మంచి మాట

కోరవలసినవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 26వ పాశురం ‘మాలే’
26 పా. మాలే మణివణ్ణా మార్గళి - నీ రాడువాన్
మేలైయార్ శెయ్‌వనగళ్ వేండువన కేట్టియేల్
ఞలతె్తై యెల్లాం నడుంగ మరల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచశన్నియమే
పోల్వన శంగంగళ్ ప్పోయిప్పాడుడైయనవే
శాలప్పెరమ్ పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కేకొడియే వితానమే
ఆలినిలైయాలి అరుళ్ ఎలోరెబావాయ్
భావం: ఈనాటి పాశురంలో సమస్త సంపదలకు నిలయమైన శ్రీలక్ష్మీదేవియే మెచ్చే ఐశ్వర్య సంపన్నుడివి కనుక, మాకు వ్రతం కొరకు కొన్ని ముఖ్యమైన వస్తువులు కావాలి. వాటిని నీవు మాకివ్వాలి. ఈ వ్రత కర్మ ద్వారా నిన్ను కీర్తించకపోతే మా జీవితానికే అర్థం లేదు. మేము సాధించుకోలేని ఆ వస్తువులు మాకు నీవిస్తే హాయిగా స్నాన వ్రతం చేసుకుంటాము. కోరిన వాళ్ళకు లేదనక అన్ని ఇచ్చి రక్షించే ఆశ్రీత వాత్సల్యం కలవాడివి కదా! అణువులో బ్రహ్మాండాన్ని సృష్టించగల నీ శక్తి మాకు తెలుసు కృష్ణా! మమ్మనుగ్రహించు అని వ్రత సమాప్తికి పరికరాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు గోపికలు.
ఆశ్రీతుల మీద ప్రేమ వ్యామోహం కలిగిన శ్రీకృష్ణా! ఇంద్రనీలమణి వంటి శరీర వర్ణముగల స్వామీ, మార్గశీర్షమాసంలో స్నానవ్రతాన్ని ఆచరించడానికి వచ్చాము (పూర్వాచార్యులు, ఆళ్వారులు ఆచరించిన వ్రతమిది). మేము నిన్ను కొన్ని వస్తువులు అర్థించడానికి వచ్చాము. అవి ఏమనగా, కాలానే్న వణికించునట్టివి, పెద్దగా వేద ఘోషవలె శబ్ధించేవి, పాలవలె మిక్కిలి తెల్లవైనవి. నీ పాంచజన్యం వంటివే చాలా శంఖాలు మా అందిరికీ కావాలి. మిక్కిలి విశాలమైన ‘పెద్ద పర’ అనే వాద్యాలు కావాలి. నీకు మంగళం పాడగలిగే అర్హత, కంఠమాధుర్యంగల భక్తులను, వ్రతంలో ముందుకు సాగడానికి దారి చూపించే మంగళదీపం, మా వ్రత సంకేతాన్ని సూచించే ధ్వజము, ఆనందంగా వెళ్ళే మేము వర్షంలో తడిసిపోకుండా పైన కట్టుకునే మేలు కట్టు చాందినీ కావాలి. ఇవన్నీ మాకు సమకూర్చడానికి సమర్థత కలిగిన వాడివి, అణువు నుండి బ్రహ్మాండాన్ని పుట్టించినట్లు మర్రి ఆకుపై మక్కువగా సమస్త భవనాలను చిన్ని బొజ్జలో దాచుకొని పవళించినవాడివి. అందుకే నిన్ను శరణు వేడుతున్నాము అని ఆండాళ్ తల్లి ఈ పాశురంలో వ్రత పరికరాలను అర్థిస్తున్నది.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

-డాక్టర్ .పరవస్తు కమల