మంచి మాట

సఖ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నదమ్ముల సఖ్యతకు రామలక్ష్మణులు నిదర్శనం! రావణవిభీషణులు ఒకరు మంచి తనానికి మారుపేరు అయతే మరొకరు చెడుతనానికి మారుపేరు. రావణుడు రాముని చేతిలో ప్రాణాలు వదిలితే విభీషణుడు రాముని వల్లనే బతికి బట్టగట్టాడు. వాలి సుగ్రీవులు కూడా అంతే వాలి రాముని చేతిలో మరణం పొందినా రాముని అనుగ్రహాన్ని పొందాడు. సుగ్రీవుడు చేస్తానని మాట ఇచ్చి, సుఖలాలసను పొందినా మంచి మంత్రి స్నేహితుడు, బంటు ఉన్నందువల్ల తిరిగి స్వస్థత పొంది మరిచిన పనిని చేస్తానని రాముణ్ణి క్షమించమని అడిగి, మరీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
మనుష్యుల్లో చాలారకాలవాళ్లు ఉంటారు. అట్లానే రామాయణంలోను కూడా చాలారకాల మనస్తత్వాలు మనకు పాత్రల రూపంలో కనిపిస్తాయ. కైకమ్మ కూడా మంచిదే కాని మంథర అనే దాసి చెప్పిన మాటలు విన్నందున చెడుగా రామునికి కీడు కలిగించేవిధంగా ప్రవర్తించి తనకు తాను కీడు తెచ్చుకుంది.
రావణుడు గొప్పలకు పోయ, తన చెల్లెలు శూర్పణక చెప్పిన మాటలు విని చివరకు తన నాశనమే కాక కులాన్ని కూడా నాశనం చేశారు. ఎందరో రాక్షసవీరులు రామునితోపోరి ప్రాణాలు కోల్పోయారు.
తార సూక్ష్మబుద్ధి గలది.ఆమె వాలి సుగ్రీవునితో పోరుకు వెళ్లేటపుడుపోరుకు వెళ్లడం మంచిది కాదని చెప్పింది. తమ్ముడే కదా క్షమించమని, అతనితో స్నేహాన్ని చేయమని వాలితో చెప్పింది. కాని వాలి వినలేదు. సుగ్రీవుడు కూడా మత్తులో ఉన్నప్పడు తానే స్వయంగా లక్ష్మణునికి ఎదురుపడి సుగ్రీవుని క్షమించమని మీమాట కాదనకుండా చేస్తాడని దానికోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడని అతనిపై కోపం తెచ్చుకోవద్దని మీ సోదరునిగా చూడమని చెబుతుంది. లక్ష్మణుడు కోపం తగ్గించుకుని తిరిగి రాముని దగ్గరకు వెళ్తాడు.
అలా మంచి తనకు తానుగా తెలియకపోయనా తెలిసిన వాళ్లు చెబితే వినాలి. అపుడు మంచి జరుగుతుంది. చెపితే వినేవాడు కనుకనే సుమిత్రాదేవి రాముని వెంట లక్ష్మణునికి విశ్వామిత్రుని యాగరక్షణలో తోడుగా ఉండమని పంపింది. అట్లానే సీతారాములు వనవాసానికి వెళ్లితే వారికి చేదోడు వాదోడుగా ఉండమని అడవికి పంపింది.
అమ్మమాట విని రామునితో వచ్చిన లక్ష్మణుడు కాని కాలం వచ్చి రాముడు కష్టాల్లో ఉన్నప్పుడు బాసటగా నిలిచాడు. భార్యావియోగంతో కుములుతున్న రామునికి ఎంతో ధైర్యాన్నిచ్చాడు లక్ష్మణుడు. హనుమంతుని కలయిక, తద్వారా సుగ్రీవుని (వానర రాజు) తో మైత్రి, సీతానే్వషణ, వారధి నిర్మాణం, లంకలో ప్రవేశించడం.. ఇలా ఎన్ని పనులు చేసినా అవి అన్నీ రామలక్ష్మణులు కలసే చేశారు. అందుకే శక్త్యాయుధంతో లక్ష్మణుడు మూర్ఛపోతే రాముడు నా తమ్ముడు లేకుండా నేను జీవించలేను అని వాపోయాడు. అంతటి బలమైన బంధం రామలక్ష్మణులది.
పాండవులు కూడా అంతే ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు కనుక వారికి ఏ కష్టం నష్టం వచ్చినా అందరూ కలసి శ్రీకృష్ణుని సాయంతో గట్టెక్కారు. చివరకు కురుక్షేత్రసంగ్రామంలో పోరాడి వందమంది కౌరవులను రాజ్యాలేలిన వారిని, కురువంశ వృద్ధులను, వీరాధివీరులను అమేయ జ్ఞాన సంపన్నులను కలిగి ఉన్నప్పటికీ పాండవుల కలసి కట్టుగా ఉన్నారుకనుక ధర్మాన్ని ఆచరించారు కనుక సత్యానే్న పలికారు కనుక శ్రీకృష్ణుడే వారి పక్షం వహించాడు కనుక వారికి విజయం లభించింది.
ఎపుడైనా ఎవరితోనైనా సఖ్యతగా ఉంటేనే ఎంత కష్టసాధ్యమైన విషయాన్నైనా సాధించవచ్చు. శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు. శ్రీకృష్ణుడు ఆగర్భ శ్రీమంతుడు అయతే కుచేలుడు పుట్టు దారిద్య్రం అనుభవించినవాడు. కాని ఏనాడు దురాశకుపోలేదు. సత్యాన్ని వీడలేదు. ధర్మాన్ని కాలదన్నలేదు. కుచేలుని పిల్లలకు అన్నంపెట్టలేని స్థితిలో ఉన్నాము కనుక ఒక్కసారి కృష్ణుని దర్శించి మన బాధలను చెప్పిరమ్ము ఆయన ఏదైనా దారిద్య్రనాశనానికి ఏ ఉపాయం అయనా చెబుతారు అనికుచేలుని ధర్మపత్ని పురమాయస్తే పాపమా బీదబ్రాహ్మణుడు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లాడు. కాని అతనిని నోరు తెరిచి ఏమీ అడగలేదు.కాని కుచేలునికి , శ్రీకృష్ణునికి ఉన్న సఖ్యత వల్లనే కుచేలుడు కూడా శ్రీమంతుడు అయ్యాడు.

- కె. యాదయ్య