మంచి మాట

ఆధ్యాత్మిక శాస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా విషయము తెలియాలంటే, అప్పటివరకు మనిషి ఆ విషయంమీద చేసిన పరిశోధనలని తెలుసుకొని దానిని ఒక క్రమబద్ధీకరణలో అర్థం చేసుకోవాలి. అప్పుడే మనిషి కొత్త విషయాలను కనుగొనగలడు. రసాయనాల గురించి తెలియాలంటే రసాయన శాస్త్రం, భౌతిక వస్తువుల చలన నియమాలు మరియు వాటి శక్తుల మార్పులను తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రం, జంతువుల గురించి తెలయాలంటే జంతుశాస్త్రం, వృక్షాల గురించి తెలియాలంటే వృక్షశాస్త్రం, అన్ని దేశాల సమాజాల గురించి తెలియాలంటే సాంఘిక శాస్త్రం- ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అలాగే పరమాత్మ, ధర్మం, దేవతలు ఇలా వీటి గురించి తెలియాలంటే ఆధ్యాత్మిక శాస్త్రాలు చదవాలి.
ఒక శాస్త్రాన్ని చదివి దాని ఫలితాల ఆధారంగా ఇంకొక శాస్త్రాన్ని కించపరచడం అవివేకం. ఒక శాస్త్రం ఇంకొక శాస్త్రంలోని సత్యాన్ని దృఢపరచగలదు. అందుకే ఏ శాస్త్రాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఏ శాస్త్రాన్ని రచించిన శాస్తక్రారులయినా మానవ అభ్యున్నతికే రాస్తారు. దాని పరిధులు కూడా తెలియజేస్తారు. ఆ పరిధులు దాటితే ప్రకృతికి నష్టమని కూడా హెచ్చరిస్తారు. కాని కొంతమంది వ్యాపార దృక్పథంవల్ల ఆ పరిధులు దాటుతారు. అప్పుడు అభివృద్ధి సంగతి దేవుడెరుగు ఉన్న ప్రకృతే నాశనమవుతుంది.
అసలు ఆంగ్లంలో ‘సైన్స్’ అనే పదానే్న ఇక్కడ ‘శాస్త్రం’ అంటున్నాము. విజ్ఞాన ప్రయోగాలు, రాకెట్‌లు, కంప్యూటర్లు- ఇవి మాత్రమే సైన్స్ అనే పదానికి అర్థం కాదు. అందరూ ఇప్పుడు అలాగే అనుకోవడంవల్ల చిక్కు వచ్చిపడింది. శాస్తమ్రంటే సాధారణంగా నిర్వచనం ఏమిటంటే ‘వస్తువుకి సంబంధించిన లేక విషయానికి సంబంధించిన నియమాలు, వివిధ సమాచారం క్రమబద్దీకరించి, ఇంకా సమీకరణ రూపంలో అయినా నిర్మిస్తే అపుడు అది ఒక శాస్తమ్రవుతుంది’. ఆంగ్ల నిఘంటువులో కూడా ఇలానే వుంటుంది.
శాస్త్రంలోని కొత్త కొత్త విషయాలను తెలుసుకునేకొద్దీ శాస్త్రంలోని కచ్చితత్వం అర్థమవుతుంది. ఆ శాస్త్రం మీద ఒక అవగాహన వస్తుంది. ఈ శాస్త్రంలో ఎందుకు ఇలా చెబుతున్నారని నిజాయితీగా అధ్యయనం చేసి పరిశీలించాలి. అలా కాకుండా అవతలి శాస్త్రాల్ని కించపరచడానికి దానిలోని సత్యాన్ని లోటుపాట్లు ఉన్నట్లు ఎత్తిచూపితే ఆ వ్యక్తి అనుసరిస్తున్న అతని శాస్త్రం యొక్క మూలతత్వం అతనికి తెలియదనే అజ్ఞానాన్ని సూచిస్తుంది. అందుకే ఏ శాస్త్రాన్నయినా విమర్శించేటప్పుడు మన శాస్త్రంలోని సత్యాలు మనకి తెలిసి ఉండాలి. అప్పుడే ఇతర శాస్త్రాలలోని విషయాన్ని అధ్యయనం చేసే సమయంలో మనకు సత్యం గోచరిస్తుంది.
ఏ శాస్త్ర పరాకాష్ట అయినా ఆ పరమాత్మనే లక్ష్యం కలిగి ఉంటుంది, కలిగి ఉండాలి కూడా. కాని ఏది త్వరగా చేర్చగలదు అనే దానిమీదే అది ఆధారపడి ఉంటుంది. ఒక శాస్త్రంలో ఏ నియమాల్ని పాటిస్తే వ్యక్తుల యొక్క గుణాన్ని బట్టి అతడు ఉన్నతుడవుతాడో తెలుసుకోవాలి. కొంతమంది ఉన్నతమయిన సాధనలు చేయలేరు. అప్పుడు ఆ వ్యక్తులకు శాస్త్రం ఉన్నత సాధన వైపునకు తీసుకువెళ్ళే ఇంకొక సాధనను నిర్దేశిస్తుంది. శాస్త్రం యొక్క సాధన యొక్క అసలు తత్వం తెలియాలంటే ఆ శాస్త్రం యొక్క సత్యాన్ని తెలుసుకొన్న వ్యక్తిని అనుసరించాలి. అతనే్న శాస్త్రం ‘గురువు’ అని తెలిపింది. అతని మార్గనిర్దేశంలో సత్యాన్ని తెలుసుకోవచ్చు.
అన్ని శాస్త్రాలలో ఇదే పద్ధతి కనిపిస్తుంది. భౌతిక నియమాలు ఒక పద్ధతిగా ఎలా ఉంటాయో అలౌకిక నియమాలు కూడా అలాగే ఉంటాయి. ఇవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. అందుకే సత్యం తెలుసుకోవాలనే మనిషి భౌతికత వైపు కాకుండా తన గురించి తనలోని పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అందుకే ఆ మహర్షులు ప్రకృతిలోని పరాకాష్ట అయిన ఆ నియమ నిర్మాతని తెలుసుకొని ప్రజలు ఆ దారిలో ఎలా నడవాలో ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఆ విషయాలను పొందుపరిచారు. అవి చదివి ఆచరించి మన లక్ష్యాన్ని చేరుకొందాం.

- ఎ.రాజేష్