మంచి మాట

అనుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 28వ పాశురం కరవైకళ్

కఱవైకళ్ పిన్‌శెన్ఱు కానం శేర్‌న్దు ఉణ్బోం
అఱివు ఒన్ఱుం ఇలాలద ఆయ్‌క్కులత్తు ఉందన్నై
పిఱవి పిఱందనై ప్ణుంయం యాం ఉడైయోం
కుఱైపు ఒన్ఱు మిల్లాద కోవిందా ఉందన్నోడు
ఉఱవేల్ నమక్కుఇంగు ఒళిక్క ఒళియాతు
అఱియాద పిళ్ళైకళోం అన్బినాల్ ఉన్దన్నై
శిఱు పేర్ అళైత్తనవుం శీఱియరుళాదే
ఇఱైవా నీతారాయ్ పఱై ఏలో రెంబావాయ్
భావం: ఈనాటి పాశురంలో గోపికలు, తాము ఏమి తెలియని అజ్ఞానులం. శరీరపోషణ కోసం జీవించే శ్రమజీవులం.నీతోగల సంబంధ బాధవ్యాలే మేము నిన్ను కోరేందుకు ప్రోత్సహించాయి. మాతో కలిసి తిరిగిన చనువుతో మమ్ము కాపాడే గోవిందుడివని చిన్న పేరుతో పిలిచాము. వేద వేద్యుడివైన నీ వైభవాలు, గుణగణాలు స్తుతించాల్నా మాకేమీ తెలియదు. నీవు జన్మించిన కులంలోనే పుట్టామన్న అర్హత తప్ప మాకేమీ లేదు. ‘‘మీకు నేను పరను ఎలా ఇవ్వను’ అని ఆలోచించకు స్వామీ! మా హృదయం నిండా నీ మీద నిండిన ప్రేమ, భక్తి ఇవి చాలు గదా స్వామీ! మమ్మనుగ్రహించి ‘పరను’ ప్రసాదించు’ అని తమ ఉన్నతమైన విశాలమైన మనసను తెలుపుతున్నారు గోపికలు.
ఏ మాత్రం జ్ఞానం లేని గోపకులంలో జన్మించిన వారము. జాతి చేత గొప్ప వారము కాము. నీతో కలిసి జీవించుట వల్లనే మాకు లోకంలో గుర్తింపు వచ్చింది. ఏ లోపములు లేని పరిపూర్ణ కళ్యాణ గుణములతో ఒప్పేవాడిని, గోవిందుడివి.. నీతో మాకు గల ప్రేమాభిమానాలు, భక్తి సంబంధాలు ఎప్పుడైనా పోగొట్టుకోలేని బలమైన బంధాలు. మర్యాద, మన్ననలు తెలియని వారము. అందుకే నీతోగల అనుబంధం, సఖ్యత వల్ల ‘గోవిందా!’యని చిన్న పేరుతో పిలిచాము. ‘పర’ను వీళ్ళకెందుకివ్వాలి? అనుకోకుండా మా కోరికను సఖుడిగా అర్థం చేసుకొనైనా మమ్ము అనుగ్రహించుము అని ప్రార్థిసున్నారు గోపికలు.
తిరుప్పావై 29వ పాశురం ‘శిత్తం శిరుకాలే’

శిత్తం శిరుకాలే వందు ఉన్నై శేవిత్తు ఉన్
పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్‌త్తు ఉణ్ణుం కులత్తిల్ పిఱన్దు నీ
కుత్తేవల్ ఎంగళై క్కొళ్ళామల్ పోగాడు
ఎత్తెప్పఱై కొళ్శాన్ అన్ఱుకాం కోవిందా
ఎతె్తైక్కుం ఏళేళు పిఱవిక్కుం ఉందన్నోడు
ఉత్తోమే యావోమ్ ఉనక్కే నామ్ అళ్ శెయ్ వోం
మతె్తైనమ్ కామంగళ్ మాత్తు ఎలో రెమ్బావాయ్
భావం:ఈ పాశురంలో గోపికలు శ్రీకృష్ణుడికి తాము వచ్చి అతనికి శరణాగతం చేసిన ప్రయోజనాన్ని గూర్చి చెపుతున్నారు. ఇప్పుడేమో మేము వచ్చింది ఆ వాద్యం కోసం కాదు. మేము వచ్చింది నీ దగ్గరినుండి దాన్ని తీసుకొని తిరిగిపోవడానికి కాదు సుమా! ఎప్పుడూ శాశ్వతంగా నీకు సేవలు చేసుకుంటూ నీతోనే ఉండిపోవాలని మాత్రమే మా కోరిక. అంతేగాని ఏ విధమైన వస్తు రూపమైన కోరికలు లేవు సుమా! నీవు పుట్టిన కులంలోనే పుట్టి గోవులనే ఆచార్యులుగా సేవించుకొనే మా మనసు నీకు తెలుసు కదా! ఇదేనయ్యా! మా వ్రత లక్ష్యము అన్న గోపికల కర్మఫల త్యాగము ఇందులో చెప్పబడుతున్నది.
కృష్ణా! పశువులను మేపి, రక్షిస్తూ ఆ తరువాతనే మేము భుజించే గోప వంశమున జన్మించిన నీవు మా హృదయ కమలాలలో దాచుకున్న భక్తి భావాలతో నీకు చేసే సేవలు అంగీకరించక తప్పదు. మనిద్దరిది ఒకే వేదవంశం. క్షీరమే ఆహారం. నీకు ఇష్టమైన నవనీతాన్ని తయారుచేసే గోపికలము మేము. మా హృదయానే్న భక్తితో నవనీతంగా అర్పించి సేవ చేస్తామంటే, కాదనరాదు సుమా! మేము చేరవలసిన పరమ పదమిదే అని భావిస్తున్నాము. మాకున్న ఇతర కోరికలను లేకుండా చేయాలి నీవు. ఇదే మా కోరిక అని విన్నవించుకుంటున్నారు గోపికలు. గోపికల స్నానం భక్తి జల స్నానానికి సంకేతం.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్. పరవస్తు కమల