మంచి మాట

శరణాగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరణనన్న వారిని కాపాడటంలో శ్రీరాముడు ముందుంటాడు. భక్తుల రక్షణ ఆయనకు మొట్టమొదటి పని. శరణు వేడితే రావణుడినైనా వదిలిపెట్టేస్తానన్న వాడు రాముడు. ఆపన్నులైన భక్తులను ఆదుకోవటమే భగవంతుని పని. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. పరమ భక్తాగ్రేసరులైనవారు భగవంతుని కోసం పరితపిస్తూ ఆయననే స్మరిస్తూ, జపిస్తూ ఉంటారు. భగవంతుడికీ భక్తునికి తేడా నే ఉండదు.
భక్తుడైనవాడు నిండు మనస్సుతో ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని భగవంతుని వేడుకొంటారు. ఆ ఆర్తిని చూసి దేవాదిదేవుడు వెంటనే వచ్చేస్తాడు. శరణుకోరిన వారిని రక్షిస్తాడు. దీనికి తార్కాణంగా పురాణాల్లో ఎన్నో కథలున్నాయ.
చేయంచేవాడు, చేసేవాడు కూడా భగవంతుడే తాను నిమిత్త మాత్రుడినని అనుకున్న వానిని మంచిదారిలో భగవంతుడే నడిపిస్తాడు. నలుగురికీ సాయం చేసే బుద్ధిని కలుగజేస్తాడు. ఈశ్వరార్పణబుద్ధితో భక్తుడు ప్రతి పనినీ చేస్తుంటాడు. ఫలితాలకోసం ఆలోచించక పనిచేస్తుంటారు.
సందేహాలతో ఉంటే అంటే మొసలికి చిక్కిన గజరాజులాగా వేయేం డ్లు పోరాడి శక్తి ఉడిగిన తర్వాత భగవంతుడా నన్ను రక్షించు అని చెప్పి తిరిగి ఉన్నావా అసలు నిజంగా దేవుడు ఉన్నాఢా ఉంటే నన్ను రక్షిస్తాడా లేదా అన్న సంశయాన్ని వెలిబుచ్చుతుంటే భగవంతుని అనుగ్రహం అంతగా అందదు. చివరకు భగవంతుడా నన్ను కాపాడడానికి నీవు తప్ప ఎవరూ లేరు. నన్ను కాపాడి రక్షించు అని గజేంద్రుడు అనగానే సిరికించెప్పడు .. అన్నట్టు ఉన్నవాడు ఉన్నట్టుగా నే వచ్చేసి మొసలి బారి నుంచి గజేంద్రుడిని రక్షించినట్టుగానే శరణుకోరినవారినందరినీ భగవంతుడు తప్పక రక్షిస్తాడు.
కాని ఉన్నావని యోగుల హృదయాల్లోను, సాధుసత్పురుషు మనసులల్లోను నిరంతరం వసిస్తుంటావు. ఆర్తులను ఆపన్నులను ఆదుకునే నీవు వెంటనే నన్ను కాపాడు అని నమస్కరిస్తేచాలు అసలు ఆర్తిగా పిలిస్తే చాలు ఏరూపంలో రమ్మంటే ఆ రూపంలో భగవంతుడు పరుగెత్తుకు వస్తాడు.
భగవంతునికి తరతమభేదాలు నీనా తారతమ్యాలు ఉండవు. దేవతలనైనా, దానవులనైనా నరులనైనా ఒక్కటేభావనతో చూస్తారు. రాక్షసులు చేసిన స్తుతికి, రాక్షసులు చేసే మంచిపనులకు కూడా భగవంతుడు మెచ్చుకోలు ఉంటుంది. అందుకే వారికి వారు కోరిన వరాలనిస్తారు. కాని వరాలు లభించిన తరువాత వారు గర్వోన్నతిని పొంది పరమాత్మనే దిక్కిరిద్దాం అనుకొంటారు. అపుడే తిరిగి ఆ భగవంతుడేవారిని దునుమాడుతాడు.
భగవంతుని ప్రేమ పొందాలి అంటే త్యాగగుణాన్ని అలవర్చుకోవాలి. సమబుద్ధిని ఏర్పరుచుకోవాలి. విభీషణుడు అన్న రావణాసురుని అనుచిత కార్యాలను భరించలేక శ్రీరాముని వద్దకు వచ్చి శరణు వేడాడు. రాముడు శత్రుపక్షంనుంచి వచ్చాడు కదా అని ఆలోచించలేదు. తనను శరణు అంటూ వచ్చాడు కనుక అతడిని తనవానిగా చేసుకొన్నాడు. చివరకు వరకు శ్రీరాముడు విభీషణుడికి తోడుగా ఉన్నాడు.
నిత్యనైమిత్తిక కర్మలను సద్బుద్ధితో, నిస్వార్థంగా చేస్తూ ‘కృష్ణార్పణం’ అంటూ భగవంతునికి అర్పించటంవల్ల మంచి ఫలితాలను దైవమే అనుగ్రహిస్తాడు. ‘చిత్తశుద్ధి లేని శివపూజలేల’ అని వేమన అన్నట్లు అంతర్యామి పట్ల ప్రేమ, ఆరాధన లేకుండా పైపై పూజలు, పెదవి నుండి వచ్చే ప్రార్థనలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేవు. భగవంతుని శరణు వేడటానికి చిన్న పెద్ద, బీద గొప్ప అనిగాని మనుషులు, పశువులు అనే భేదభావంగాని అవసరం లేదు. ఆర్తత్రాణ పరాయణుడైన భగవంతుడు అశక్తులు, ఆపన్నులను అక్కున చేర్చుకుని ఆదరిస్తాడు.్భగవంతుని నమ్మినవారు ఎనాటికీ చెడిపోరు. ఒకవేళ దుష్టులు సైతం భగవంతుని ఆరాధించడం ప్రారంభిస్తే వారు ఆ దుష్టత్వాన్ని పోగొట్టుకొని సాధువులుగా మారిపోతారు. శరణాగతి అంటే ప్రతి విషయం కూడా భగవంతుడు చేయస్తు న్నాడనుకోవాలి. భగవంతుడు వినా మరేమీ లేదని భావించాలి భగవంతునికి ఆర్భాటాలు అవసరం లేదు. కేవలం ఏకాగ్రచిత్తంతో మనసావాచా కర్మణా భగవంతుడిని నమ్మి భగవంతుని పైన విశ్వాసంతో పనిచేస్తే చాలు. ఆ భగవంతుడు ఎల్లవేళలా సాధు రక్షకుడై ఉంటాడు.

- సాయ నిర్మల