మంచి మాట

శ్రీపంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శివానుజ’ అనడం చేత విద్యనభ్యసించినవారు తమ విద్యను లోకకళ్యాణార్థం ఉపయోగించాలని భావం.
‘సర్వశుక్లా సరస్వతీ’ కనుక సరస్వతిదేవి స్వచ్ఛమైన శే్వతవర్ణం. ఆమె వస్త్రం, ఆభరణాలు, వాహనం, అక్షమాల అన్నీ శే్వతవర్ణమే. శే్వత పద్మవాసినియైన తల్లి కనుక శారదగా భాసిస్తోంది. శరదృతువులో ఆవరించింది కావున ‘శారద’ అయింది. మంత్ర శాస్త్రంలో శారద రూపాలు అనేకం వున్నాయి. ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, వాక్సంపద, మేధ శక్తుల స్వరూపమే శారదాదేవి. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరాన భాసర క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతీదేవిని వేదవ్యాసుడు ఆరాధించి, తపం ఆచరించి అమ్మవారి సాక్షాత్కారం పొందినాడని, కనుక శ్రీపంచమి రోజున ఈ క్షేత్రంలో బాల బాలికలకు అక్షరాభ్యాసం, శ్రీకారం చేయిస్తే వాక్సుద్ధి కలిగి విజ్ఞాన రాశులవుతారని, వాగ్దేవి కరుణతో సద్బుద్ధిని పొందుతారనే విశ్వాసంతో శ్రీపంచమి తిథిని మహావైభవంగా జరుపుతారు. మెదక్ జిల్లా వర్గల్‌లో విద్యాసరస్వతిగా, కర్ణాటకలోని శృంగేరీలో శారదాదేవిగా విశేష పూజలందుకొంటున్న శ్రీపంచమిని ఉత్తర భారత, దక్షిణ భారత దేశంలోనూ వైభవంగా జరుపుకునే ఆచారం వుంది. ఇది వసంతంలో వస్తుంది కనుక వసంత పంచమి అని కూడా అంటారు. ఋతువులలో వసంత ఋతువును నేను అని శ్రీకృష్ణ్భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అక్షర పరబ్రహ్మయోగం కూడా వున్నది. అందుకే ఈ వసంత పంచమినాడు శ్రీమహావిష్ణువును ఆరాధించే ఆనవాయితీ కూడా వస్తోంది.
సకల విద్యాస్వరూపిణియైన సరస్వతీదేవి ఆవిర్భవించిన మహిమాన్వితమైన తిథి పంచమి. జ్ఞానం, వాక్కు, విద్య, బుద్ధి శక్తుల్ని ఇచ్చే శ్రీపంచమి మాఘమాసంలో జరుపుకుంటారు. జ్ఞాన ప్రదాయినిగా, వాక్సంపద, ధారణ, ప్రతిభ, సరస్వతీదేవి ఆరాధనవల్ల సిద్ధిస్తాయి. మంత్ర స్వరూపిణియైన సరస్వతీదేవిని ఉపాసిస్తే జ్ఞానం కలుగుతుంది. ‘సరస్వతీ నమస్త్భ్యుం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా’ అని విద్యలకు రాణియైన పుస్తక పాణియైన అక్షరవాణియైన సరస్వతీదేవిని ప్రార్థించడం ఆచారం.మాఘమాస శుక్లపక్ష శ్రీపంచమి సరస్వతీదేవి జన్మదినం. శ్రీపంచమినాడు బాల బాలికలకు విధ్యాభ్యాసం చేయిస్తే అపారమైన జ్ఞానం లభిస్తుందని, విద్యాభివృద్ధి చెంది ఉత్తమ శ్రేణులై విజయం సాధిస్తారనే విశ్వాసంతో శ్రీపంచమి రోజు దేశ వ్యాప్తంగా అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతీదేవి కరుణ ఉంటే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుందని శ్రీపంచమినాడు వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది.
విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానం, జ్ఞానము చేత ధనం, ధనం చేత అధికారం సంప్రాప్తిస్తాయి. ఎవ్వరిచే దొంగిలించబడనిది, పదిమందికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉన్నది. ఈ సమాజంలో విద్య కలిగినవాడు ధనవంతునికన్నా, సంఘంలో గొప్ప మన్ననలు పొందుతున్నాడు. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదే కానీ, అంతకన్నా విద్యాదానం మనిషిని మహోన్నతుడిగా తీర్చుదిద్దుతుంది.
‘దేవీం వాచమజనయంతే దేవాః’ అని వేదం ఘోషిస్తోంది. అంటే సృష్టిలో మొట్టమొదట వ్యక్తమయింది వాక్కే. కనుక వాగ్దేవతే ఆదిదేవి. వాగ్దేవి పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాల్గు రకాలుగా, సకల జీవులకు వాక్కులుంటాయి. అయితే ‘పరా, పశ్యంతీ, మధ్యమా’ అనే మూడు విధాల యోగులు, జ్ఞానులు మాత్రమే గుర్తించగలుగుతారు. ఆలా నాలుగు విధాలైన వాక్కులకు అధిదేవత కనుక సరస్వతీ వాగ్దేవి. శుద్ధ సత్త్వమైన పరమాత్మ రూపానికి సంకేతం. సత్వగుణముతో సరస్వతిగా, రజోగుణముతో లక్ష్మిగా, తమోగుణంతో గౌరిదేవిగా రూపొందింది. సరస్వతీదేవి పరబ్రహ్మమైన పరమాత్మ నుంచి ఉద్భవించిన వాణికి, విద్య, జ్ఞాన బుద్ధులకు ప్రతీక.సరస్వతీదేవిని మాతృగణాలలో, దేవతలలో శ్రేష్ఠమైనదిగా మన భారతీయ సంస్కృతి గౌరవిస్తుంది. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి ఆరాధన ఉత్కృష్టమైన సాహితీ సంపదను అందించేది. అంతేకాదు మానసిక ప్రకృతిని సంస్కరించేది. కనుక తమ మేధాశక్తిని వృద్ధి చేసుకొనేందుకు విద్యార్థులు సరస్వతీమాతను ఆరాధించి ఆమె కటాక్షం పొందండి. ‘ఓం సరస్వత్యై విద్మహే! బ్రహ్మపత్నైశ్చ ధీమహి! తన్నో బుద్ధిదేవి ప్రచోదయాత్’’

- రసస్రవంతి కావ్యసుధ