మంచి మాట

భక్త ప్రహ్లాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరణ్యకశిపునికి నలుగురు కుమారులు. వారిలో ప్రహ్లాదుడు పరమభక్తాగ్రేసరుడు. చక్కని రూపం, విద్యాగంధం, కావలసినంత సంపద వున్నాయి. దానికి తోడు రాచబిడ్డ అయినా ఈషణ్మాత్రం గర్వం లేదు. దేవేంద్రుడు సైతం ప్రహ్లాదుని గుణగణాలను కీర్తించేవాడంటే ఆ బాలుడు ఎంత సంపన్నుడో తెలుసుకోగలము. హాస్యానికి కూడా అబద్ధమాడని సత్యవ్రత పరాయణుడు.
తనకు పరమ విరోధి అయిన శ్రీహరి మీద ఎంతో భక్తితో ఉండే కుమారుని మనసు మార్చడానికి తగిన విద్య బోధింపజేయాలని భావించి ఒకనాడు కొడుకును పిలిపించి నాయనా! విద్యవల్ల జ్ఞానం వస్తుంది, మంచిచెడుల వివేకం ఇచ్చే విద్యను నువ్వు చండమార్కుల వద్ద అభ్యసించాలి అని చండమార్కులను పిలిపించాడు. కొడుకును చండమార్కులకు అప్పగించాడు.
కొన్ని రోజులయ్యాక హిరణ్యకశిపుడు కుమారుని విద్య ఎలా ఉంది చూడాలని పిలిపించి అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు తండ్రీ! ఈ దేహధారులందరూ తమ ఇల్లు అనే చీకటి కూపంలోపల తిరుగుతున్నారే తప్ప, సర్వమూ విష్ణుమయం అని భావించడంలేదు అంటూండగా చండమార్కులవారు, నిండా ఐదేళ్లయినా దాటని బాలుడు మేం చెప్పిన శాస్త్ర విషయాలలో ఒకటి కూడా చెప్పకుండా ఏమేమో చెబుతున్నాడు. మహారాజా! మన్నించండి, ఇకమీద వీనిని దండించి రాజనీతి బోధిస్తాం. అంతవరకూ అనుగ్రహించండి అని ప్రహ్లాదుని వెంటబెట్టుకుని వెళ్లాడు. కొంతకాలానికి రాజనీతి ఉపదేశించి తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చారు. నాయనా! ఇంతకాలం మీ గురువులు ఏ ఏ నీతి శాస్త్రాలు బోధించారో అందులో విశేషం ఏమిటో చెప్పు అని హిరణ్యకశిపుడు అడిగాడు ప్రహ్లాదుడు.
చదివించిరి నను ...... చదివితి తండ్రీ! అంటూ
విష్ణుగాథా సంకీర్తనంలో ఉన్న ప్రహ్లాదుడు మాట్లాడుతుంటే హిరణ్యకశిపుని కళ్లు ఎర్రబడ్డాయి. అప్పుడు చండమార్కులు దానవేశ్వరా! మన్నించండి. ఈ తప్పు మాది కదా. మేము కాని మా ఆశ్రమంలో మరెవరూ కాని ఇటువంటివి బోధించలేదు. ఇది ఈ బాలునికి జన్మతః ప్రాప్తించింది. కనుక ప్రతిక్రియ యోచించండి అన్నారు. శరీరంలో ఏ అవయవమైనా చెడితే దాన్ని ఖండించి మిగిలిన అవయవాలకు రక్ష చేస్తారు వైద్యుడు. అలాగే ఈ కులద్రోహిని సంహరించి మిగిలినవారికి మేలు చెయ్యాలి అని ఆజ్ఞాపించాడు. క్రూర రాక్షసులు ప్రహ్లాదుని మండుటెండలో నిలబెట్టి వాడి శూలాలతోపొడిచారు. ఎంత పొడిచినా ఆ హరి భక్తిని శరీరం కదలలేదు. రక్తపు చుక్క కారలేదు. చర్మం చిరగలేదు. వానికి ఏ మాత్రం బాధ అనిపించలేదు.
చాలాకాలం క్రితంమాట- అప్పుడే దానవేశ్వరుడు తపోదీక్షలో ఉన్నాడు. ఆ అవకాశం చూసుకుని దేవేంద్రుడు తన సేనలతో వచ్చి రాక్షసులను పరాజితులను చేసి మహారాణిని చెరపట్టి తీసుకువెళ్తున్నాడు. దారిలో నారద మహర్షి కనిపించి- ‘‘దేవేంద్రా! ఏమిటీ పని. నీకు వైరం హిరణ్యకశిపునితో ..రుూ ఇల్లాలు గర్భవతి కనుక విడిచిపెట్టు అన్నాడు. అది వినిన దేవేంద్రుడు ఆమెను విడిచిపెట్టాడు. నారదులవారు ఆమెను తమ ఆశ్రమానికి తీసుకువెళ్లి ఓదార్చి రోజూ ఆధ్యాత్మిక విషయాలు బోధించేవాడు. ఆమె నిద్రపోతుంటే గర్భంలోని ప్రహ్లాదుడు అవి వింటుంటేవాడు.
ఒకనాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఆ నారాయణుడుఎవరు? ముల్లోకాలూ వెదికినా వాడు కనబడలేదు. నీకు నిజంగా తెలిసి ఉంటే అన్నాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని మనసా స్మరించి ఇందుగలడందు లేడని .సందేహం వలదంటూచెప్పబోయన ప్రహ్లాదుడిని ఉన్నాడంటున్నావే, అయితే ఈ రాతి స్తంభంలో ఉన్నాడా అని హుంకరించాడు. తండ్రీ సర్వజగత్తు నిండిఉన్నాడు అంటున్న ప్రహ్లాదునితో, అయతే శ్రీహరిని రుూ స్తంభంలో చూపించు అని అడుగుతాడు. హిరణ్యకశిపుడు వజ్రదృశ్యమైన అరచేతితో స్తంభంమీద గట్టిగా కొట్టాడు. అంతే! నరసింహ కృతితో శ్రీహరి ఆ విర్భవించి, గర్జించి, ఒక్క దూకులో హిరణ్యశిపుని పట్టి వాడి గోల్ళతో చీల్చి, ప్రేవులు లాగి మెడలో వేసుకుని భయంకరాకృతితో సింహాసనం ఎక్కి కూర్చున్నాడు ఉగ్ర నరసింహమూర్తి.
ప్రహ్లాదుడు ఆ నరసింహమూర్తి పాదాలమీద అంజలి బంధం పట్టగా, ఆస్వామి ప్రహ్లాదుని వైపు కరుణాకర దృషి పడింది. ప్రహ్లాదుని చరిత్ర వినినా, చదివినా నారాయణుని అనుగ్రహం లభిస్తుంది.
(పేరు రాయలేదు)