మంచి మాట

స్థిత ప్రజ్ఞత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ఎత్తుపల్లాలు అనేకం ఉంటాయి.కష్టాలు వచ్చినపుడు కుంగిపోవడం సుఖాలు వచ్చినపుడు పొంగిపోవడం సాధారణుల లక్షణం. కాని ఉత్తములు, జ్ఞానులు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. వాళ్లకు సుఖదుఃఖాలు సమానం. వాటివలన వారిలో ఏమార్పు రాదు. రెండింటి యందు స్థిత ప్రజ్ఞత్వం ప్రదర్శిస్తారు. అట్లా స్థిత ప్రజ్ఞను చూపాలన్నదే పెద్దల మాట. కాని దీన్ని ఆచరించడానికి కొంత సాధన అవసరం.
అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి, జీవన వ్యవస్థ లోతుల్ని శోధించడానికి ప్రతి ఒక్కరికీ అవకాశముంటుంది. దీని జయాపజయాల ఫలితాలపైనే మానవ మనుగడ ఆధారపడి ఉంది. కాని అనుకొన్నది జరగలేదని ఎక్కువగా నిరాశ చెందకూడదు. విఫలం పొందినా, సాధించాల్సిన దానిలో ఏ లోపం జరిగిందో తెలుసుకొని మళ్లీ ప్రయత్నించడమే విజ్ఞుల లక్షణం అపుడే మనిషి ఉన్నతుడుగా ఎదుగుతాడు. ఈ క్రమంలోనే స్థిత ప్రజ్ఞత్వం అలవడుతుంది.
లక్ష్యసాధన కోసం అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉండాలి. సంకల్పబలం గట్టిగా వుంటే కొండలను సైతం పిండి చెయ్యొచ్చు. ఇది లోక సత్యం. దీనిని అనుసరించి సకల జగత్తు లోక కల్యాణానికికోసం పనులు చేస్తుంటారు. ఈ గెలుపుకు లేదా ఈ ఫలితాన్ని పొందడానికి శక్తివంతమైన కృషే ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈవిధమైన అనుభవాల సమాహారమే జీవితాన్ని ఒక మలుపు తిప్పుతోంది.
ఏపని మొదలెట్టినా అది ఈశ్వరార్పితం చేసి స్వార్థం లేకుండా అన్నింటికీ కర్త, కర్మ, క్రియ సర్వమూ భగవంతుడే అనుకొంటే చాలు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు కర్తవ్యాన్ని చేసి ఫలితాన్ని భగవంతుడు పైన వదిలేస్తాం. అపుడు సత్ఫలితాలు పొందవచ్చు.
ఏపనిచేసినా నలుగురికీ ఉపయోగపడేటట్టుగా చేస్తే సకల మానవాళి శ్రేయస్సు కోరుకున్నట్టు అవుతుంది. జీవితనౌకను ఏటికి ఎదురీది గెలుపు దిశగా పయనించడంలోనే మానవ గొప్పదనం, ఓర్పు, సహనం, వివేకం బయటపడతాయి. ఈ లక్షణాలను సంకల్పంగా భావించి కృతనిశ్చయంతో ఆచరించేవారికి ఆ భగవంతుని కృపతో పాటు అన్నింటా విజయం లభిస్తుంది.
జీవిత పోరాట నేపథ్యంలోంచి అనుభవం రూపుకడుతుంది. దీనిని బేరీజువేసుకొంటూ స్వార్థాన్ని విడనాడీ మంచిపనులు చేస్తే అపుడు భగవంతుడు మెచ్చుతాడు. మానవ జన్మకు సార్థక్యం లభిస్తుంది. దీనివల్ల ఆత్మావలోకనానికి దారి ఏర్పడుతుంది. ఇదే మనకు ఆత్మవిచక్షణతో మెసలుకోవాల్సిన కర్మసిద్ధాంతాన్ని తేటతెల్లం చేస్తుంది. లోకంలో ప్రతి జీవికిఎపుడో ఒకప్పుడు ఇది అనుభవంలోకి వస్తూనే ఉంటుంది.
అంకితభావంతో సంకల్పించినదేదైనా ఫలించడానికి దైవం చేయూత లభ్యవౌతుంది. సదుద్దేశ్యంతో చేసే ఏపనికైనా మొదట్లో కాస్త ఆటంకాలు కలిగినా సరే వాటిని సులభంగా అధిగమించి ముందుకు వెళ్లడానికి దారి దానికదే ఏర్పడుతుంది. అపుడు నలుగురు కూడా కలిసి వస్తారు. అనుకున్నది సులభతరంగా ముగిస్తారు. అందుకే స్వార్థంకోసం శ్రమించకుండా నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తే అటు పుణ్యం ఇటు లోకంలో మంచి పేరు కూడా వస్తుంది. దీనికంతా స్వార్థాన్ని విడనాడాల్సి ఉంటుంది. అపుడే సమత్వబుద్ధికూడా ప్రకాశిస్తుంది. దానితో పాటు స్థిత ప్రజ్ఞత్వం అలవడుతుంది.
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, జీవిత చరిత్రలు ఇలా ఎన్ని చదివినా వాటి అంతరార్థం మరియు అవి బోధించే జీవన సారాంశం మాత్రం ఇదే. ఒక్క మంచిమాట ఎంతోమందికి వెలుగుబాట అవుతుంది. దీన్ని గుర్తుంచుకుని ఎపుడు కూడా మంచినే కోరుకోవాలి. వేదం కూడా నాలుగు వైపులనుంచి మంచిభావనలు నన్ను చేరాలను కోరు కోమనడం లో ఇదే సత్యం దాగుంది.
ప్రతి పనిని కూడా తార్కిక దృష్టితో దర్శిస్తే మానవ మేధస్సు ప్రకాశవంతం అవుతుంది. అపుడే మానవ కల్యాణం కోసం శ్రమించాలన్న బుద్ధివికాసం చెందుతుంది. దీనికంతా సత్సాంగత్యం కావాలి. ఎందరో జీవిత చరిత్రలను వేదాంగాలను, పురాణాలు చదవడం వల్లఇటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు.

***
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- నాగలక్ష్మి