మంచి మాట

శ్రీగోదారంగనాథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై ముప్పదవ పాశురం ‘వంగక్కడల్
వంగక్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిళైయార్ శెన్ఱు ఇఱైంఞ
అంగు అప్పఱై కొండ వారై అణిపుదువై
పైమ్ కమల త్తం తెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శంగత్తమిళ్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగుఇప్పరిశురైప్పార్ ఈరి రండు మాల్ వరై త్తోళ్
శెమ్ కణ్ తిరుముగత్తు శెల్వ తితరుమాలాల్
ఎంగుం తిరువరుళ్ పెట్రు ఇన్బురువర్ ఎమ్బావాయ్

భావం: తిరుప్పావై వ్రత అధ్యయన, ఆచరణ ఫలాలు, తిరుప్పావై సందేశం ఈ నాటి పాశురంలో తెలుపబడుతున్నది. క్షీర సముద్రంగా సంసార సాగరాన్ని చేరి ఎందరో ఓడల వంటి మానవ శరీరాలను దరిచేర్చిన ఆ శ్రీమన్నారాయణుని గూర్చి ద్వాపర యుగంలోని గోపికలు వ్రతం చేసి పరను పొంది తరించిన విధంగా శ్రీ విల్లి పుత్తూరులో భట్టు నాధుల కుమార్తె గోదాదేవి ఆ వ్రతాన్ని పాటలుగా జీవులకు అనుసంధించి తరించమని అందించింది. వాటిని క్రమం తప్పక భక్తితో నియమంతో అనుసంధిస్తే, ఈ లోకంలోనే శ్రీమన్నారాయణుని రూపాన్ని దర్శించి అతని దివ్య కృపకు పాత్రులై పరమపదమును పొందగలరు. గోదాదేవి అనుభవించి చెప్పినా, ద్రావిడ భాషలో కూర్చబడిన మాలారూపమైన ముప్పది పాటలు తప్పక అనుసంధించినచో, వ్రియః పతి వలన, తల్లి గోదాదేవి వలన సాటిలేని కృపను పొంది శాశ్వతానందాన్ని పొందుతారని ఫలశృతిగా చెప్తూ అందరినీ ఆచరించవలసినదని తల్లిగా, గురువుగా గోదాదేవి బోధిస్తున్నది.
కోదై పిరన్దవూర్ గోవిన్దన్ వాళ్ మూర్
శోది మణి మాడం తోన్ఱుమూర్, నీది యాల్
నల్ల పత్తర్ వాళ్ మూర్, నాన్మ రైగళో దుమూర్
విల్లిపుత్తూర్ వేదక్కోనూర్
పాతకం జళ్ తీర్కుం పరమ నడికాట్టుమ్
వేదమనై త్తుక్కుం విత్తాగుం- గోదై తమిళ
ఐమైన్దు మైన్దుం అరియాద మానిడరై
వైయం శుమప్పదుం వమ్బు
తిరువాడిప్పూరత్తిల్ శెగ్తుదిత్తాళ్ వాళియే
తిరుప్పావై ముప్పదుం శెప్పినాళ్ వాళియే
పెరియాళ్వార్ పెట్రెడుత్త పెణ్బిళ్ళై వాళియే
పెరుంబూదూరు మామునిక్కు ప్పిన్నానాళ్ వాళి
బరునూట్రు నార్పత్తు మూన్ఱు రైత్తాళ్ వాళియే
ఉయర్ రఙ్గర్‌కే కణ్ణి యుగన్ద ళిత్తాళ్ వాళియే
మరువారుం తిరుమల్లి వళనాడు వాళియే
వణ్‌పుదువై నగర్ కోదై మలర్పదంగళ్ వాళియే
ఆండాళ్ తిరువడి గళే శరణం
ఆచార్య తిరువడి గళే శరణం

- డాక్టర్. పరవస్తు కమల