మంచి మాట

ఆత్మజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 27వ పాశురం ‘కూడారై’

కూడారై వెల్లుం శీర్ కోవిందా ఉన్దన్నై
ప్పాడి ప్పఱైకొండు యామ్ పెరు శెమ్మానమ్
నాడు పుకళుం పరిశినాల్ నన్ఱాక
శూడగమే తోళ్‌వళైయే తోడె శెవిప్పూవే
పాడగమే నెన్న్రనైయ పల్ కలనుమ్ యామ్ అణివోమ్
ఆడైయుడుప్పోం అదన్‌పినే్న పాల్‌శోఱు
మూడనెయ్ పెయ్దు ముళంగై వళ్‌వార
కుడి యిరుందు కుళిరిందు ఏలో రెంబావాయ్

భావం: నాటి పాశురంలో స్వామి కల్యాణ గుణములను కీర్తించి, స్వామితో కలిసి కూర్చుని మధుర పదార్థాన్ని భుజించాలి. మేము పొందబోయే సన్మానానికై మేము అలంకరించుకునేందుకై కావలసిన ఆభరణాలు, వస్త్రాలు కూడా నీవే అనుగ్రహించాలి అని సంకేత రూపంలో ఆయా వస్తువులను కోరుతున్నది గోపికలతో కూడి ఆండాళ్ తల్లి.
తనతో కూడుట ఇష్టపడని వారి మనసును కూడ జయించి తనతో చేర్చుకొనే ఉత్తమ కరుణాస్వభావం, కళ్యాణ గుణాలు కలిగిన గోవిందా! నిన్ను కీర్తించి నీ దగ్గర పర అనే వాద్యాన్ని తీసుకొని, లోకమంతా పొగిడేటట్లుగా సన్మానము పొందాలని మా కోరిక.
ఆనాటి మా రూపం కూడా ప్రకాశాలు విరజిమ్ముతూ, అందరికీ మా ఆనందం వ్యక్తం కావాలి. అందుకోసం మాకు కొన్ని ఆభరణాలు కావాలి. అవన్నీ నీవు ఇవ్వగలిగినవే. చేతులకు కంకణాలు, బాహువులకు దండ కడియాలు అందమైనవి కావాలి. అట్లాగే చెవికి ప్రకాశించే కమ్మలు, కర్ణపూవులు కావాలి. ఈ సన్మానాన్ని అందుకోవడానికి వెళ్ళే మా పాదాలకు చిరుమువ్వలతో శబ్ధించే కాలి అందెలు మొదలైనవి కావాలి. ఆ తర్వాత ధరించడానికి పట్టు వస్త్రాలు కావాలి. పిమ్మట పాలు అన్నముతో ఉడికించి నిండుగా మునిగేట్లుగా నెయ్యి పోసి చేసిన మధుర పదార్థాన్ని మోచేతుల ద్వారా నెయ్యి కారుచుండగా, నీతో కలిసి కూర్చొని భుజించి ఆనందించాలని వుంది. అందుకే మేమీ వ్రతం చేస్తున్నాము. మా ఈ చిన్ని కోరికను అనుగ్రహించు కృష్ణా అని ప్రార్థిస్తున్నారు గోపికలు.
నీ గోవింద తత్త్వాన్ని గ్రహించి నిన్ను చేరవచ్చిన మేము నీ కళ్యణ గుణాలను ఏమని కీర్తించగలము! ఇంద్రియాల అహంకారాన్నణిచే సంకేతాలుగా ఆయా ఆభరణాలు ధరించి, ఆత్మజ్ఞానాన్ని పొంది, నిన్ను చేరి పొందవలసిన ‘పర’ వేరేదో కాదయ్యా! నీలో చేరి సంసార చక్రం నండి విముక్తి పొందడమే శ్రీకృష్ణా! అజ్ఞానులైన మమ్మురక్షించి నీలో చేర్చుకో. అదే మేము పొందే మధురానంద పదార్థము అని ఆండాళ్ శ్రీకృష్ణుని ప్రార్థించడమేగాక, భక్తులకు ప్రబోధిస్తున్నది ఆండాళ్ తల్లి.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్. పరవస్తు కమల