ఞానోదయమైన మానవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొని, తాత్కాలికంగావిముక్తి కై తపిస్తూ ఉంటారు. సవ్యమైన మార్గంలోని మనస్సును మళ్లించి క్రమక్రమంగా భగవంతుని గూర్చి తెలిసి కొని తమ పొరబాట్లను దిద్దుకొంటూ భక్తితో మెలుగుతూ ఉంటారు. భాగవతంలో పరీక్షిన్మహారాజు శుకమహర్షితో ‘స్వామీ! క్వచిన్నివర్తతే... పాపాలను మరల మరలా చేస్తూ ఉండడం కేవలం కాలమును వృథా చేసుకోవడమే’గదా అన్నాడు. మనిషి ప్రాయశ్చిత్తంతో పాపాలను తొలగించుకున్నా కూడా వాటినే తిరిగి చేస్తూ ఉడడడం వలన ప్రయోజనం శూన్యం కదా. కాన పరీక్షిత్తు మహర్షితో ప్రకృతిలో త్రిగుణాల వలన కలిగే సకల పాపములను నుంచి మనిషి చివరకు ముక్తుడవడం ఎలాగా? పాపాల నుండి విముక్తుడు కాకున్నా ప్రాయశ్చిత్తం వలన ప్రయోజనం మేమి అని అడిగారు. అపుడు శుకమహర్షి ఇలా చెప్పారు.
కర్మణా కర్మనిర్ధారో... ‘రాజా! కర్మల నుండి తప్పించుకోవడానికి మనిషి ఎన్ని ప్రాయశ్చిత్తములను ఆచరించినా దుఃఖమునకు అంతం వుండదు. పాపపుపనులు ప్రాయశ్చిత్తాలు. చక్రం తిరిగినట్లుగా ప్రాణుల చుట్టూ తిరుగుచునే ఉంటాయి. వాటినుండి విముక్తి లభించడం ఎంతో కష్టం. పాపాలు అలజడిని సృష్టిస్తాయి. గాన వాటికి శాశ్వత పరిష్కారం దొరకదు. పాపాలు అజ్ఞానం వల్లనే జరుగుతాయి.
నిజమైన ప్రాయశ్చిత్తం జ్ఞానం కల్గినపుడే సాధ్యం అవుతుంది. మనం పాపాలు ఎందుకు చేస్తున్నాం. ఎందుకు కష్టాల పాలవుతున్నాం. ఎవరి వలన జరుగుతాయి అనే ప్రశ్నలకు జవాబుగా కేనోపనిషత్తు లో మనసులో ఈ ప్రశ్నలు కలుగనంతవరకు మనిషి తన జీవితానికి నిర్ణయింపమడిన తన ధర్మాలను సక్రమంగ నిర్వర్తించలేడు. తన నిజస్వరూపాన్ని గ్రహించనంత వరకూ దుఃఖపూతిరమైన జీవితానే్న గడుపుతూ సంసార సాగరంలో సతమతవౌతూ ఉంటాడు.
శ్రీకృష్ణ పరమాత్మ జన్మ మృత్యు జరావ్యాధులెందుకు జీవులకు సంభవిస్తున్నాయి. ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో వివరించారు. శుకమహర్షి భాగవత తత్వాన్ని వివరిస్తూ రాజుతో నాశ్నతః పథ్యమేవాన్నం... ‘రాజా! ప్రాణి తన వ్యాథిని నిజంగా తగ్గించుకోదలచినవాడు నియమిత విధవలను అనుసరించి మెలగాలి. తన విద్యుక్త ధర్మాలను ఆచరించి మార్గదర్శకుడుగా నిలవాలి. వ్యాధులున్నా వారు తమ వ్యాదులను నివారించుకోవడానికి వైద్యులు నిర్ణయించి న విధానమును అనుసరింపకుంటే వ్యాధుల నుండి విముక్తులు కాలేరు’ ఆ సమయంలోనే వివేకంతో మెలిగి వాటి నుండి విడబడాలి. ప్రాయశ్చిత్తం వలన కష్టాలు తాత్కాలికంగా అణగిపోయినా,అవి తిరిగి వస్తూనే ఉంటాయి. జీవులను బాధిస్తూ నే ఉంటాయి. ఈ పాపమయ జీవితంలో పాపాలు చేస్తున్నప్పుడు వాటి ఫలితాల్ని కూడా అనుభవించకతప్పదు. ‘రాజా! దీనికి ఒకటే పరిష్కార మార్గం ఉంది కలిమానవులు జ్ఞాన మార్గంలో పయనించాలి. ఫలాపేక్షతో కర్మల నాచరించరాదు. సుఖాల కోసం కష్టపడుతూ దుఃఖాల పాలు కాకూడదు. అలాంటి కర్మ చేసేవారి సమస్యలు పరిష్కారమవుతాయి. మనిషి మనిషిగా జీవించాలంటే జ్ఞానార్జనమే జీవిత లక్ష్యంగా మెలగాలి.
దైవభావనలతో సాగిపోతుండాలి. ఆధ్యాత్మిక తపస్సాధన యే ప్రాయశ్చిత్తానికి నివారణ మార్గం. శ్రేయోదాయకం.

= పి.వి. సీతారామమూర్తి