మంచి మాట

మానవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రామా! నీవు సర్వప్రాణికోటి ఉత్పత్తికి కారకుడవు. జ్ఞానులలో అగ్రేసరునివి. సర్వశ్రేష్ఠునివైన నీవు సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంటే ఉపేక్షించావు ఏమి? శ్రీరామా! నీవు బ్రహ్మాది దేవతలకు అధికునివైన శ్రీమన్నారాయణునివి. నీవా విషయం ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నావు. నీవు ఋతుధాముడను ప్రజాపతివి, ఆది సృష్టికర్తవు, స్వయంభువుడవు. రుద్రులలో ఎనిమిదవ వానిని మహాదేవునవు. అశ్వినీ దేవతలు నీ కర్ణాలు సూర్యచంద్రాదులే నీ నేత్రాలు కదా. నీవు ఉత్పత్తి వినాశరహితునవు. సర్వేశ్వరునివైన నీవు ఒక సామాన్యునివలె ప్రవర్తిస్తున్నావు ’ అని వారందరూ ముక్తకంఠంతో రామునితో రావణుని సంహరించినపుడు సర్వ దేవతలు వచ్చి చెప్పారట. కాని రాముడు మాత్రం నేను మాత్రం దశరథపుత్రుణ్ణి మాత్రమే. నేను మా తండ్రి చెప్పినట్టు మాత్రమే వింటాను. మానవుడిగా నేను ఏం చేయగలనో దానే్న చేస్తాను అని ఘంటాపధంగా చెప్పాడట. చూశారా రాముడే అలా అంటే మనం మనుషులుగానే పుట్టాం కదా. మరి మనుష్యుల్లాగా మసులుకోవాలి కదా. మానవత్వంతో చరించాలి కదా. ఒక్కసారి మనలను మనం పరిశీలించుకుందాం... మానవత్వాన్ని వెలికితీద్దాం.