మంచి మాట

కర్మయోగ మార్గమిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మొదటి పాశురం ‘మార్గళిత్తింగళ్’
మార్గళిత్గింగళ్ మది నిఱైంద నల్ నాళాల్
నీరాడ ప్పోతువీర్ పోదుమినో నేర్ ఇళె రుూర్
శీర్‌మల్‌గు అయ్‌ప్పాడి శెల్వ చ్ఛిఱు మీర్ కాళ్
కూర్ వేల్ కొడున్దొళిల నందకోప కుమర
ఏర్ అర్‌ంద కణ్ణి యశోతై ఇళమ్‌సింగమ్
కార్ మేని శెమ్ కణ్ కదిర్ మదియం పోల్ ముకత్తాన్
నారాయణనే నమ్కే పఱై తరువాన్
పారోర్ పుగళ్ పడింద ఏల్ ఓర్ ఎంపావాయ్
భావం: ఇది మార్గశిరమాసం. వెనె్నల నిండిన శుభదినం. సంపదలతో నిండిన వ్రేపల్లెలో నివసించే విలక్షణమైన ఆభరణాలతో ప్రకాశించే ఓ పడుచులారా! మార్గశీర్ష స్నానం చేయాలని ఇష్టమున్న వాళ్ళందరూ రండి! వాడియైన వేలాయుధాన్ని ధరించి శ్రీకృష్ణుడికి ఏ ఆపదా రాకుండా కాపాడే నందగోపుడి కుమారుడు ఎవరో కాదు సుమా! నారాయుణుడే. కనుల సౌందర్యంతో ఒప్పే యశోదమ్మ బాల సింహం. నీలమేఘశ్యాముడు, ఎఱ్ఱ తామరల వంటి కనులు కల్గి సూర్యప్రకాశాన్ని, చంద్రుని ఆహ్లాదాన్ని ఇవ్వకల్గిన నారాయణుడు అతడే. వ్రతం చేసి ఆర్తించామా! మనకు ‘పర’ అనే వాద్యాన్ని ఇచ్చి ఆనందింపజేస్తాడు. మనం చేసే ఈ శుభాన్ని చేకూర్చే వ్రతాన్ని చూసి లోకులందరూ ఆనందిస్తారు. వారినందరినీ ఆనందింపజేసే వ్రతమిది. కనుక మీరందరూ వచ్చి అందులో చేరండి అంటూ మొదటి పాశురంలోనే ఈ వ్రతం ఎందుకు, ఎప్పుడు చేస్తున్నామో, ఏం కోరి చేస్తున్నామో, ఎవరిని కోరుతున్నామో! ఆ వ్యక్తి ఎట్లాంటివాడో, ఆతడందించే ప్రతిఫలం ఏమిటో ఈ కర్మను చూసి ఎవరు ఆనందిస్తారో తెలియజెప్తున్నది గోదాదేవి.
కోరికలన్నింటిని వదిలి లోక క్షేమం కోసం మాత్రమే వ్రతం చేయరండి. అప్పుడు ‘పరమ’ పొందవచ్చు. అదే బ్రాహ్మీ స్థితి అని శ్రీకృష్ణుడు ‘‘ఏషా బ్రాహ్మీ స్థిత! పార్థ నైనం అపాప్య విముహ్యతి’’ అని తెలియజేశాడు. మోహంలో మునుగక ఆత్మజ్ఞానాన్ని పొందాలి. పరమాత్మను పొందే స్థితి అదే అని గోదాదేవి ‘పర’ అనే పేరుతో సంకేతించి చెబుతున్నది. పౌరాణిక కథనే గాకుండా తాత్త్విక జ్ఞానాన్ని అంతరంగా బోధిస్తూ మానవులను జాగృతం చేసి నిష్కామ కర్మయోగాన్ని చేయమంటున్నది గోదాదేవి ఈ మొదటి పాశురంలో.
భగవంతుని విభావతార స్థలమే సమాశ్రణీయం. అదే భగవద్రుచి కల్గించేది అని మొదటి పాశురంలో చెప్పబడుతున్నది.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

డాక్టర్. పరవస్తు కమల