మిర్చిమసాలా

ఇక మరణమే ఉండదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక నుంచి మరణమే ఉండదట. అమ్మో! ఎంత అదృష్టమో...అని సంతోషిస్తున్నారా?
పుట్టిన వాడు గిట్టక తప్పదు... గిట్టిన వాడు పుట్టక తప్పదని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీత సంగతేమిటీ? అనుకుంటున్నారా?, కానీ శాస్తవ్రేత్తలు మాత్రం పుట్టిన వాడు గిట్టకుండా జీవించేలా చేయవచ్చని అంటున్నారు. మరణమనేది లేకుండా చేయడానికి పరిశోధనలు మొదలైనట్లు శాస్తవ్రేత్త లాన్ పియర్సన్ పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి, ల్యాబ్‌లో మనిషి అవయవాలు, కణాలను తయారు చేస్తున్నట్లే 2050 నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చేస్తుందన్న నమ్మకాన్ని పియర్సన్ వ్యక్తం చేశారు. పియర్సన్ చెప్పింది బాగానే ఉంది కానీ అప్పుడు ఈ భూమి సరిపోతుందా!?!
- వి.ఈశ్వర్ రెడ్డి
ఆ ఏడింటిలో?
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏడు సీట్లు కూడా దక్కవనీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఈ మధ్య పదే పదే సవాల్ విసురు తున్నారు. రాష్ట్రంలో 119 సీట్లలో ఏడు సీట్ల లాజిక్క్ ఏమిటో అర్థం కావటం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుచుకుంటుందని టిపిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, 70 కాదు కదా 7 సీట్లు కూడా గెలువదని జోస్యం చెప్పారు. బహుశా ఇదే విషయాన్ని నాయిని ప్రస్తావిస్తున్నారేమో. ఇలా ఉండగా గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభంజనంలో సైతం టిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి టిడిపి అభ్యర్థిగా తలసాని గెలుపొంది తన సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ ఏడు సీట్లు కూడా గెలువదని తలసాని అన్నారంటే అర్థం ఉంటుంది కానీ టిఆర్‌ఎస్ ప్రభంజనంలో సైతం ఓడిపోయిన నాయిని నరసింహారెడ్డి మాత్రం అలా మాట్లాడటం హాస్యాస్పదంగానే ఉంటుంది. ఈయన చెప్పిన విధంగా కాంగ్రెస్ గెలుచుకునే ఏడు సీట్లలో నాయిని నరసింహారెడ్డి సీటు ఉంటుందా? లేదా? అనే విషయంపై కూడా స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది.
- వెల్జాల చంద్రశేఖర్
సందట్లో సడేమియా!
ఒక పని జరుగుతూ ఉంటే ఎవరో ఒకరు మధ్యలో వచ్చి హడావుడి చేస్తూ ఉంటే ‘సందట్లో సడేమియా’ అనే నానుడి వచ్చింది. సరిగ్గా టూరిజం శాఖ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. హైదరాబాద్‌లో రాష్టస్థ్రాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు తరచూ జరుగుతున్నాయి. టూరిజం శాఖ పర్యాటక రంగానికి ప్రచారం కల్పించేందుకు ఇదే అదనుగా భావిస్తోంది. పర్యాటకానికి సంబంధించిన డాక్యుమెంట్లను, ఫోటోలను ప్రదర్శిస్తూ ఈ శాఖ ప్రచారం చేసేసుకుంటోంది. ప్రభుత్వ సంస్థ కనుక, టూరిజానికి ప్రచారం కూడా రావాలి కనుక నిర్వాహకులు టూరిజం శాఖకు సహకరిస్తున్నారు. హైదరాబాద్ వస్తున్న దేశ, విదేశ అతిథులు టూరిజం శాఖ ఆతిథ్యాన్ని (డబ్బు చెల్లించే) స్వీకరించి, వివిధ ప్రదేశాలకు వెళుతున్నారు. ఫ్రీప్రచారం అన్నమాట!
- పి.వి.రమణారావు
ఓల్డ్ ఈజ్ గోల్డ్
నిజంగా పాత చిత్రాలు, కరిగిపోయిన కాలంలోని మిత్రులు, ఆనాటి ఘటనలు, ఎప్పుడూ బంగారమే. వాటి విలువ ఎన్నటికీ తరగదు. కాలం విసిరిన పంజాకు దెబ్బతిన్న వామపక్ష పార్టీలంటే మెల్లిమెల్లిగా జనంలో మోజు పుడుతోంది. రెండేళ్ల క్రితం వరకు ఎర్రజెండా అన్నా, కారల్ మార్క్స్ అన్నా, కార్మిక సంఘాలు, వామపక్షపార్టీలన్నా పట్టించుకోని ఐటి కంపెనీ ఉద్యోగులు మెల్లిమెల్లిగా వాస్తవంలోకి వస్తున్నారు. సాగినంత కాలం పట్టిందల్లా బంగారమే. ఉద్యోగం ఊడితే పలుకరించే వాళ్లు లేరు. ఇప్పుడు కార్మిక హక్కుల కోసం ఐటి ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. వామపక్ష పార్టీలకు ఇప్పటికిప్పుడు కాకపోయినా, మరో దశాబ్ధం తర్వాత ఒక మాదిరి మంచి రోజులు వచ్చే అవకాశం కనపడుతోంది. ఏమైనా కడుపు కాలితే కాని ఎర్ర జెండా ఎవరికీ గుర్తుకు రాదు.
- కెవిఎస్

బీజెపీలో ‘ఈరో’ క్రమశిక్షణ’ హెచ్చరిక
దేశంలోని అన్ని రాజకీయ పక్షాల్లో కంటే ఒక్క బీజెపీలోనే క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందనేది ప్రచారం. అయితే ఇటీవల కాలంలో ఈ క్రమశిక్షణ ఎక్కువ వేడెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇతర పక్షాల మాదిరిగా రోడ్డు ఎక్కి రచ్చ చేసే అవకాశం ఈ పార్టీలో ఎక్కువ అవకాశం లేదు. పోనీ అంతర్గత సమావేశాల్లో అయినా మాట్లాడవచ్చా అంటే...దానికీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. విజయవాడలో ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కెవి లక్ష్మీపతిరాజా ఏదో ప్రశ్నించారని 24 గంటలు గడవకముందే వేటు పడింది. అంటే ప్రభుత్వం, ప్రైవేటు టీవీ ఛానెళ్ల సీఇఓలకు దాదాపు హెచ్చరిక లేఖలు వెళ్లాయి. రాజా తమ అధికార ప్రతినిధి కాదు, ఇక చర్చా గోష్టికి కూడా పిలువరాదనేది అందులో సారాంశం. ఈ ప్రతులు ప్రింట్ మీడియాకు కూడా వెళ్లాయి.
కొసమెరుపు: అయ్యో తాను ఏనాడైనా అధికార ప్రతినిధి అని చెప్పలేదే....దీనిపై ఏకంగా ఢీల్లీ అధిష్టానంతోనే తేల్చుకుంటా ....అంటున్నారు రాజా.
- నిమ్మరాజు చలపతిరావు