మంచి మాట

విశ్వవ్యాప్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 25వ పాశురం ‘ఒరుత్తి’

25 పా. ఒరుత్తి మగనయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తువళర
తరిక్కిలానాగి త్తాన్ తీంగుని నైంద
కరుతె్తై ప్పిళైపిత్తు కంజన్ వయిత్తిల్
నెరుప్పు ఎన్న నిన్ఱ నెడుమాలే ఉన్నై
అరుతిత్తు వందోమ్ పఱైరుదియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్ పాడి
వరుత్తుముమ్ తీర్‌న్దు మగిళిందు ఏలోరెంబావాయ్

భావం:ఈనాటి పాశురంలో శ్రీకృష్ణుని, శ్రీమహాలక్ష్మియే కోరుకునే వీరత్వం, సంపద కలవాడివని, స్వామి ఆశ్రీత వాత్సల్యాన్ని కీర్తించి, ‘పర’ అనే వాద్యాన్ని అర్థించాలని వచ్చామని విన్నవిస్తున్నారు గోపికలు.
ఒక తల్లికి (దేవకీ దేవికి) పుత్రుడివై మధురానగరంలో అవతరించావు. దేవకీ వసుదేవులకు నీ విశ్వరూపాన్ని దర్శింపజేవావు. ఓకే రాత్రిలో యమునానదిని దాటి ఇంకొక తల్లికి (యశోదమ్మకు) కొడుకువై రాక్షసుల దృష్టిలో పడకుండా నందగోపుని దగ్గర దాగి పెరిగావు. శక్తి స్వరూపుడైన నందగోపుడే నిన్ను రక్షించేవాడని తలచావు. నీవు వ్రేపల్లెలో హాయిగా పెరగడం తెలిసి ఓర్వలేని వాడైన కంసుడు, నిరంతరం నిన్నుచంపే మార్గాలలు వెతుకుచుండగా అతని అభిప్రాయాన్ని సాగనివ్వక, అతని గర్భంలోనే అగ్నిలాగా పెరగడం మొదలుపెట్టావు. నీ ఆశ్రీత వ్యామోహం ఎలా పొగడగలము. కంసుడు చెడ్డవాడైనా అతనికి నీ దర్శనాన్ని అనుగ్రహించావు. శిక్షించి పరను ఇచ్చావు. లక్ష్మీదేవియే మెచ్చి నీ చెంత నిరంతరం నిల్చి ఉండే ఐశ్వర్య వీర్య గుణాలు గల సంపన్నుడివి నీవు. భక్తులై నిన్ను ప్రార్థించే మాకు పరమ పదాన్ని ఇవ్వకుండా ఉంటావా? అనే నమ్మకంతో నిన్ను గానం చేయడానికి వచ్చామంటున్నారు గోపికలు.
శ్రీ మహాలక్ష్మి హృదయ స్పందనగా సృష్టికార్యము నిర్వహించే అవతార పరమాత్మగా, ప్రద్యుమ్న నామధేయుడైన శ్రీమన్నారాయణుడి స్థితి కారకత్వ గుణాన్ని, ఆ రూప సంపదను వర్ణిస్తున్నది ఆండాళ్. శ్రీ మహాలక్ష్మియే నీ ఆశ్రీత వ్యామోహ సంపదకురక్షణా స్వభావంలో నీవు ప్రదర్శించే వీరత్వాలన తలచి నీలో స్థిర నివాసమేర్పరచుకొంటుంది కదా! ఇక మేమెంతటివారము. కరుణించి అనుగ్రహించు! అని గోపికలు ప్రార్థిస్తున్నారు.
ఆండాళ్ తిరువడిగళే శరణం

- డాక్టర్. పరవస్తు కమల