మంచి మాట

హనుమంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైశాఖమాసము, బహుళపక్షములో దశమితిథిని హనుమజ్జయంతిగా భావిస్తారు. పూర్వాభాద్ర నక్షత్రము, కర్కాటక లగ్నము, మధ్యాహ్న సమయము కౌండిన్య గోత్రములో జన్మించాడు. అయితే ఉగాది పండుగ తరువాత చైత్రశుద్ధ పూర్ణిమనాడు హనుమ లంకలో సీతాదేవికి రామసందేశము వినిపించాడనే విశ్వాసము వ్యాప్తిలో ఉంది. సీతను కనుకొనలేక ప్రాణత్యాగమే శరణ్యమనుకున్నాడు హనుమ. ఆ రోజు అటువంటి వేళ సీతను చూసిన ఆనందములో తాను పునర్జీవితుడైనానని హనుమ భావించాడు. సరైన మాసాదులు చెప్పలేము కాని జ్యోతిశ్శాస్త్ర ప్రకారము, మూల నక్షత్రము, పాంచరాత్రశాస్త్ర ప్రకారము అనూరాధ నక్షత్రము హనుమ జన్మ తిథి నాడుండాలని 1955 సం. నాటి తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వ ఆస్థాన పండితులు కీ.శే. వేదాంతం జగన్నాధాచార్యులవారి అభిప్రాయము. రెండు హనుమజ్జయంతులు జరుగుతున్నాయి.
హనుమద్విజయ జయంతిగ లంకలో సీతమ్మవారు రామ సందేశమును విని శోక విముక్తురాలైంది. బహుమానముగా తమలపాకులు హారముగా చేసి హనుమను మెడకు హారముగా వేసుకొమ్మన్నదని కథనము. హనుమజ్జయంతి నిర్ణయము నాడే కాదు ఏ సమయములోనైనా హనుమకు సీతారాముల సమ్మతి సన్మానముగా తమలపాకులతో పూజ విషయమున ప్రచారములో ఉన్న కథ ఇది.
హనుమంతుని జన్మగాథలు ఆసక్తిదాయకముగా ఉంటాయి. హనుమంతుని తల్లి అంజని, తండ్రి కేసరి. హనుమంతుడికి ఆంజనేయుడు, మారుతి అని పేర్లు ఉన్నాయి. అంజని పుత్రుడు ఆంజనేయుడు. మరుత్ (వాయు) దేవుని వరమువలన పుట్టి, మారుతిగా, వాయునందనునిగా పేరుపొందాడు. తండ్రి కేసరి గనుక కేసరి నందునుడిగా కూడా పిలవబడతాడు.
శివపురాణము ప్రకారము హనుమ రుద్రావతారము. మోహినీ అవతారము చూసి కామ వికారములకు లోవనైన శంభుని కామ వికార ఫలితాంశ వీర్యమును, సప్తర్షులు అంజన గర్భంలో ప్రవేశపెట్టారని శత రుద్ర సంహితలో శివపురాణము పేర్కొంది. అయితే శివుడు, వాయువు విడివిడిగా కేసరినావహించారట! అపుడు కేసరి భార్య అంజనతో కలిసిన సమయములో శివ, వాయు అంశ వరముగా కేసరి తనూనందనుడై హనుమ జన్మించాడన్నది భవిష్యపురాణ కథనము.
అసలు అంజన పుంజకస్థలి అనే దేవకన్యగా బృహస్పతికి సేవకురాలు. ఆయనపై కామ వికారాలు ప్రదర్శించింది. ఆ కారణముగా కోపించిన బృహస్పతి శాపానికి గురయింది. వానర రూపము పొందింది. వానర రాజు కేసరికి భార్య అయింది. పుత్రోదయము అయిన తరువాత అయే శాప విముక్తికి తపస్సు చేసింది. తపోఫల శివాంశను వాయుదేవుని కారణంగా గర్భంలో ధరించి రామాయణ పాత్రల కారణజన్మలలో ఒకడైన ఆంజనేయునికి జన్మనిచ్చి శాపవిముక్తి పొందింది. రాముడు, రామానుజుల జననము, హనుమ సేవకత్వ సార్థక జన్మము పుత్రకామేష్ఠి ఫల దివ్య పాయస సంభూతము అన్నాడు ఆనందరామాయణకర్త.
వాల్మీకి కథ ప్రకారము హనుమంతుడు రామునికి, సుగ్రీవునికి స్నేహము కలిపాడు. సీతానే్వషణలో లంకకు సమద్రము లంఘించిన బలశాలి. రామ ముద్రికనందించి సీతకు ధైర్యము చెప్పాడు. రాక్షసులకు సింహస్వప్నమయాడు. రావణ వధకు ముందే లంకలో బీభత్సము సృష్టించి భయభ్రాంతులను చేశాడు. కావాలని పట్టుబడి రావణునకు రామదండు జన్మకారణ సత్తా చాటాడు. లంకాదహనము చేసి గుబులురేపాడు. యుద్ధ సమయాన మూర్ఛిల్లిన లక్ష్మణుని సంజీవనిని తెచ్చి తేరుకునేట్లు చేశాడు. విడిపోయిన సీతారాముల పునఃసమాగమ వాల్మీకాది అన్ని రామాయణ గాథలలోని హనుమంతుడు ప్రధాన పాత్రగా నిలిచాడు.
అద్భుత రామాయణ ప్రకారము హనుమంతుడు గొప్ప సంగీత విద్వాంసుడు. నారదుని పోటీలో ఎదుర్కొని ఓడించాడు.

- జొన్నలగడ్డ మార్కండేయులు