మంచి మాట

విచక్షణాజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం రామాయణం చదువుతాం. భారత భాగవతాలు చదువుతాం. భగవద్గీత పారాయణం చేస్తాం. కాని వాటిలోగల విషయాలను ఆచరణలోకి తేవాలని మాత్రం అంతగాచాలామంది ఆలోచించరు. ఒకవవేళ ఆలోచించినా ఆచరణ కు వచ్చేసరికి ఈ ఒక్కసారి అనుకొంటూ అలవాటు ప్రకారం చేయాల్సింది కాక మరేదో చేస్తాం. ఇది అందరిలోను కాదు. కాని వాటిల్లో ఉన్న విషయాలు ఆచరణలోకి తీసుకొస్తే మాత్రం లోకం అంతా సుఖమయమే కదా. భగవంతుడు సర్వాంతర్యామి అని, అతడు లేని చోటు లేదని భాగవతం స్పష్టంచేసింది. ఆ విషయం మనం నమ్మితే భగవంతుని రూపాలను మనం ఎల్లడెల్లా చూడగలుగుతాం. సమదృష్టి ఏర్పడుతుంది కూడా. కాని భగవంతునిపై నిశ్చలమైన నమ్మకాన్ని చాలామంది పెట్టలేకపోతారు.
భగవంతుని దర్శనానికి వేల మైళ్ళ దూరం వెళ్లి పుణ్యక్షేత్రాలు దర్శించవలసిన పనిలేదు. భగవంతుని ఇంట్లో పూజించవచ్చు. మనం నివసించే గ్రామంలోగల ఆలయానికి వెళ్లి పూజించవచ్చు. ఎవరు ఏ పేరుతో అర్చించినా అవి అన్నీ తనకే చెందుతాయని శ్రీకృష్ణుడు గీత ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. కనుక మనం పూజించే దేవతలలో ఎక్కువ తక్కువలు గమనించడం అవివేకం.
రోజురోజుకీ పాపకృత్యాలు పెరిగిపోతున్నాయి. మానవులు జంతు ధర్మాన్ని కూడా పాటించడంలేదు. జంతువులు పక్షులు వాటి సంతతిని ఎంతో ప్రేమిస్తాయి. వాటికి రక్షణ కల్పిస్తాయి.చాలామంది మనుష్యులు మానవత్వంతో బతకడానికి కూడా వెనుకంజనే వేస్తున్నారు. స్వార్థంతో తాము ఒక్కరిలో బాగుంటే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఆలోచన జంతువులకు కూడా ఉండదుకదా.
నేడు భవద్భక్తి ఎంత ఎక్కువైపోయిందో చూస్తున్నాం. కాని, భక్తిలో ఆడంబరాలు పెరిగిపోతున్నాయి. దేవునికి వెంఢి బంగారాలలను ముడుపులుగా ఇస్తున్నారు. ఈ విషయంలో భక్తులు పోటీలు పడి వీటిని భగవంతునికి నిత్యం సమర్పిస్తున్నారు. పర్వదినాలు వస్తే రాత్రి రెండు గంటలనుండి ఎడతెరిపి లేకుండా దైవదర్శనానికి వెడుతున్నారు. భగవద్దర్శనం కొరకు అన్నీ పుణ్యదినాలే. ఫలానా రోజు దర్శిస్తే అత్యధిక పుణ్యం వస్తుందనుకోవడం పొరపాటు కదా.
కొన్ని దేవాలయాలకు బంగారు రేకులు తాపడం చేస్తన్నారు, ఎందుకు? బంగారం అంటే మనకి అభిమానం కాని పరమేశ్వరునికి అన్ని లోహాలు ఒక్కటే. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి మహనీయులు ధనం విషయంలో ఎలా ప్రవర్తించేవారో ఒక్కసారి నెమరేసుకోవాలి. మనస్సుని పరిశుద్ధం చేసుకుని ధ్యానం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. రామాయణంలో శబరి, గుహుడు వంటి భక్తులు దైవానికి వెండి బంగారాలు ఇవ్వలేదు. శబరి రామునికి ఎంగిలి పండ్లు సమర్పించింది. గుహుడు రాముని కాళ్లు కడిగాడు. వారి భక్తిలో ఆడంబరం లేదు. భక్తి విషయంలో మన దేశంలో బ్రిటీష్ వారి పరిపాలనలో జరిగిన ఒక యధార్థ సంఘటన చూడండి.
ఉత్తరప్రదేశ్‌లో ఒక సైనిక పటలానికి రాత్రివేళ కాపలా పని ఒక సైనికుడికి అప్పగించబడింది. అతడు గొప్ప రామభక్తుడు. సైన్యంలో క్రమశిక్షణకి విలువ ఎక్కువ. వారికి అప్పగించిన పని సరిగా నిర్వర్తించకపోతే శిక్షలు తీవ్రంగా వుంటాయి. ఆ సమయంలో కొందరు భక్తులు రామభజన చేస్తూ అటు వెడుతున్నారు. కాపలా ఉన్న సైనికుడు తాను విధి నిర్వహిస్తున్నానన్న విషయం మరిచిపోయి రామభజన చేస్తూ భజన బృందంతో వెళ్లిపోయాడు.
కొంతసేపటికి పైఅధికారి తనిఖీకి వచ్చి ఆ సైనికుడు శ్రద్ధగా తన పని నిర్వహిస్తున్నట్లు గ్రహించాడు. అక్కడ సైనికులు కూడా అతడు శ్రద్ధగా విధి నిర్వహిస్తున్నట్లు అధికారికి చెప్పారు. మరునాడు ఆ సైనికుడు తాను చేసిన తప్పు అధికారికి విన్నవించగా నీవు ఎక్కడికి వెళ్ళలేదు, నీ పని నీవు చేస్తున్నట్లు రాత్రి నేను గమనించాను అని చెప్పగా అతడు ఆశ్చర్యపడి, జరిగిన సంగతి చెప్పి తన స్థానంలో ఆ భగవంతుడే ఉండి తనను రక్షించాడని చెప్పాడు. ఈ యధార్థ సంఘటన ఆనాడు అధికారికంగా ప్రకటింపబడింది. అందువలన భవద్భక్తి విషయంలో చిత్తశుద్ధి సాధన ఎంతో ప్రధానమైనవి. అంతేకాని ఆడంబరాలు అట్టహాసాలు అక్కర్లేదు. నిజాయతీగా, సత్యధర్మాలను ఆచరిస్తూ ఉంటే చాలు.

- వేదుల సత్యనారాయణ