మంచి మాట

విచక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చేస్తున్న పనేమిటి? దీనివల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఎవరైనా ఆనందిస్తున్నారా..? లేక బాధపడుతున్నారా? అంటూ ఆలోచించడమే విచక్షణ తన్ను తాను పరిశీలించుకోవడం. ఒక్కసారి అలా ఆత్మానే్వషణ సాగి నిజంగా తనవల్ల లోకానికంతటికీ మంచే జరగాలని కోరుకుంటూ ఒకరిమీద అనురాగాన్ని చూపడం కానీ, మరొకరివల్ల భయానికి లోనుకావడం కానీ, ఇంకొకరిమీద ద్వేషాన్ని పెంచుకోవడంగానీ ఇవేమీ చేయక నిజాయితీగా జీవితాన్ని గడపడమే.
అగ్గిపుల్లకి తల వుంది. కానీ అందులో బుద్ధిలేదు. అందుకే, కాస్తంత రాజుకుంటే చాలు రగిలిపోతుంది. మనిషికి తల ఉంది. అందులో బుద్ధీ ఉంది. అందుకే విచక్షణాజ్ఞానంతో, అనుభవపాఠాలతో అనుక్షణం బుద్ధికి పదును పెట్టాలి.అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోవాలి.తనక్కొకరికే లాభం వచ్చే పని చేసినా ఫర్వాలేదు కాని ఇతరుల్లో ఏ ఒక్కరికీ నష్టం కలిగించే పనియైనా సరే దాన్ని చేయకపోవడమే మేలు.
ధనం నోరులేకుండానే శాసిస్తుంది. కళ్లు లేకుండా శాసిస్తుంది. చేతులు లేకుండానే ఆడిస్తుంది. కాళ్లు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది. ఉన్న బంధాలను తుడిచేస్తుంది. మనసు లేనిది, మనిషి చేసినది, మనసును మనిషినీ ఆడిస్తున్నదన్న నిజం గ్రహించుటే అచ్చమైన విచక్షణాజ్ఞానం.
ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకి అదంటే ఇష్టం లేకపోవటంవలనే అది ‘కష్టం’గా మారుతుందంతే. ఏది సాధించాలనుకుంటున్నామో దాని గూర్చి తపించాలి. మన ఊపిరి, మనలో ప్రతి నరం, మనమేసే ప్రతి అడుగు, మన ఆలోచన, కృషి మొత్తం సాధించుకోవాలనుకున్నదానిని సాకారం చేసుకోవడానికి మనలను మనమే పరిశీలించుకోవాలి. పరీక్షించుకోవాలి. పరి ప్రశ్నలు వేసుకొని సమాధానాన్ని రాబట్టుకోవాలి. ఇదంతా కూడా స్వార్థం లేకుండా నేనే కదా అని అనుకోకుండా ఎవరికి వారు ఏ పని ఎంత చేయగలం ఎట్లా చేయగలం దానివలన వచ్చే లాభం ఎంత నష్టం ఎంత అని క్షుణంగా పరీక్షించుకోవాలి. మనసును అదుపులో పెట్టాలి. అదే సమయంలో మనసును ప్రసన్నంగాను మార్చుకోవాలి.
ఎవరైనా చేస్తున్న పనిని సగంలో ఆపివేయకుండా వుండాలంటే పట్టుదల వుండాలి. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పడేయకుండా చదువుతూ పోవాలన్నా పట్టుదల అవసరం. ఎంచుకున్న ఆశయ సాధనలో చికాకులు ఎదురైతే ఆశయంనుంచి వైదొలగకుండా ముందుకు పోవాలన్నా పట్టుదల తప్పనిసరి. ఇది లోపించడమే చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్యను అందరికీ ఎదురుకావచ్చు. అయతే విజయం సాధించేవాళ్లు ముందుగానే ఈ సమస్యగూర్చి ఆలోచించి తగిన పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఒకవేళ అనుకోని అవాంతరం వచ్చినా దాన్నుంచి ఎలా దూరం కావాలో ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించితే విజయానికి దగ్గర కావడానికి సమయం మించదు.
వౌనం, నవ్వు ఈ రెండూ శక్తివంతమైన ఆయుధాలు. నవ్వు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. వౌనం సమస్యల్ని నిరోధిస్తుంది. ఇవన్నీ విచక్షణాజ్ఞానంలో భాగాలే అవుతుంది. నొప్పితో పోరాడితేనే స్ర్తి అమ్మ అవుతున్నట్లు, చీకటితో పోరాడితేనే గొంగలిపురుగు సీతాకాకోచిలుక అవుతున్నట్లు, మట్టితో పోరాడితేనే విత్తు మొలకెత్తగలుగుతున్నట్లు, జీవితంతో పోరాడగలిగితేనే సుఖసంతోషాల్ని, కష్టనష్టాల్ని ఎదుర్కొనే మంచి మనిషిలా మార్పు చెందటానికి విచక్షణాజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. బుద్ధి ధర్మపట్ల ఆసక్తి తో పాటు విచక్షణ ఉంటే విజయావకాశాలు మనకుచేరువలో ఉన్నట్టే.
***
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-యస్.్భల్లం