మంచి మాట

ఆశ ఖరీదు అణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(మహానగరంలో ఒక గల్లీలో జనసమ్మర్దం ఎక్కువగా వున్నట్లు సూచించే థ్వనులు. మోటార్లు, గుర్రంబళ్ళు, సైకిళ్ళు, రకరకాల వాహనాల ధ్వనులు, ఇంకొంచెం దూరంలో- గాలిలో తేలివస్తున్నట్లు చర్చి గంటలూ,
దేవాలయం గంటలూ వినిపిస్తాయి.
ఇవన్నీ కలిసి ఏదో అవ్యక్తమైన బెంగా, భయమూ
సూచిస్తాయి)
ఒక యువకుడి కంఠం: హాయిగా ఉంది రుూ సాయంత్రం. రాత్రి పడినకొద్దీ ఇంకా హాయిగా వుంటుంది. దీపాలు వెలుగుతాయి. పాపాయిలు నిద్రపోతారు; వాళ్ళ తల్లులు కిటికీలదగ్గర నిలిచి వాళ్ల తండ్రులకోసం ఎదురుచూస్తారు. అంతా హాయిగా ఉంటుంది. ఈ మంచి మహానగరంలో ఈ వీధి మరీ మంచిది. నాకెలా తెలుసునంటారా, నిన్నటినించీ రుూ వీధిలోనేగా ఉంటూంట! ఇదే మా మేడ! చివారి అంతస్తుమీది చివారి గది నాదే! మొత్తం మేడలో యిరవై రెండు కుటుంబాలు కాపురం ఉన్నారు. నన్ను మినహాయిస్తే అదిగో ఆ మెట్ల దగ్గిర కాపురం ఉన్నారే- ఆ తాగారు ఉద్యోగం చేసి పింఛనీ పుచ్చుకున్నారు. నిన్న సాయంత్రమే ఆయనతో కొంచెం బాతాఖానీ వేశాను. ఆయన అన్నారూ-
తాత: ఏమంటావు నాయనా- నే చేసింది ఏం ఉద్యోగమంటావా? ఏదయితేనేం- సర్కారు నౌఖరీ చేశాను. ముప్ఫయిమూడు సంవత్సరాలు చేశాను. తొమ్మండుగురు పిల్లల్ని కన్నాను. ఇప్పుడు పింఛనీ యిచ్చేశారు.
యు: మంచిదే గదా తాతగారూ! హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు!
తా: ఆ విశ్రాంతే దొరకడంలేదు అబ్బాయ్! ఇంకా నలుగురు కూతుళ్లకి పెళ్లి అవాలి. పెళ్లయిన ఇద్దరు కొడుకులకు ఉద్యోగాల్లేవు. మిగిలినవాళ్ల చదువులకి డబ్బు లేదు. ఇంకెక్కడి విశ్రాంతి నాయనా? అంచేత ఏం తోచక అప్పుడప్పుడు పాటలు పాడుకుంటాను.. పాటలంటే నీకిష్టమేనా అబ్బాయ్?
యు: అందమయిన ఆడవాళ్లు పాడితే చాలా యిష్టంగా వింటానండీ!
తా: బుద్ధిమంతుడివి నాయనా! మీ యింటావిడ అందగత్తేనా?
యువ: తప్పకుండా అందగత్తే అయుండాలి మరి- ఎంచేతంటే నాకింకా పెళ్లి కాలేదు.. మంచిది తాతగారూ, మళ్లీ కలుసుకుందాం. అదిగో, ఎక్కడో రేడియోలోంచి మంచి సంగీతం వినబడుతూంది, వినండి!
తా: మంచిది నాయనా! వెళ్లిరా!
(క్షణమాత్రం శ్రావ్యంగా జంత్రసమ్మేళనం వినబడుతుంది)
యువకుడు: విన్నారా, అదీ సంగతి, తాతగారితో అట్టే సేపు మాటాడలేంగాని, ఆయన్ని తలుచుకుంటే సంతోషంగా ఉంటుంది. ఆయనా భార్యా, తొమ్మండుగురు సంతానం- అందరూ హాయిగా రెండు గదుల్లో కాలక్షేపం చెయ్యడం, ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా సావిత్రీ, మీనాక్షి, సుబ్బయ్యా, గోపాలం, కృష్ణవేణీ, పెద్దన్నయ్యా- యిలా పిలుచుకోవడం అంతా బాగులేదూ?
కృష్ణవేణి అంటే జ్పాకం వస్తోంది- మా మేడలోనే పెరటిభాగం గదిలో ఓ అమ్మాయి కాపరం ఉంది. తల్లీ అన్నయ్లాక తమ్ముడో మరి! ఉన్నట్టున్నారు. ఎక్కడో ఉద్యోగం చేస్తోంది. పేరు కృష్ణవేణి కాదుగాని- అయితే బాగుండును! అంత చక్కటి తలకట్టు- మోకాళ్ళదాకా వేలాడే జగ! అదిగో- ఆ అమ్మాయే కాబోలు- వస్తోంది!
‘హలో! హలో హలో! అనుకుంటూ అమ్మాయి దూరం నుంచి దగ్గిరగా వస్తుంది.
అమ్మాయి: హలో! మీరేనా మేడ గదిలోకి కొత్తగా వచ్చింది?
యు: అవునండి, నిన్న సాయంత్రమే దిగాను.
అ: మరేట. మా ఇందిర చెప్పింది. రాత్రల్లా గది గోడలకి మేకులు కొడుతూనే వున్నారు. ఆ చప్పుడుతో రాత్రల్లా తనకి నిద్రపట్టలేదు. కాని కొంచెం జాగ్రత్తగా ఉండండి. గోడలకి మ ఏకులు కొడితే ఇంటాయన ఊరుకోడు.
యు: ఏం?
అ: (నవ్వుతూ) ఏవేఁవిటి? బంగారు గోడలు చెడిపోవూ? మీరు గోడకి కొట్టే ప్రతి మేకూ తన వీపుమీద కొట్టినట్లే అతను బాధపడతాడు. అబ్బా! బాగా చీకటయిపోయిందే- మబ్బులు కూడా ముంచుకొస్తున్నాయి. మార్గశిరమాసపు చలీ రుూదరగాలీ- బాగుంది గదూ! ఇలాంటప్పుడు నడిచి వెళ్ళి హాయిగా రెండో ఆట సినిమా చూసి, తిరిగి ఇంటికినడిచి రావాలనిపిస్తుంది.
యు: సినిమాలో మనం విన్న ఆఖరిపాట లోపల లోపల పాడుకుంటూ- ఏం?
అ: సరిగ్గా నేననుకుంటున్నదే చెప్పారు మీకు పాటలంటే ఇష్టమేనా?
యు: పాడేవాళ్లుబాగుంటే పాటా బాగుంటుంది.
అ: (నవ్వుతూ) అయితే మా ఇందిర పాట ఎప్పుడేనా వినిపిస్తానుండండి.. సరే! వస్తానండీ! అమ్మయ్యో! ఏవిఁటా బాజాలు?
(చావు బాజాలు దూరం నుండి దగ్గిరగా వస్తాయి)
యు: ఎవరో మహారాజు కైలాసానకి వెళ్లిపోతున్నాడు..
అ: నేనింట్లోకి పోతాను బాబూ! అలాంటివంటే నాకు భయం!
(బాజాలు తీవ్రంగా వినిపిస్తాయి)
- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)