మంచి మాట

చతుర్విధ భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలో భక్తి వుంటే నీవు నాకు ప్రియుడవవుతావుఅని భగవానుడు ఓసారి అర్జునుడితో అన్నాడు. భక్తిఅంటే పూజలు చేయడం, వ్రతాలు, భజనలు చేయడమే కాదు.రకరకాలైన భక్తులుంటుంటారు. వారిలో ముఖ్యంగా ఆర్త, అర్ధార్ధి, జిజ్ఞాసువు, జ్ఞాని అని భక్తులు నాలుగురకాలు. ఆర్తులంటే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించిన సమయాల్లో భగవంతుని ప్రార్థించేవారు.
అర్థార్థి అంటే అర్థం. అనగా ధనం. ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధములైన సుఖ, సంతోషాలు కావాలని కోరుకుంటారు. శీలమే సదాచారము, జ్ఞానమే ఐశ్వర్యము. సదాచారమే సంపద- ఇవే నిజమైన ధనము, ఐశ్వర్యము, సంపద. అంతర్భావముతో దీని అర్థం గుర్తించక బాహ్య సంబంధమైన వస్తు వాహనాలకోసం ఆరాటపడుతూ వుం టారు. వీరినే అర్థార్థి అంటారు.
మూడవది జిజ్ఞాసువు. జిజ్ఞాసువు అదే జిజ్ఞాస. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా అతనిని పొందాలి. దాని మార్గం ఏమిటి? ఇలా ఈ తత్వజ్ఞాన సమచారం విచారణ చేస్తాడు. అది ఎలాగంటే- తత్ అనగా అది, ‘త్వం’ అంటే నేను, అదేమిటి? నేనేమిటి? నేను ఎక్కడ్నుంచి వచ్చేను? నేనంటే ఏమిటి? దీనికి గమ్యం ఏమిటి? ఈ విధంగా ఆలోచన చెయ్యడమే మీ ‘జిజ్ఞాస’. మొదట్టమొదట ‘నేను ఎవరు’ అని ఆలోచించి, ఈ జగత్తు ఎక్కడనుండి వచ్చింది, నాకు గమ్యం ఎక్కడ? ఈ మూడు విషయాలు చాలా ప్రధానమైనవి. ఈ విషయాలను పెద్దలను దర్శించి, స్మరించి, సంభాషించి, వారి ప్రబోధనలు బాగావిని, గురువుల ద్వారా లేక శాస్తమ్రులద్వారా వీటిని గుర్తుంచుకోవటానికి ప్రయత్నించాలి.
ఇక నాలుగవది జ్ఞాని. అంటే జ్ఞానము. అద్వైత దర్శనం జ్ఞానం. సుఖమే నిజమైన జ్ఞానము. భక్తులు నాలుగు విధాలుగాఉంటారని తెలుసుకున్నాం.
ఒక శ్రీమంతుడు ఒక ఊర్లో వుండేవాడు. ఆయనకు నలుగురు భార్యలుండేవారు. ఆశ్రీమంతుడు వ్యాపారం నిమిత్తం పైదేశానికి పోవలసి వచ్చింది. అతను ప్రయాణానికి ముందు నలుగురు భార్యలను కలిసి నేను పైదేశానికి వెళ్తున్నాను. అక్కడనుండి మీకు ఏ ఏ వస్తువులు కావాలో ఒక జాబితా తయారుచేసి ఇవ్వండి, ఆ ప్రకారం తీసుకువస్తాను అన్నాడు.
అతని భార్యల్లో చిన్న భార్య, మీరు వచ్చే సమయంలో నాకు మంచి మం నగలు, మంచి ఖరీదైన చీరలు, ఇంకా మంచి వస్తువులు కొని తెండి అని లిస్టు ఇచ్చింది. రెండవ భార్య కొంచెం అనారోగ్యం మనిషి. ఆమె తనకు మంచి మంచి మందులు తీసుకురండి, ఇక్కడ ఆ మందులు లభించడంలేదు అంటూ పెద్ద లిస్టు తయారుచేసి ఇచ్చింది. మూడవ భార్య కాస్త ఆధ్యాత్మిక చింతన కలది. అందుచేత అక్కడ మహనీయుల్ని దర్శించి, మంచి మంచి పుస్తకాలు, దేముడి ఫొటోలు తీసుకురండి అని రాసి ఇచ్చింది. ఆఖరికి పెద్ద భార్యను కూడా అడిగాడు- ‘నీకేమి కావాలో రాసి ఇవ్వు’ అని. ఆమె ‘‘నాకు ఏమీ వద్దు, మీరు మీ పనులు ముగించుకుని క్షేమంగా తిరిగిరావడమే నాకు కావలసింది’’ అని రాసి ఇచ్చింది. నలుగురు భార్యల లిస్టు పట్టుకుని ప్రయాణమైపోయాడు.
పని చూసుకుని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయే ముందు నలుగురి భార్యలు ఇచ్చిన లిస్టు ప్రకారం వస్తువులు తీసుకొన్నాడు. అతడు రాగానే ఎవరికి చెందవలసిన వస్తువులు వారికి నౌకర్ల ద్వారా పంపించాడు. అతను పెద్ద భార్య ఇంటికి చేరుకున్నాడు. పెద్ద భార్య భర్త రాకకు చాలా సంతోషించింది. అతను భార్య ఆతిథ్యం స్వీకరించి ఆమె ఇంట్లో ఆనందంగా వున్నాడు. భర్త తిరిగి వచ్చిన విషయం, తెలుసుకుని, ‘ఇంతకాలం తరువాత దేశానికి తిరిగి వచ్చిన భర్త తమ వద్దకు ఎందుకు రాలేదో తెలుసుకుందామని ముగ్గురు భార్యలు కలసి పెద్ద భార్య ఇంటికి వెళ్లారు. తమ భర్తను చూచి ‘‘ మీరు మా దగ్గరకు ఎందుకు రాలేదు?’’ అని ప్రశ్నిం చారు. అపుడు అతను చిరునవ్వుతో ‘‘ మీరు కోరింది మీకు అందింది కదా? ఈమె ననే్న కోరింది కనుక నేను ఈమె వద్దకు వచ్చేను. ఎవరు ఏది కోరుతారో వారికిఅదే లభిస్తుంది అని సున్నితంగా సమాధానం ఇచ్చాడు.
అట్లానే మనం ఏది కోరితే భగవంతుడు దానే్న అనుగ్రహిస్తాడు సర్వాంతర్యామి. ఎవరు ఎక్కడ ఏ విధంగా కోరితే ఆ విధంగా వారిని అనుగ్రహిస్తాడు భగవంతుడు. అతని దయకు ప్రాతులు కావాలంటే ధ్యానమే దానికి మార్గము.